అన్వేషించండి

Pawan Kalyan : విస్సన్నపేట దళితల భూముల్లో వైసీపీ నేతల దోపిడీ - కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని పవన్ ప్రకటన !

విస్సన్నపేట భూములపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. దళితుల భూమిని దోపిడీ చేశారని మండిపడ్డారు.

Pawan Kalyan : రాష్ట్రంలో యువతకు ఉపాది, జాబ్ క్యాలెండర్లు లేవు కానీ వైసీపీ నేతలు మాత్రం పెద్ద అక్రమ వెంచర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.  సోమవారం విసన్నపేట భూములను సందర్శించిన పవన్ ఆపై మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువతకు ఉపాది లేదని.. జాబ్ క్యాలెండర్ లేదని మండిపడ్డారు. అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. వోల్టా చట్టం తుంగలోకి తొక్కారన్నారు. ఉత్తరాంధ్ర మీద వైసీపీ ప్రభుత్వానికి ప్రేమ లేదని.. కేవలం ఉత్తరాంధ్ర భూములు మీదే ప్రేమ అంటూ వ్యాఖ్యలు చేశారు. విస్సన్నపేట ఉరిలోకి రావడానికి ఇరుకు రోడ్ ఉందని.. కానీ వీరి రియల్ ఎస్టేట్‌కు మాత్రం పెద్ద రోడ్ వేసుకున్నారని మండిపడ్డారు.                                             

‘‘మంత్రి గుడివాడ అమర్నాథ్ కాదు.. నేను సీఎంనే అడుగుతున్నాను. ఏంటీ ఈ దోపిడీ, దాష్టీకం’’ అంటూ ప్రశ్నించారు. కొండలను పిండి చేశారని.. ప్రభుత్వ భూములు, రైతులు భూములను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విసన్న పేట భూములు మీద కేంద్ర పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అలాగే గ్రీన్ ట్రిబ్యునల్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర భూములను దోచేస్తుంటే మాట్లాడేవాడు లేడని, స్థానిక ఎమ్మెల్యేలు కూడా వత్తాసు పలుకుతున్నారని  మండిపడ్డారు.                      

విస్సన్నపేట గ్రామంలో  అనుమతులు లేనిచోట రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇక్కడ ఉన్న 600 ఎకరాలు పోరంబోకు, దళితుల భూములని, అంతేకాదని, ఇది క్యాచ్‌మెంట్ ఏరియా అన్నారు.   తెలంగాణలోను ఇలాగే దోచేస్తే తన్ని తరిమేశారన్నారు. క్యాచ్‌మెంట్ ఏరియాలో రియాల్టీ వ్యాపారం ఎలా చేస్తారని ప్రశ్నించారు. తాను సీఎం జగన్‌కే చెబుతున్నానని, మధ్యలో వచ్చి మాట్లాడే మంత్రులను పట్టించుకోనన్నారు. సీఎంగా ఉంటూ ఆయన చేసే అవినీతిని బయటపెడతామన్నారు. ఈ అక్రమాలకు జగన్, రెవెన్యూ శాఖ, కలెక్టర్, అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రాథమిక హక్కులను ఎలా ఉల్లంఘిస్తారని ప్రశ్నించారు. ఇక్కడ దళితులకు ఇచ్చిన భూములు ఉన్నాయని, ఇక్కడ రోడ్లు ఎలా వేస్తారు? అని నిలదీశారు. అడ్డగోలుగా భూములను దోచేస్తుంటే కలెక్టర్ ఏం చేస్తున్నారన్నారు.

డీఎస్సీ నోటిఫికేషన్ లేదు.. జాబ్ క్యాలెండర్ లేదు... కానీ వేల కోట్లు దోచుకోవడానికి వైసీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వెంచర్లు మాత్రం వేస్తారన్నారు. గ్రామాల్లో కనీసం రోడ్లు లేవని, కానీ ఇక్కడి రియాల్టీ వెంచర్‌లో 100 అడుగుల రోడ్డు, హెలిప్యాడ్ ఉందన్నారు. దళితుల భూములు, సాగునీటి ప్రాజెక్టులు ఆక్రమించి రూ.13వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారన్నారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారని, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూములు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.   స్థానిక రైతులు భూకుంభకోణంపై ఫిర్యాదు చేశారని, అందుకే దీనిని పరిశీలించేందుకు వచ్చినట్లు చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget