భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం నుంచి వచ్చే సూచనలను పాటించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ సూచించారు.
AP Control Room Numbers: ఏపీలో అతి భారీ వర్షాలు.. ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూము నెంబర్లు ఇవే!
AP Control Room Numbers: భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసింది. ఎలాంటి సహాయానికైనా, సమాచారం కోసమైనా ప్రజలు ఈ నెంబర్లను సంప్రదించాలని కోరింది.

- కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ప్రజలను జాగ్రత్తగా ఉండమన్నారు.
AP Control Room Numbers: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కృష్ణా జిల్లాతో సహా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు తక్షణ సహాయం, సమాచారం అందించేందుకు మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసే జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూము నెంబర్లు ఏర్పాటు చేశారు. ఏపీ ప్రభుత్వం కంట్రోల్ రూము నెంబర్లను ప్రకటించింది.
కంట్రోల్ రూము నెంబర్లు
- విశాఖ జోన్-1- 9490610019
- విశాఖ జోన్-2 - 9849628880
- విశాఖ జోన్-3 - 9491030722
- అనకాపల్లి - 9490610023
- కశింకోట - 8333810597
- నర్సీపట్నం - 9491030723
- పాడేరు - 9490610027
- కాకినాడ - 9490610856
- పెద్దాపురం - 9493178728
- జగ్గంపేట - 9490610097
- రాజమహేంద్రవరం టౌన్ - 9490610855
- రాజమహేంద్రవరం రూరల్ - 9490610859
- నిడదవోలు - 9493177540
- అమలాపురం - 9490610101
- కొత్తపేట - 9493178821
- రంపచోడవరం - 8309771508
- ఏలూరు - 9440904037
- జంగారెడ్డిగూడెం - 9491030712
- భీమవరం - 9490610143
- తాడేపల్లిగూడెం - 9493177806
- నరసాపురం - 7382050943
- శ్రీకాకుళం- 9701400865
- టెక్కలి - 9490610050.
- పలాస - 08945241084
- పాలకొండ - 8332843546
- పార్వతీపురం - 9398594750
- విజయనగరం టౌన్ & రూరల్ - 9490610102
- బొబ్బిలి - 9490610121
- టోల్ ఫ్రీ నెంబర్- 1912
- కార్పొరేట్ ఆఫీస్- 8331018762
రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం
పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గత ఆరు గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడుతుంది. ఈ డిప్రెషన్ తదుపరి 12 గంటల్లో డీప్ డిప్రెషన్‌గా బలపడే అవకాశం ఉందని, అనంతరం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ విశాఖపట్నం–గోపాలపురం మధ్య ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీర ప్రాంతాన్ని 23వ తేదీ రాత్రి నుంచి 24వ తేదీ తెల్లవారుజాము మధ్య డీప్ డిప్రెషన్‌గా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఈ నెల 25వ తేదీ వరకు కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కృష్ణా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది.
Also Read: ఏపీలో అతి భారీ వర్షాలు.. ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూము నెంబర్లు ఇవే!
కృష్ణా జిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భారీ వర్షాలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమాచారం అధికారులకు తెలియజేసేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేయనుంది. ప్రజలు భారీ వర్షాలు, నీటి నిల్వలు, వరద పరిస్థితులను 08672-252399 నెంబర్‌కు తెలియజేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. కంట్రోల్ రూమ్ నిరంతరాయంగా పనిచేసేలా సిబ్బందిని షిఫ్ట్‌ల వారీగా నియమించారు.
కంట్రోల్ రూమ్‌కు వచ్చే ఫోన్ కాల్స్‌లో ప్రజలు తెలియజేసే భారీ వర్షాల పరిస్థితి, సమస్యలు, ఫిర్యాదులను సిబ్బంది నమోదు చేసి, కంట్రోల్ రూమ్ ఇన్ కార్యాలయ సూపరింటెండెంట్, కోఆర్డినేషన్ విభాగానికి తెలియజేసి చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేస్తారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం నుంచి వచ్చే సూచనలను పాటించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ సూచించారు.
Also Read: ఆకతాయి పనికి మునిగిన గ్రామం, ప్రాణభయంతో కొండమీదకు ప్రజలు పరుగులు.. నంద్యాల జిల్లాలో ఘటన
Frequently Asked Questions
ప్రజలకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన సూచనలు ఏమిటి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















