Hindupur MP Video: గోరంట్ల మాధవ్ వివాదాస్పద వీడియో వైరల్, టీడీపీ వాళ్ళు మార్ఫింగ్ చేశారంటున్న ఎంపీ
ఈ అంశంపై ఎంపీ గోరంట్ల మాధవ్ తో ABP Desam ప్రత్యేకంగా మాట్లాడింది. అయితే, తాను జిమ్ లో ఉండగా ఆ తీసుకున్నానని, ఆ వీడియోను, ఓ మహిళతో మాట్లాడుతున్నట్లుగా మార్ఫింగ్ చేశారని వివరణ ఇచ్చారు.
YSRCP MP Gorantla Madhav Viral Video: సోషల్ మీడియాలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు (MP Gorantla Madhav) చెందిన అభ్యంతరకర వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆయన, చొక్కా లేకుండా ఒక మహిళతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆయన నగ్నంగా కాల్ మాట్లాడారు అంటూ ఒక వీడియో ఇవాళ ఉదయం నుంచీ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. టీడీపీ నేతలు ఈ వీడియోను విపరీతంగా వైరల్ చేస్తున్నారు.
అయితే, ఈ అంశంపై ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) తో ABP Desam ప్రత్యేకంగా మాట్లాడింది. అయితే, తాను జిమ్ లో ఉండగా ఆ తీసుకున్నానని, ఆ వీడియోను, ఓ మహిళతో మాట్లాడుతున్నట్లుగా మార్ఫింగ్ చేశారని గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) వివరణ ఇచ్చారు. టీడీపీ నేతలు కుట్ర పూరితంగా ఈ పని చేశారని ఆరోపించారు. దీనిపై సైబర్ సెల్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు.
ఈ అంశంపై ఢిల్లీలో కూడా గోరంట్ల మాధవ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘వీడియోలను మార్ఫింగ్ చేసి నన్ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర, కుతంత్రం జరుగుతోంది. నేను ఏ విచారణకైనా సిధ్దం. ఇప్పటికే జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. సంబంధిత వ్యక్తులను చట్టపరిధిలోకి తీసుకురావాలని కోరాను. ఆ వీడియో ఫోరెన్సిక్ టెస్ట్ కైనా సిధ్దమే. తెలుగు దేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు చేసిన కుట్ర ఇది. సదరు వ్యక్తులపై నేను పరువు నష్టం దావా కూడా వేస్తాను.’’ అని ఎంపీ మాట్లాడారు.
Also Read: Hyderabad: నా శవాన్ని నా భర్త అస్సలు ముట్టుకోవద్దు, అదే నాకు చేసే మేలు - వివాహిత సూసైడ్ నోట్
వీడియోను ఆ కోణంలో మార్ఫింగ్ చేశారని తాను ఏ విచారణకైనా, ఫోరెన్సిక్ టెస్టుకైనా సిద్ధమని అన్నారు. ఆ వీడియో నిజమని నిరూపించాలని సవాల్ చేశారు. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే నన్ను స్ట్రయిట్‌గా ఎదుర్కోవాలని అన్నారు. ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
టీడీపీ నేతల విమర్శలు
ఎంపీ పదవికి గోరంట్ల మాధవ్‌ను అనర్హుడిగా ప్రకటించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఓ నిజాయతీ గల పోలీస్ అధికారినని చెప్పుకునే ఆయన ఎన్నికల్లో గెలిచారని గుర్తు చేశారు. అలాంటిది ఈ తలదించుకునే పనులు ఏంటి అని ప్రశ్నించారు.