News
News
వీడియోలు ఆటలు
X

Gudivada Tension : గుడివాడలో హై టెన్షన్, టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ

Gudivada Tension : గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది.

FOLLOW US: 
Share:

Gudivada Tension : కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. గుడివాడ శరత్ థియేటర్ వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పర ఘర్షణకు దిగాయి.  దీంతో ఇరువర్గాలను పోలీసులు అదుపుచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో కారణంగా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ-వైసీపీ వర్గీయుల పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. గుడివాడ శరత్ టాకీస్ వద్ద వైసీపీ జెండాలతో పలువురు కార్యకర్తల హల్ చల్ చేశారు. తెలుగుదేశానికి  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళ్తున్న మాజీ ఎంపీ మాగంటి బాబు కారును కొందరు అడ్డుకునేయత్నం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.   

టీడీపీ, వైసీపీ శ్రేణుల ఘర్షణ 

కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇరు పార్టీలు కార్యకర్తలు ఎవరూ కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఎదురుపడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎన్‌ఎస్‌జీ బలగాలను కూడా రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు.  

చంద్రబాబు రోడ్ షో 
  
కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు.. గుడివాడ నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.  రామనపూడి వద్ద గుడివాడ నియోజకవర్గంలోకి చంద్రబాబు రోడ్‌ షో ఎంటర్ అవ్వగానే... టీడీపీ నేతలు రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము, పిన్నమనేని వెంకటేశ్వరరావు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు రోడ్‌ షోకు పెద్ద సంఖ్యలో జనం, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. టీడీపీ శ్రేణులు ర్యాలీగా చంద్రబాబు రోడ్‌షోను అనుసరించారు. .  అంతకు ముందు బసవతారకం పుట్టినూరు కొమురవెల్లిలో ఎన్టీఆర్‌ దంపతుల విగ్రహాలకు చంద్రబాబు నివాళి అర్పించారు. అనంతరం నిమ్మకూరు నుంచి భారీ ర్యాలీగా గుడివాడ బయలుదేరారు.  గుడివాడలో కోతి బొమ్మసెంటర్, బస్ స్టాండ్ సెంటర్ మీదుగా చంద్రబాబు రోడ్‌ షో మొదలైంది. టీడీపీ అధినేతకు పార్టీ శ్రేణులు భారీ గజమాలతో  స్వాగతం పలికాయి. 

Published at : 13 Apr 2023 07:46 PM (IST) Tags: YSRCP Krishna News High Tension TDP Gudivada

సంబంధిత కథనాలు

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ రేపటి గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ రేపటి గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

Medical Collages: 50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం - ఏపీ, తెలంగాణకు ఎన్నంటే

Medical Collages: 50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం - ఏపీ, తెలంగాణకు ఎన్నంటే

Kodela Shivaram: మరో వివాదంలో కోడెల శివరాం, బాధితుల తీవ్ర ఆరోపణలు, హెచ్చరికలు!

Kodela Shivaram: మరో వివాదంలో కోడెల శివరాం, బాధితుల తీవ్ర ఆరోపణలు, హెచ్చరికలు!

Amaravati JAC: ఈ 92 రోజుల ఉద్యమాన్ని విరమిస్తున్నాం, ఇది చారిత్రక విజయం - అమరావతి జేఏసీ

Amaravati JAC: ఈ 92 రోజుల ఉద్యమాన్ని విరమిస్తున్నాం, ఇది చారిత్రక విజయం - అమరావతి జేఏసీ

టాప్ స్టోరీస్

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

IND VS AUS: 469కు ఆస్ట్రేలియా ఆలౌట్ - నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్!

IND VS AUS: 469కు ఆస్ట్రేలియా ఆలౌట్ - నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్!