By: ABP Desam | Updated at : 15 Apr 2022 07:39 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కూలిపోయిన ధ్వజస్తంభం
Kakinada News : కాకినాడ జిల్లాలో ఓ ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టలో అపశృతి చోటుచేసుకుంది. కప్పీ తాడు తెగిపోవడంతో ఒక్కసారి ధ్వజస్తంభం భక్తులపై కూలిపోయింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో శ్రీ మీనాక్షి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముమ్మిడివరం, యానం ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, గొల్లపల్లి అశోక్ పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది.
తాడు తెగిపోయి కూలిన ధ్వజస్తంభం
నీలపల్లి నీలకంటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట సందర్భంగా ధ్వజస్తంభం పైకి ఎత్తుతుండగా దానిని ముట్టుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు పోటీ పడ్డారు. దీంతో తాడు తెగిపోయి స్తంభం ఒక పక్కకి కూలిపోయింది. ఈ నేపథ్యంలో ఒక మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఆ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన యానాం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆలయ ప్రతిష్ట కార్యక్రమం జరిపించారు. స్వామిజీ అనుగ్రహ భాషణం చేశారు.
పిడుగురాళ్లలో ఇలాంటి ఘటనే
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పందిటివారి పాలెంలోని రామాలయంలో ధ్వజస్తంభం ఏర్పాటులో అపశ్రుతి చోటు చేసుకుంది. రెండు క్రేన్ల సాయంతో ధ్వజస్తంభం నిలబెడుతున్నప్పుడు పైభాగం కొంత విరిగి కింద పడిపోయింది. ఫిబ్రవరి నెలలో ఈ ఘటన జరిగింది. పిడుగురాళ్ల మండలం పందిటివారి పాలెంలో పురాతన రామాలయంలో పునరుద్ధరణ పనులు చేపట్టారు. రామాలయం ఎదుట 1963లో భారీ ధ్వజస్తంభాన్ని ఏర్పాటుచేశారు. 44 అడుగుల ఎత్తుతో 40 టన్నుల బరువుండే రాతి ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టించారు. గుత్తికొండ బిలం కొండల్లో ఏకశిలా నుంచి భారీ ధ్వజస్తంభాన్ని తొలిచి ఈ ఆలయంలో ప్రతిష్టించారు.
అయితే ఇటీవల ఆలయ కమిటీ గుడిని పునర్ నిర్మించాలని నిర్ణయించింది. పురాతన ధ్వజ స్తంభాన్ని కొద్దిగా పక్కకి జరపాలన్నారు. ధ్వజస్తంభం భారీగా ఉండటంతో క్రేన్‌ల సాయంతో పని పూర్తి చేయాలనుకున్నారు. విజయవాడకు చెందిన క్రేన్ ఆపరేటర్లతో ధ్వజ స్తంభాన్ని పక్కకు జరిపేందుకు సిద్ధం అయ్యారు. రెండు భారీ క్రేన్‌లతో ఇంజనీర్ల సలహాతో ధ్వజ స్తంభాన్ని పక్కకి జరిపే ప్రయత్నం చేశారు. స్తంభాన్ని భూమిలో నుంచి పైకి తీసి కొంచెం పైకి ఎత్తగానే ఒక్కసారిగా ధ్వజ స్తంభంలోని రెండు ముక్కలైపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Breaking News Live Updates: బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు, కేఏ పాల్ ఫైర్
Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
Mla Kotamreddy Sridhar Reddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఛాతిలో నొప్పి, చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు!
Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ - టీడీపీ నిర్ణయం !
NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
KTR Davos Tour : దావోస్ సదస్సు ద్వారా తెలంగాణకు రూ. 4200 కోట్ల పెట్టుబడులు - చివరి రోజూ కేటీఆర్ బిజీ మీటింగ్స్ !
AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !
US Monkeypox Cases : అమెరికాలో 9 మంకీపాక్స్ కేసులు - వేగంగా విస్తరిస్తోందని అగ్రరాజ్యం ఆందోళన