Pawan Kalyan: జనసేనానికి పోటా పోటీగా ఫోన్లు - ఆ రెండు పార్టీలు ఏం మెసేజ్ ఇస్తున్నాయి !
Janasena Chief Pawan Kalyan: జనసేనాని ఉద్దేశపూర్వకంగానే బీజేపీ, టీడీపీకి దూరంగా ఉంటున్నారనే గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. బీజేపితో పొత్తు ఉందని పదే పదే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
జనసేనాని విశాఖ పర్యటన వివాదంపై ఆ రెండు పార్టీలు చెబుతున్నాయనే అంశంపై రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. మెన్నటివరకు ఆ రెండు పార్టీలకు పవన్ దూరంగా ఉంటున్నారంటూ జరిగిన ప్రచారానికి విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడి ఘటన తరువాత కాస్త క్లారిటి వచ్చినట్లు కనిపిస్తోంది. విశాఖ పర్యటన తరువాత రాజకీయ పరిస్దితులు మారాయా అనే చర్చ నడుస్తుంది. జనసేనాని ఉద్దేశపూర్వకంగానే బీజేపీ, టీడీపీకి దూరంగా ఉంటున్నారనే ప్రచారం గత కొంతకాలం నుంచి ఏపీలో జరుగుతోంది. ముఖ్యంగా బీజేపితో పొత్తు ఉందని పదే పదే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఢిల్లీలో పవన్‌కు దూరంగా బీజేపీ పెద్దలు !
పవన్ టీడీపీకి దగ్గర అవుతున్నారని, అందుకే బీజేపీ నేతలు పవన్ ను దూరం పెడుతున్నారని కూడా ప్రచారం జరిగింది. బీజేపి అదిష్టానం చాలా సార్లు పవన్ ను కనీసం అపాయింట్ మెంట్ కూడ ఇవ్వలేదని, అందుకే కాషాయ పార్టీ నేతలతో పవన్ దూరంగా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావించారు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ బీజేపి నేతలను కలుసుకునేందుకు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ లేకపోవడంతో ఎవరినీ కలవకుండానే తిరిగొచ్చారని చర్చ నడిచింది. ఇదే విషయంలో సోషల్ మీడియా కేంద్రంగా పవన్ పై ట్రోలింగ్ జరిగింది. వైసీపీ నేతలు ఈ విషయంలో పవన్ ను నేరుగానే టార్గెట్ చేసి విమర్శలు చేశారు.
సరిగ్గా అదే సమయంలో బీజేపి నేతలకు వైసీపీ కీలక నేతలు టచ్ లోకి వెళ్లటం, పవన్ కు బీజేపి నేతలు అపాయింట్ మెంట్ ఇవ్వలేదనే ప్రచారం జరగడంతో దూరం పెరిగిందా అనే అనుమానం ప్రజల్లోనూ మొదలైంది. పవన్ అసంతృప్తికి కారణం అయిన వరుస ఘటనలతో దూరం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే విషయంలో జనసేన నాయకుల కన్నా, బీజేపి నేతలే అనేక సార్లు క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. జనసేన తమతోనే ఉందని ఇరు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని నేతలు అన్నారు. దీనిపై జనసేన నాయకులు మాత్రం అంతగా స్పందించిన దాఖలాలు కనిపించలేదు. పవన్ కూడా బీజేపి విషయంలో ఎదురయిన పలు అంశాలపై మాట్లాడేందుకు కూడ చాలా సార్లు నిరాకరించారు. కానీ తనకు మద్దతు ఉందని మాత్రం పలుమార్లు ప్రస్తావించారు.
టీడీపీ విషయంలోనూ జససేన వ్యవహరం పై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. గత ఎన్నికల తరువాత జనసేన టీడీపీకి దూరంగా వచ్చింది. బీజేపికి దగ్గరగా ఉన్నామని, ఆ పార్టీల పొత్తుపై క్లారిటీ వచ్చింది. కానీ టీడీపీ నేతలు మాత్రం పవన్ ను, ఆయన పార్టీ నేతలను దూరం పెట్టలేదని చెబుతున్నారు. ఇక్కడ రాజకీయ కారణాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీకి, బీజేపి నేతలు కూడా టచ్ లో ఉన్నారు. టీడీపీ కీలక నేతలు బీజేపీలో చేరినప్పటికి తెర వెనుక మాత్రం వారంతా టీడీపీకి దగ్గరగా ఉన్నారనే ప్రచారం లేకపోలేదు. ఇదే సమయంలో టీడీపీ నేతలు జనసే ను అదే సాఫ్ట్ కార్నర్ లో చూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక్కడే మరో కీలక అంశంపై చర్చ నడుస్తుంది. గతంలో పలుమార్లు పవన్ ప్రసంగాల్లో ఇప్పటి వరకు మేం తగ్గాం.. ఇకపై మీరు తగ్గాలని వ్యాఖ్యలు చేశారు. అవి టీడీపీని ఉద్దేశించి చేసినవేనని ఏపీ ప్రజలు సైతం అనుకున్నారు.
పొత్తుల విషయం పరిశీలిస్తే, టీడీపీకి పవన్ సీట్ల విషయంలో కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో జనసేన, టీడీపీ, బీజేపీ దారెటు వచ్చే ఎన్నికల్లో పొత్తు ఎవరితో ఉంటుందోననే ఆసక్తి మొదలైంది. ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల్లో పవన్ మరో కామెంట్ కూడా చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న ఓటును చీలకుండా చూస్తామని పవన్ వ్యాఖ్యానించారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు అన్ని కలుస్తాయని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు జనసేనాని.
విశాఖ వేదికగా పోటా పోటీ ఫోన్ లు...
విశాఖ వేదికగా జనసేనానిపై వైసీపీ పొలిటికల్ టార్గెట్ చేసింది. ఈ పరిస్థితుల్లో మూడు పార్టీలు కలిసే ఉన్నాయని, గతంలోలాగ కూటమి ఏర్పాటు చేస్తాయా అని వైసీపీలో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. బీజేపి ఏపీ నాయకులు, జాతీయ నేతలు పవన్ కు మద్దతుగా నిలిచారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా పవన్ కు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పవన్ పట్ల వ్యవహరించిన తీరును బీజేపీ, టీడీపీ తప్పుపట్టాయి. ఇదే వేదికగా మూడు పార్టీల నేతలు భవిష్యత్ రాజకీయాలుపై కలిసి అడుగులు వేయనున్నాయా అని చర్చ మళ్లీ మెదలైంది.