By: ABP Desam | Updated at : 10 Feb 2023 01:31 PM (IST)
జీవీఎల్పై కన్నా విమర్శలు
Kanna On GVL : ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కన్నా లక్ష్మినారాయణ చిన్నపాటి కలకలం రేపుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. తర్వాత కామ్ అయిపోవడం కొంత కాలంగా జరుగుతోంది. తాజాగా ఆయన మరోసారి సొంత పార్టీ నేత జీవీఎల్ నరసింహారావుపై మండిపడ్డారు. కాపు సంఘాలతో జీవీఎల్ నరసింహారావు సన్మానాలు చేయించుకుంటున్నారని.. కాపులకు ఆయనేం చేశారని ప్రశ్నించారు. గతంలోనూ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై కన్నా లక్ష్మినారాయణ విమర్శలు చేశారు. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీలో సంచలనం అయింది.
కాపు సంఘాలతో జీవీఎల్ సన్మానాలు చేయించుకోవడంపై కన్నా ఆగ్రహం
ఇటీవల విశాఖలో కాపు సంఘాల నేతృత్వంలో జరిగిన సమావేశంలో జీవీఎల్ నరసింహారావుకు సన్మానం చేశారు. పార్లమెంట్‌లో కాపు రిజర్వేషన్ల అంశంపై జీవీఎల్ ఓ ప్రశ్న వేశారని ఈ సన్మానం చేశారు. కేంద్రం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం చట్టం చేసింది. ఇక సర్టిఫికెట్లు జారీ చేయడమే మిగిలి ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రిజర్వేషన్లు చెల్లవని క్యాన్సిల్ చేసింది. ఈ అంశంపై పార్లమెంట్‌లో జీవీఎల్ ఓ ప్రశ్న అడిగారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన కాపు రిజర్వేషన్లు చెల్లుతాయా అని ప్రశ్నించారు. అవి చట్టబద్దంగానే ఉన్నాయని చెల్లుతాయని కేంద్రం సమాధానం ఇచ్చింది. అలా తాను ప్రశ్న అడిగినందుకే ఆ సమాధానం వచ్చిందని జీవీఎల్ నరసింహారావు కాపు సంఘాలతో సన్మానాలు చేయించుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇది కన్నా లక్ష్మినారాయణకు కోపం తెప్పించిందని చెబుతున్నారు.
కాపు రిజర్వేషన్ల అంశాన్ని వైఎస్ తెరపైకి తెస్తే.... చంద్రబాబు పూర్తి చేశారు !
గుంటూరులో మీడియాతో మాట్లాడిన కన్నా లక్ష్మినారాయణ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని.. ఆర్థిక, సామాజిక పరిస్థితులపై అధ్యయనం చేశారన్నారు. చంద్రబాబు ఈ రిజర్వేషన్లను పూర్తి చేశారన్నారు. చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్లను ప్రభుత్వం తొలగించిందని.. కన్నా చెప్పకనే చెప్పారు. ఈడబ్ల్యూఎస్ కోటా కిందకాపులకు రిజర్వేషన్లు పునరుద్ధరించాలని ఆయన డి్మాండ్ చేస్తున్నారు. జనసేన విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలపైనా కన్నా అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ .. తన నిర్ణయాలను తాను తీసుకోనివ్వాలని ఇతరులు ప్రభావితం చేసే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటారని స్పష్టం చేశారు.
బీజేపీ కార్యక్రమాల్లో ఇటీవల పాల్గొనని కన్నా లక్ష్మి నారాయణ
కన్నా లక్ష్మినారాయణ బీజేపీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఆయన జాతీయ కార్యవర్గ సమావేశాలకు వెళ్లలేదు. తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకూ వెళ్లలేదు. దీంతో ఆయన జనసేన లేదా టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే కన్నా వైపు నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఇటీవల బీజేపీ హైకమాండ్ నుంచి వచ్చిన ప్రతినిధి ఆయనతో చర్చలు జరిపారు. అయినప్పటికీ ఇలా మళ్లీ జీవీఎల్ పై బహిరంగ విమర్శలు చేయడం బీజేపీలో కొత్త చర్చకు కారణం అవుతోంది.
Vizag Port: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
AP Liquor Policy: మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ సర్కార్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Jaahnavi Kandula: జాహ్నవి కందులను హేళన చేసిన అధికారి సస్పెండ్, వెల్లడించిన సియాటెల్ పోలీసులు
GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
/body>