అన్వేషించండి

Kasu Mahesh Reddy: రిగ్గింగ్ జరిగిందనే ఈవీఎం ధ్వంసం - పిన్నెల్లికి కొత్తేం కాదు - కాసు మహేష్ రెడ్డి సపోర్ట్

Andhra News : రిగ్గింగ్ జరిగిందనే ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారని గురజాల ఎమ్మెల్యే తెలిపారు. మాచర్ల ఎమ్మెల్యేకు కేసులు కొత్త కాదని .. రిగ్గింగ్ జరిగిన ఫుటేజీ కూడా బయట పెట్టాలన్నారు.

Elections 2024 :   మాచర్ల నియోజకవర్గంలో   పాలవాయి గేటు పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని  అందుకే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని  గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి స్పష్టం చేశారు.  పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన ఒక్క వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని అన్ని వీడియోలు కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలింగ్ స్టేషన్ లోపలే కాదు... బయట కూడా ఏం జరిగిందో తెలియాలన్నారు. పిన్నెల్లి దాడి ఘటనకు రెండు మూడు గంటల ముందు ఏం జరిగిందో వీడియో విడుదల చేయాలని కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. 

వీడియోలన్నీ బయట పెట్టాలని కాసు మహేష్ రెడ్డి డిమాండ్                               

మాచర్లలోని అన్ని పోలింగ్ బూత్‌లలో  కెమెరాలు పెట్టిందే అన్నీ తెలుసుకోవడానికి అని గురజాల ఎమ్మెల్యే చెప్పారు.  మాచర్లలో పొరపాట్లు జరిగాయని తాము పది రోజులుగా చెబుతున్నామని  ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఈసీ తమకు న్యాయం చేయాలని  లేదంటే విశ్వసనీయత పోతుందని హెచ్చరించారు. తప్పు ఎవరు చేసినా శిక్షించాలని తాము స్పష్టంగా చెబుతున్నామన్నారు.                             

మాచర్లలో రిగ్గింగ్ జరిగిందనేది నిజం                                 

మాచర్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగిందని తెలిపారు.  రిగ్గింగ్ జరిగిందని తాము చెబుతున్నామని... జరగలేదని వారు నిరూపించాలని సవాల్ చేశారు. అధికారులను బదిలీ చేశారంటే పోలింగ్ నిర్వహణలో ఎవరు విఫలమయ్యారో తెలిసిపోతోందన్నారు. నలుగురైదుగురిని మేనేజ్ చేసి కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదన్నారు. కాబట్టి ఎన్నికల సంఘం అన్నింటిపై చర్యలు తీసుకోవాలన్నారు. మాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? ఎవరు రెచ్చగొట్టారు? తెలియాలంటే వీడియోలు బయటకు రావాలన్నారు.        

ఈసీ చర్యలు తీసుకోకపోతే కోర్టుకె్ళ్తాం !       

ఈసీ చర్యలు తీసుకోవాలని... లేదంటే తాము కోర్టుకు వెళతామని కాసు మహేష్ రెడ్డి ప్రకటించారు.  జగన్ రెండోసారి సీఎం అయ్యాక ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాఫ్తు జరిపిస్తామన్నారు. పిన్నెల్లికి కేసులు కొత్త కాదని... ఆయన భయపడే వ్యక్తి కాదన్నారు. టీడీపీ హయాంలో అక్రమ కేసులు పెడితే 2019లో ఆయన ప్రజాబలంతో గెలిచిన వ్యక్తి అన్నారు. జనం మద్దతు ఉన్న పిన్నెల్లి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతారు  అని ప్రశ్నించారు.   

ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. ఆయనను అరెస్టు చేశారో లేదో స్పష్టత లేదు. ఆయన విదేశాలకు పారిపోయారని కూడా చెబుతున్నారు. నిజం మాత్రం స్పష్టత లేదు. రోజూ మీడియాతో మాట్లాడే పిన్నెల్లి  ఇప్పుడు మీడియాతో మాట్లాడటం లేదు.          

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget