Heavy Rains In Telangana and Andhra Pradesh: బంగాళాఖాతంలో బలపడతున్న ఆవర్తనం- ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు భారీ వర్ష సూచన
Heavy Rains In Telangana and Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరికొన్ని రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Heavy Rains In Telangana and Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల వర్తనం, దానికి అనుకొని ఏర్పడిన ద్రోణి మరింత బలపడుతోంది. ఇది అల్పపీడనంగా మారవచ్చని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు ఖాయమని చెబుతున్నారు. వర్షాలతోపాటు ఈదురుగాలులు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించారు. ఇందులో ఏడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని ప్రటించారు. వర్షాలు మరికొన్నిరోజులపాటు ఉన్నందున మత్స్యారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.
Synoptic features of weather inference of Andhra Pradesh dated 12-09-2025 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/BJfKj4Br0H
— MC Amaravati (@AmaravatiMc) September 12, 2025
తెలంగాణపై కూడా ఆవర్తనం ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ నాలుగు రోజుల పాటు వానలు పడతాయి. నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని సాయంత్రానికి ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని అధికారులు ప్రకటించారు. శనివారం ఐదు జిల్లాల్లో ఆదివారం మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అలర్ట్ జారీ చేశారు.
Realized rainfall maps of Telangana dated 13.09.2025@TelanganaCMO @TelanganaCS @DCsofIndia @IASassociation @IasTelangana @tg_weather @metcentrehyd #CMO_Telangana @TelanganaDGP @GHMCOnline @CommissionrGHMC pic.twitter.com/VvsIbDm4bI
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) September 13, 2025
తెలంగాణలో భారీ వర్షాలు పడాయని అంచనా వేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేశారు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి దర్శనాలు నిలిపివేశారు. వరద ఉద్ధృతి తగ్గడంతో మూడు రోజుల క్రితమే దర్శనాలు ప్రారంభించారు. ఇప్పుడు మరోసారి దర్శనాలు నిలిపివేశారు.
Realized Maximum and Minimum Temperatures of Telangana dated 13.09.2025@TelanganaCMO @TelanganaCS @DCsofIndia @IASassociation @IasTelangana @tg_weather @metcentrehyd #CMO_Telangana @TelanganaDGP @GHMCOnline @CommissionrGHMC pic.twitter.com/YIB0IK0LHa
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) September 13, 2025
మరోవైపు మూసీ నదికి వరద పోటెత్తింది. దీంతో హైదరాబాద్‌లోని మూసారాంబాగ్ వద్ద రాకపోకలను నిలిపివేశారు. రోడ్డుకు ఇరువైపుల బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూసీ నది ఉగ్రంగా ప్రవహిస్తుంటే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టారు. అంతే కాకుండా మూసీ నది ప్రవహించే అన్ని ప్రాంతాల ప్రజలను అధికారులను అప్రమత్తం చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నారు.
REALISED WEATHER OVER TELANGANA DATED: 13.09.2025@TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @TelanganaCMO @GHMCOnline @HYDTP @IasTelangana @tg_weather @CommissionrGHMC @Comm_HYDRAA @Indiametdept pic.twitter.com/p259jH1rgW
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) September 13, 2025





















