అన్వేషించండి

Janasena Politics : కృష్ణా జిల్లాలో జనసేనకు కేటాయించే సీట్లపై ఉత్కంఠ - నాలుగు స్థానాలపై పవన్ ఒత్తిడి !

Janasena Politics : కృష్ణా జిల్లాలో నాలుగు సీట్లను జనసేన డిమాండ్ చేస్తోంది. టీడీపీ ఏ సీట్లను కేటాయిస్తుందన్నదానిపై స్పష్టత లేదు.

Janasena  : ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ - జనసేన మధ్య సీట్ల పంచాయితీ తేలటం లేదు. ఇప్పటి వరకు జనసేనకు ఎన్ని సీట్లను కేటాయిస్తారనే అంశంపై తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో జనసేన పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో మాత్రం సీట్ల కేటాయింపుపై ఇప్పటికే ప్రచారం హొరెత్తుతోంది. 23 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు పార్లమెంట్ సీట్లు కేటాయిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన నాలుగు స్థానాలు డిమాండ్ చేస్తుంటే...తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇవ్వడానికి రెడీగా ఉంది.. ఏ ఏ సీట్లు ఇస్తుందన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది.  

నాలుగు సీట్లు కావాలంటోన్న జనసేన

ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కిరావడం లేదు. జిల్లాలో జనసేన కచ్చితంగా నాలుగు స్థానాలను కేటాయించాలని...తెలుగుదేశం పార్టీకి తేల్చి చెప్పినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా...అటు టీడీపీ నేతలు కూడా సీట్ల కేటాయింపు వ్యవహారంలో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. జనసేన నాలుగు సీట్లు అడుగుతుంటే...రెండు లేదా మూడు సీట్లకు మాత్రమే పరిమితం చేయాలనే ఉద్దేశంలో టీడీపీ స్థానిక నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, పెడన, కైకలూరు స్థానాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

జనసేన కోరుతున్న స్థానాల్లో  బలమైన అభ్యర్థులు                           

నాలుగు స్థానాల్లో   జనసేన నుంచి పోటీ చేయటానికి అభ్యర్థులు కూడా పూర్థి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ నుంచి క్లారిటీ కోసం మాత్రమే ఎదురుచూస్తున్నారు. కీలకమైన బెజవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే...ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా పోతిన వెంకట మహేష్ దాదాపు ఖరారైనట్టుగానే పార్టీ వర్గాల సమాచారం. అయితే టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, జలీల్ ఖాన్‌...తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కైకలూరు సీటును కూడా జనసేన ఆశిస్తోంది. ఇక్కడ నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. 

పెడన సీటు కోసం పోటాపోటీ                

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కుమారుడి కోసం పెడన సీటును జనసేన నేతలు కోరుతున్నారు. మరోవైపు ఇదే అసెంబ్లీ సీటును మాజీ మంత్రి కాగిత వెంకట్రావు కుమారుడు  కాగిత కృష్ణప్రసాద్ ఆశిస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పటికే కాగిత  కృష్ణప్రసాద్ తన ప్రచార కార్యక్రమాల్లో పెడన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ...స్టిక్కర్లు వేసుకొని కార్యక్రమాలు చేస్తున్నారు నియోజకవర్గంలో కాపు, గౌడ వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో...ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై టీడీపీ, జనసేన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. 

అవనిగడ్డలోనూ జనసేన నేత విస్తృత ప్రచారం

అవనిగడ్డ నియోజకవర్గం సీటు కూడా తమకే ఇవ్వాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. జనసేన అభ్యర్థిగా విక్కుర్తి శ్రీనివాస్ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. శ్రీనివాస్ ఇప్పటికే పవన్ కల్యాణ్ ను కూడా కలిశారని, ఆయన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. ఇక్కడి నుంచి సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే జనసేన మాత్రం ఖచ్చితంగా ఈ టికెట్ ఇవ్వాల్సిందేనని తెలుగుదేశంపార్టీపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SC On Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీంకోర్టు
తిరుమల లడ్డూ వివాదంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీంకోర్టు
DMK on Pawan Comments : పవన్ కల్యాణ్‌పై డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు - తగ్గేది లేదని క్లారిటీ
పవన్ కల్యాణ్‌పై డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు - తగ్గేది లేదని క్లారిటీ
Family Digital Card: తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?
తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?
Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SC On Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీంకోర్టు
తిరుమల లడ్డూ వివాదంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీంకోర్టు
DMK on Pawan Comments : పవన్ కల్యాణ్‌పై డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు - తగ్గేది లేదని క్లారిటీ
పవన్ కల్యాణ్‌పై డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు - తగ్గేది లేదని క్లారిటీ
Family Digital Card: తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?
తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?
Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
PM Kisan Yojana: రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!
రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!
Pawan Kalyan BJP : పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
Embed widget