Kodela Sivaram : చల్లబడిన కోడెల శివరాం - సత్తెనపల్లి టీడీపీ పంచాయతీ తీరినట్లేనా ?
కోడెల శివరం కన్నా లక్ష్మినారాయణతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో సత్తెనపల్లి టీడీపీలో పరిస్థితి సద్దుమణిగినట్లేనని భావిస్తున్నారు.
Kodela Sivaram : సత్తెనపల్లి తెలుగు దేశం రాజకీయం కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. కన్నా లక్ష్మినారాయణకు బాధ్యతలు అప్పగించటాన్ని వ్యతిరేకించిన కొడెల శివరాం లోకేష్ సమక్షంలో కన్నా తో కలసి పాదయాత్రలో పాల్గొన్నారు. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర సత్తెనపల్లి నియోజకవర్గానికి చేరింది. పాదయాత్రలోనే పార్టీ పరంగా ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఉన్న గొడవలు వర్గపోరు వంటి అంశాలను లోకేష్ సర్దుబాటు చేస్తున్నారు. అందులో భాగంగానే సత్తెనపల్లిలో కూడా కన్నా, శివరాం మధ్య సయోధ్య కుదిర్చారు. కన్నా లక్ష్మి నారాయణకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించటం పై తీవ్ర స్దాయిలో ఫైర్ అయిన కోడెల శివరాం ఆ తరువాత పార్టీ అధినాయకత్వానికి కూడ వ్యతికేకంగా మాట్లాడారు. కన్నాకు నియోజకవర్గ ఇంచార్జ్ గా ఇవ్వటం కోడెల కుటుంబానికి అన్యాయం చేశారని కూడా ఆరోపించారు. చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు.
లోకేష్‌తో చేతులు కలిపి పాదయాత్రలో నడిచిన కోడెల శివరాం
కోడెల శివరాం సొంతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇలాంటి సమయంలో పాదయాత్ర సత్తెనపల్లిలో అడుగు పెట్టే సరికి కోడెల శివరాం మనసు మార్చుకున్నారు. లోకేష్ పాదయాత్రలో కన్నా లక్ష్మినారాయణ, కోడెల శివరాం కలసి నడవటంతో పార్టీ నాయకులు అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణకు అధినేత చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారు. అనుభవజ్ఞుడైన నేత కావడం.. ఓ ప్రధాన సామాజికవర్గం కలసి వచ్చే అవకాశాలు ఉండటంతో కన్నాకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అందులో భాగంగానే కన్నా కు సత్తెనపల్లి నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు.
సత్తెనపల్లి టీడీపీ అంతా ఒకటి అయినట్లేనా ?
దీని పై మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం తీవ్ర అభ్యంతరం తెలిపారు. కోడెల శివప్రసాదరావు పార్టీ కోసం నిరంతరం పనిచేశారని, అలాంటి వ్యక్తి కుటుంబాన్ని కాదని ఆయన వారసుడిగా ఉన్న తనను పక్కన పెట్టి, బయట వ్యక్తులను తీసుకువచ్చి సత్తెపల్లిలో భాద్యతలు అప్పగించటం ఎంటని బహిరంగంగానే ప్రశ్నించటం సంచలనం అయ్యింది..ఈ నేపద్యంలో లోకేష్ పాదయాత్రలో ఇరువురు నేతలను కలుపుకొని లోకేష్ చేతులో చేతులు వేసుకొని నడటం తో వివాదం సర్దుమణిగిందని పార్టి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే ముఖ్యమని వాదన
ఇప్పుడున్న రాజకీయ పరిస్దితుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావటం చాలా అవసరమని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలపై ఎక్కువు ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ ల యాత్ర పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇక పార్టీలో యువ నాయకుడిగా ఉన్న నారా లోకేష్ 4వేల కిలోమీటర్ల పాదయాత్ర టార్గెట్ గా యువ గళం పేరుతో దూసుకుపోతున్నారు. ఇలా పార్టీ కార్యకలాపాలు, ప్రజల్లోకి వెళ్లేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించి వాడుకునేందుకు నాయకత్వం ప్లాన్ ను వేస్తోంది. పార్టీ విభేదాలు లేకుండా చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారు.