అన్వేషించండి

Tadipatri JC vs ASP: ASP రోహిత్ .. బుధవారం వస్తా .. దమ్ముంటే అడ్డుకో - తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్

JC Prabhakar Reddy : తాడిపత్రిలో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అవినీతి పరుడని మండిపడ్డారు.

JC Prabhakar Reddy Vs ASP Rohit Kumar Chowdhury:  అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మధ్య వివాదం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విద్యుత్ శాఖకు సంబంధించిన ఓ అంశంలో ఏర్పడిన వివాదం కారణంగా ..కేసులు నమోదయ్యాయి. జేసీ వర్గీయులపై కేసులు నమోదు కావడంతో ప్రభాకర్ రెడ్డి .. ఏఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  
  
కొద్ది రోజుల కిందట తాడిపత్రి యాడికి ప్రాంతంలోని  విద్యుత్ శాఖ ఆఫీస్‌లో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు  దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ASP రోహిత్ కుమార్ చౌదరి కేసు నమోదు చేశారు. ఇది జేసీని ఆగ్రహానికి గురి చేసింది. జేసీ మీడియాతో మాట్లాడుతూ ASPని అవినీతి అధికారి అంటూ ఆరోపించారు.  కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నాడని ఆరోపించారు. తాజాగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఏ ఎస్పీని తాను ఎక్కడా చూడలేదన్నారు. రోహిత్ కుమార్ చౌదరి ఏ ఎస్పీగా పనికి రాడు..రాళ్ల దాడి జరుగుతుంటే ఇంట్లో కూర్చొని ఘర్షణ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడని ఆరోపించారు. 

తాడిపత్రిలో నువ్వు వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గలేదు.. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందని.. నువ్వు బయటికి రావాలంటే ఎస్ఐ, సీఐ, కానిస్టేబుల్ లేనిది బయటికి రాలేవన్నారు. గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడుపై కూడా మండిపడ్డారు. దాడులు చేస్తామని హెచ్చరించారు. గతంలో వైసీపీ హయాంలో డీఎస్పీగా ఉన్న చైతన్యపై ఆరోపణలు చేసేవారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు డిఎస్‌పి చైతన్య కంటే ఎఎస్‌పి పనికి రాని వ్యక్తి అని, రోహిత్ ఇంటికి ముందుకొచ్చి పడుకొని నిరసన తెలిపితే జవాబు లేదన్నారు. ఎస్‌పిని చూసి మౌనంగా ఉన్నానని లేదంటే ఇంట్లోకి దూరేవాడినని  ప్రభాకర్ రెడ్డి హ హెచ్చరించారు. ఐదేళ్లు కష్టపడితేనే ఈ స్థితిలో ఉన్నానని, భార్య పిల్లలను అందరిని మావాళ్లు పొగొట్టుకున్నారన్నారు.  

బుధవారం ఎఎస్ పి దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. ఇప్పటి వరకు 130 కేసులు ఉన్నాయని, మరో పది కేసులు పెట్టిన కూడా భయపడనని, తన జీవిత కాలంలో మర్యాదగా బతికానని మర్యాదగానే చస్తానన్నారు. తనకు ఎవరంటే భయం లేదని, తాను రాజకీయాలు చేయడానికి రాలేదని, తనకు పోలీసులంటే భయం లేదన్నాడు. ఎఎస్ పి తో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పోలీసులకు చాలా మర్యాద ఇస్తామని, రోహిత్ మరో చైతన్య మారారని ఎద్దేవా చేశారు. తన దగ్గర ఉన్న అన్ని రికార్డులు తీసుకుని పోలీసుల ముందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి వస్తానని జెసి సవాల్ విసిరారు. 

మరో వైపు ఏఎస్పీ రోహిత్ కుమార్  పోలీసుల జోలికొస్తే తాట తీస్తానంటూ పరోక్షంగా జెసి ప్రభాకర్ రెడ్డి ఉద్దేశించి హెచ్చరించినట్లుగా ప్రచారం జరుగుతోంది.  తాడిపత్రిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎఎస్ పి హెచ్చరికలు జారీ చేశారు.  

టాప్ హెడ్ లైన్స్

Bhuma Akhila Priya: అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Deepam 2 Scheme: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
Pawan Kalyan Names New Plant: తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతి - క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్‌గా పేరు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతి - క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్‌గా పేరు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget