అన్వేషించండి

IAS Officers: 'తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులివ్వండి' - డీవోపీటీ ఆదేశాలపై క్యాట్‌‍లో సవాల్ చేసిన ఐఏఎస్‌లు

Telangana News: తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలన్న డీవోపీటీ ఆదేశాలపై ఏపీ, తెలంగాణ ఐఏఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. ఆ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు.

IAS Officers Filed Petition In CAT: ఏపీ, తెలంగాణ ఐఏఎస్ అధికారులు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ను (CAT) ఆశ్రయించారు. పునర్విభజన చట్టం ప్రకారం వారికి కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని ఇటీవలే డీవోపీటీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం) ఆదేశాలు జారీ చేయగా.. వీటిని సవాల్ చేస్తూ క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి, సృజన వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని.. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ముగ్గురు ఐఏఎస్‌లు వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి కోరారు. ఏపీలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ సృజన కోరారు. వీరి పిటిషన్లపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ మంగళవారం విచారణ చేపట్టనుంది.

ఏపీకి కేటాయించి తెలంగాణలో (Telangana) కొనసాగుతోన్న వారిలో ఐఏఎస్ అధికారులు వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతి.. ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి ఉన్నారు. అటు, ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన వారిలో ఐఏఎస్ అధికారులు సృజన, శివశంకర్, హరికిరణ్ ఉన్నారు. అలాగే, ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలని ఎస్.ఎస్.రావత్, అనంతరాములు డీవోపీటీని అభ్యర్థించారు. వీరి అభ్యర్థనలనూ తిరస్కరించగా.. వీరు ఏపీలోనే కొనసాగుతారు.

కేటాయించిన రాష్ట్రాలు వద్దన్న అధికారులు

కాగా, ఉమ్మడి ఏపీ విభజన సమయంలో అధికారులను కేంద్రం ఏపీ, తెలంగాణకు సర్దుబాటు చేసింది. అయితే, వారిలో కొందరు మాత్రం వివిధ కారణాలు చూపుతూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తమను తెలంగాణ కేడర్‌కు మార్చాలని కోరారు. ఇదే విషయంపై గతంలో క్యాట్‌ను సైతం ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా తీర్పిచ్చింది. అయితే, క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్రం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం.. అభ్యర్థనలను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో కేంద్రం విశ్రాంత ఐఏఎస్ అధికారి దీపక్‌ను (IAS officer Deepak) నియమించి ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం.. అధికారుల అభ్యర్థనను తోసిపుచ్చుతూ తాజాగా ఆదేశాలిచ్చింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు సివిల్ సర్వీస్ అధికారుల్ని విభజించడానికి ఖండేకర్ కమిటీని నియమించి విధి విధానాలు ఖరారు చేశారు. ఆ విధి విధానాల ప్రకారం ప్రత్యూష్ సిన్హా కమిటీ అధికారుల్ని విభజించింది. అయితే తమను ఆయా రాష్ట్రాలకు కేటాయించడంపై పలువురు క్యాట్‌తో పాటు కోర్టుల్లో న్యాయపోరాటం చేశారు. చివరికి కోర్టుల్లోనూ వారికి అనుకూల ఫలితం రాలేదు. 

ఈ నెల 16వ తేదీలోగా కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లిపోవాలని డీవోపీటీ ఆదేశాలివ్వగా.. దీనిపై ఐఏఎస్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఆదేశాలను రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని తాజాగా క్యాట్‌ను ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుండగా ఎలాంటి తీర్పు వస్తుందనేది ఉత్కంఠగా మారింది.

Also Read: AP Sand Policy : ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Vivo X200 Pro: దాదాపు రూ.లక్ష ధరతో వచ్చిన వివో ఎక్స్200 ప్రో - అంత రేటు వర్తేనా?
దాదాపు రూ.లక్ష ధరతో వచ్చిన వివో ఎక్స్200 ప్రో - అంత రేటు వర్తేనా?
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Embed widget