అన్వేషించండి

JC On DSP : భీమవరం వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ఆయనే - జేసీ ప్రభాకర్ రెడ్డి జోస్యం నిజమవుతుందా ?

తాడిపత్రి డీఎస్పీ చైతన్య వైఎస్ఆర్‌సీపీ తరపున భీమవరం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. అందుకే చట్టం, రాజ్యాంగానికి వ్యతేరికంగా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.

JC On DSP :  వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడేందుకు చాలా మంది అధికారులు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ జాబితాలో ఇప్పటి వరకూ సివిల్ సర్వీస్ అధికారుల పేర్లే ఎక్కువగా వినిపించేవి. అయితే ఇప్పుడు కొత్తగా ఇతర ర్యాంకుల అధికారుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తాడిపత్రి డీఎస్పీ చైతన్య భీమవరం నుంచి వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్ పై ఎన్నికల బరిలో నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారని ... టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇందుకు లాజిక్కులు కూడా ఆయన చెబుతున్నారు. 

వైఎస్‌ఆర్‌సిపి ఏజెంట్ గా చైతన్య వ్యవహరిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణ

వైఎస్‌ఆర్‌సిపి ఏజెంట్ గా చైతన్య వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీఎస్పీ ఇద్దరూ అక్రమ ఇసుక వ్యాపారంలో భాగస్వాములని అన్నారు. డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన వైఎస్‌ఆర్‌సిపి కార్యాలయంగా మార్చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఏది చెపితే అది చేస్తున్నారని దుయ్యబట్టారు.ఒక ఆడపిల్లపై పగబట్టి 307 కేసును నమోదు చేశారని అన్నారు. తన మీద 59 కేసులు పెట్టారని తెలిపారు. తమకు చెందిన 861 మందిపై 307 సహా పలు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. వందల మంది టిడిపి కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులపై తాను ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదని. చివరకు దీనిపై ఒక డీఐజీ వాస్తవాలను చెప్పారని అన్నారు. 

డీఎస్పీ చైతన్యపై ఇప్పటికే పన్నెండు ప్రైవేసు కెసులు పెట్టిన టీడీపీ నేతలు

ఆయనపై ఏకంగా 12 ప్రైవేట్ కేసులు పెట్టామన్నారు. రాబోయే రోజుల్లో ఆయన అక్రమాలను వదిలిపెట్టేది లేదన్నారు. డీఎస్పీ అధికార పార్టీకి కార్యకర్తలా పనిచేస్తూ.. ఎమ్మెల్యే చెప్పినట్లుగా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం మారితే ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి..  డీఎస్పీ చైతన్య వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి వైఎస్‌ఆర్‌సిపి తరపున పోటీ చేయాలనుకుంటున్నారని ఆరోపించారు.   తాడిపత్రి డీఎస్పీ క్యారెక్టర్‌ లేని వ్యక్తి అన్నారు. తాడిపత్రి పోలీస్‌ సబ్‌ డివిజన్‌లోని పెద్దపప్పూరు, పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్‌ల ఎస్‌ఐలు డీఎస్పీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇసుక, మట్కా, క్రికెట్‌, గంజాయి మాఫియాలతో డీఎస్పీకి సంబంధాలున్నాయని ఆరోపించారు జేసీ.

చాలా కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు

తాడిపత్రి డీఎస్పీ చైతన్యపై తెలుగుదేశం పార్టీ నేతలు చాలా కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేతలు ఏం చేసినా చూస్తూ ఉంటారని..కానీ టీడీపీ నేతలపై మాత్రం పోలీసులు ఉద్దేశపర్వకంగా దాడులు చేస్తూంటారని..కేసులు పెడుతూ ఉంటారని ఆరోపిస్తూంటారు. డీఎస్పీ చైతన్య తీరు రాజకీయంగా కాకుండా విధి నిర్వహణ పరంగా కూడా అనేక విమర్శలకు కారణం అవుతోంది. ఇప్పుడు అనూహ్యంగా ఆయన పేరు భీమవరం నుంచి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా ప్రచారంలోకి రావడం చర్చనీయాంశమవుతోంది. 

వైసీపీ పాలనలో రైతుల పరిస్థితి అధ్వానం, అన్నదాతలపై వాలంటీర్ల పెత్తనమా? - చంద్రబాబు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget