అన్వేషించండి

Bonda Uma vs Pawan Kalyan: బోండా ఉమపై జనసైనికులు అతిగా స్పందిస్తున్నారా? వివాదం మధ్యలో దూరిన అంబటి రాంబాబు

Bonda Uma vs Janasena Party |బోండా ఉమ ఫై జనసైనికులు అతిగా స్పందిస్తున్నారా? వివాదం మధ్యలో దూరిన అంబటి రాంబాబు

Andhra Pradesh Assembly Sessions | ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏపీ పాలిటిక్స్ కి సంబంధించి  బోండా ఉమా vs పవన్ కళ్యాణ్ అనే అంశం ఫై  చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వేసిన ప్రశ్నలకు ఉపముఖ్యమంత్రి హోదాలో  పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. పారిశ్రామిక వ్యర్థాలకు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలా పనిచేస్తుంది  కొన్ని కంపెనీలు అధిక పొల్యూషన్  విడుదల చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు లేట్ అవుతుంది అంటూ ప్రజా ప్రతినిధి హోదాలో అసెంబ్లీలో  బోండా ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నలోనే భాగంగా  పొల్యూషన్ బోర్డ్ చైర్మన్  సరిగ్గా స్పందించడం లేదంటూ  అంటూనే ఆ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్  కూడా అందుబాటులో ఉండడం లేదంటూ తనతో అన్నారని  అర్థం వచ్చేలా బోండా ఉమ మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం ఇస్తూ అన్ని ఒక్కరోజులోనే అయిపోవని  తాము అధికారంలోకి వచ్చాకే   జనసేన సూచనల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో కదలిక వచ్చిందంటూ సామాన్య ప్రజల సైతం వచ్చి ఫిర్యాదు చేసేలా  చర్యలు తీసుకున్నామంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై ఆచితూచి వ్యవహరించాలని  ఒకవేళ తొందరపడి చర్యలు తీసుకోవడం మొదలుపెడితే  కంపెనీలు ఏపీ నుండి వెళ్లిపోయే  ప్రమాదం ఉందని తెలిపారు. నిజానికి ఒక మంత్రికి ఎమ్మెల్యే కి మధ్య జరిగిన  ఒక మామూలు ప్రశ్న -జవాబు ప్రక్రియ ఇది. దీనిపై సోషల్ మీడియాలో జనసేన టిడిపి మధ్య పెద్ద రచ్చే మొదలైంది.


Bonda Uma vs Pawan Kalyan: బోండా ఉమపై జనసైనికులు అతిగా స్పందిస్తున్నారా? వివాదం మధ్యలో దూరిన అంబటి రాంబాబు

ఒకరిపై ఒకరు పోటీపడి పోస్టులు పెట్టుకుంటున్న టిడిపి, జనసేన 

తమ నాయకుడు  పవన్ కళ్యాణ్ ని  టిడిపి ఎమ్మెల్యే కావాలనే ప్రశ్నించారని  అందుబాటులో ఉండరంటూ అర్థం వచ్చేలా మాట్లాడారని  జన సైనికులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాస్త పరుషంగానే  ఎక్స్ లో ట్వీట్లు పెడుతున్నారు.  ఆ పోస్టుల్లో ఏకంగా చంద్రబాబు జైలు జీవితం వరకూ  చర్చకు రావడం అనేది  ఇరు పార్టీల అగ్ర నాయకత్వాన్ని అప్రమత్తం చేసింది.  దానితో వెంటనే రెండు పార్టీలు దిద్దుబాటు చర్యలకు ముందుకు వచ్చాయి.


Bonda Uma vs Pawan Kalyan: బోండా ఉమపై జనసైనికులు అతిగా స్పందిస్తున్నారా? వివాదం మధ్యలో దూరిన అంబటి రాంబాబు
పవన్ కళ్యాణ్ ని పొగడ్తల్లో ముంచెత్తిన  టీడీపీ MLA బోండా ఉమా

 టిడిపి జనసేన మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వార్ గమనించిన బోండా ఉమా  తాను ప్రశ్న అడిగిన విధానంలో జరిగిన పొరపాటును  గమనించారో లేక టిడిపి అధిష్టానం నుంచి ఫోన్ వెళ్లిందో తెలియదు గానీ  వెంటనే పవన్ కళ్యాణ్ పొగుడుతూ వరుస ట్వీట్లు  పోస్ట్ చేసారు. "పవన్ కళ్యాణ్ గైడెన్స్ లో పని చేయడం ఎంతో బాగుందని, తాను సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగానే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకున్నారని  " పవన్ కళ్యాణ్ ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఎలాగైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆత్రుత ఆయనలో కనబడింది. దీనితో జనసైనికులు కొంత మేర శాంతించినట్టే కనిపిస్తోంది. 

 వివాదం మధ్యలో దూరిన  వైసీపీ 

 ఇప్పుడు ఈ వివాదంలోకి వైసిపి ఎంటర్ అయింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదని  ఏకంగా కూటమి ఎమ్మెల్యే ననే ఆరోపించారు అంటూ  ఈ వివాదాన్ని మరింత రాజేసే ప్రయత్నం చేశారు. ఈరోజు నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో  ఈ వివాదం మరోసారి చర్చకు వస్తుందా కూటమి  నేతలు  అధికారికంగా ఈ వివాదానికి పుల్ స్టాప్ పెడతారా  అనేది ప్రస్తుతం ఏపీలో ఆసక్తిగా మారింది.  అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం  ఒక మంత్రికి ఎమ్మెల్యేకు జరిగిన మామూలు చర్చ ఫై పవన్ అభిమానులు సోషల్ మీడియాలో కాస్త అతిగా రియాక్ట్ అయ్యారేమో అన్న వాదన మొదలైంది.

టాప్ హెడ్ లైన్స్

MLC Nagababu Cabinet Rank: కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
Embed widget