By: ABP Desam | Updated at : 02 Jan 2023 04:14 PM (IST)
జగన్(ఫైల్ ఫోటో)
Jagan Mohan Reddy Diet Secret: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిట్‌నెస్‌లో చాలా మందికి రోల్ మోడల్. ఆయన ఫిజికల్ ఫిట్‌నెస్, డ్రెస్ సెన్స్ చాలా మందికి నచ్చుతుంది. ఆయన్ని అభిమానించే వాళ్లు చాలామంది దాన్ని యాజ్ టీజ్‌గా ఫాలో అయిపోతున్నారు. అలాంటి ఫిజిక్ కోసం ఆయన చేస్తారనేది తెలిసింది చాలా తక్కువ మందికే. ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటే జగన్... తన వ్యక్తిగత విషయాలపై ఎప్పుడూ స్పందించరు. అందుకే చాలామందికి ఆయన రెగ్యులర్ డైట్, అండ్ ఫిట్‌నెస్ విషయాలు తెలియవు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. మద్యానికి ఆయన దూరం. ఎన్నోసార్లు ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. ఓ లీడర్ ఇలా ఉంటేనే మిగతా వాళ్లు ఫాలో అవుతారని ఆయన విశ్వాసం. రోజూ ఏం తింటారు. అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. దీనిపై మంత్రి రోజా చిన్న లీక్ ఇచ్చారు.
ఇలా రోజా లీక్ ఇచ్చారో లేదో అప్పుడే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయిందీ విషయం. ఇంతకీ జగన్ రెడ్డి డైట్ సీక్రెట్ ఏంటీ. జగన్ డైట్ ఫాలో అయితే జీరో సైజ్ పక్కా అని రోజా అనడంలో ఉన్న అర్థమేంటీ.
సీఎం జగన్ ఫుడ్ మెనూ
జగన్ మితాహారి అని రోజా చెప్పుకొచ్చారు. ఒక పుల్కా, కొన్ని బాయిల్డ్ వెజిటబుల్స్ తింటారని వెల్లడించారు రోజా. మాంసం వారానికి ఒకసారి మాత్రమే తీసుకుంటారని తెలిపారు. నాన్‌వెజ్‌లో ఆయనకు కీమా అంటే చాలా ఇష్టమని చెప్పారు. అది కూడా కొంచమే తింటారని వివరించారు. పాదయాత్ర సమయంలో నగరిలో బస చేసినప్పుడు.. ఆయన మెనూ తనకి తెలిసిందని చెప్పుకొచ్చారు మంత్రి రోజా.
జగన్ ఎనర్జీ డ్రింక్ ఇదే
ఫుడ్ మెనూనే కాదు..సీఎం జగన్ ఎనర్జీ డ్రింక్ ఏంటో కూడా రివీల్ చేశారు మంత్రి రోజా. ఓ లీటరు పాలలో పచ్చి అల్లం వేసి బాగా మరిగిస్తే..కేవలం ఓ గ్లాసు పాలు మాత్రమే అవుతాయి.. ఆ పాలనే ప్రతిరోజు జగన్ తాగుతారని చెప్పుకొచ్చారు. అది హెల్త్‌కి చాలా మంచిదని రోజా చెప్పుకొచ్చారు. ఇకపై ఈ చిట్కా అందరికి తెలుస్తుందని ఆమె అన్నారు.
మామిడి పులిహోర, చిత్రాన్నం ఇష్టం
ఆరోగ్యం విషయంలో జగన్ చాలా కేర్ తీసుకుంటారు. అందుకే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉంటారట. మామిడికాయ తురిమి చేసే పులిహోరను సీఎం ఇష్టంగా తింటారట. ఇక రాయలసీమ ఫేమస్ చిత్రాన్నం కూడా రెగ్యులర్‌గా తింటారట. పల్లీలు, మొక్కజొన్న పొత్తులు కూడా రెగ్యులర్‌గా తీసుకుంటారట.. ఫ్రూట్స్ జ్యూస్‌లు ఆయన డైలీ మెనూ ఉంటాయట.
ఆంధ్రప్రదేశ్‌లో టాప్ హెడ్‌లైన్స్ ఇవే!
నెల్లూరు పోలీసులకు షాకిచ్చిన దొంగ- వాగులోకి దూకి పరారీ
నెల్లూరు రోడ్లపై ఈడ్చికెళ్తా- కోటం రెడ్డికి ఫోన్లో వార్నింగ్- విన్నోళ్లకు బూతులు బోనస్!
తెలంగాణలోని ఆ ఏడు జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలెర్ట్!
Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!
Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!