Jagananna Videshi Vidya Deevena : టీడీపీ నేత కుమార్తెకు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఆర్థికసాయం
Jagananna Videshi Vidya Deevena : టీడీపీ నేత కుమార్తెకు విదేశీ విద్యా దీవెన పథకం కింద ఆర్థిక సాయం అందించారు. పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా ఈ సాయం అందించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
Jagananna Videshi Vidya Deevena : ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పైరవీలకు ఉండదని, తన, పర బేధాలు లేవని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారు. తాజాగా ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ పథకానికి తెలుగుదేశం పార్టీ నాయకుడి కుమార్తెను ఎంపిక చేశారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అందించాలని సీఎం జగన్ పదేపదే చెబుతుంటారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి.
విజయనగరం జిల్లా వంగర మండలం సంగాం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచి బొడ్రోతు శ్రీనివాసరావు-వేణమ్మల కుమార్తె శైలజ ఈ పథకానికి సెలక్టయ్యారు. శుక్రవారం తొలి విడతగా ఆమె ఖాతాలో రూ.13,99,154 ప్రభుత్వం జమ చేసింది. రెండేళ్లలో శైలజ చదువుకు ప్రభుత్వం సుమారు రూ. 84 లక్షలు అర్థికసాయం అందిస్తుందని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు.
ఉన్నత విద్యకు రాచబాట జగనన్న విదేశీ విద్యాదీవెన. #JaganannaVidesiVidyaDeevena pic.twitter.com/gLk234Cmew
— YSR Congress Party (@YSRCParty) February 6, 2023
థ్యాంక్స్ టూ సీఎం జగన్మోహన్ రెడ్డి
జగన్న విద్యాదీవెన పథకం కింద ఆర్థిక సాయం అదడంతో విద్యార్థిని శైలజ ఆనందం వ్యక్తం చేశారు. జగనన్న విద్యాదీవెన గురించి న్యూస్ లో చూసి అప్లయ్ చేశానని చెప్పారు. ప్రపంచంలోనే వంద యూనివర్సిటీల్లో ఒకటైన వాషింగ్టన లో సీటు పొందానని చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆమె థ్యాంక్స్ చెప్పారు.
జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం
జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంలో ఎంపిక చేసినందుకు మఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని శైలజ తండ్రి శ్రీనివాసరావు భావోద్వేగానికి లోనయ్యారు. జనం కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. తన కూతురు హైదరాబాద్ లో ఐఐటీ చదివిందని, ఇప్పుడు జగనన్న విద్యాదీవెనతో మంచి యూనివర్సీటీలో సీటు సంపాదించిందన్నారు. భవిష్యత్తులో తన కూతురు ఏపీ అభివృద్ధికి పాటుపడుతుందన్నారు.
జగనన్న విద్యాదీవెన ప్రయోజనాలు
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేద వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య కోర్సులు చదివేందుకు ఆర్థికసాయం చేడమే జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రధాన ఉద్దేశం. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా.. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో టాప్200 జాబితాలో నిలిచిన యూనివర్సిటీల్లో.. ఎంబీబీఎస్, పీజీ, పీహెచ్‌డీ స్థాయి కోర్సుల్లో ప్రవేశం ఖరారు చేసుకున్న వారికి ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తారు. క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారంటాప్-100 జాబితాలో ఉన్న యూనివర్సిటీల్లో ప్రవేశం పొందితే మొత్తం ట్యూషన్ ఫీజు(100శాతం)ను చెల్లిస్తారు. విదేశీ విద్యా దీవెన పథకం కింద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100% ట్యూషన్ ఫీజులను SC, ST, BC మరియు మైనారిటీ విద్యార్థులకు ₹1.25 కోట్ల వరకు మరియు టాప్ 100 విశ్వవిద్యాలయాలలో ర్యాంకులు సాధించిన EBC విద్యార్థులకు ₹1 కోటి వరకు రీయింబర్స్‌మెంట్ చేస్తుంది. .
క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం 101-200 జాబితాలోని యూనివర్సిటీల్లో ప్రవేశం పొందితే.. ట్యూషన్ ఫీజు మొత్తంలో యాభై శాతం లేదా రూ.50 లక్షలు(ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని)సాయంగా అందజేస్తారు. ఆర్థిక సహాయం విమాన ఛార్జీలు మరియు వీసా ఫీజు వంటి అంశాలకు రీయింబర్స్‌మెంట్ రూపంలో వస్తుంది. విద్యార్థులు వారి ఇమ్మిగ్రేషన్ కార్డుల (I-94) రసీదుని అనుసరించి, మొదటి చెల్లింపు చేయబడుతుంది. మొదటి సెమిస్టర్ ఫలితాలను అనుసరించి రెండో, సెకండ్, థర్డ్ సెమిస్టర్‌లు పూర్తయిన తర్వాత మూడో ఇన్ స్టాల్ మెంట్ జమ అవుతుంది. అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం ₹8 లక్షలకు మించకూడదనేది ప్రమాణం ఉంది.