అన్వేషించండి

Chandrababu : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికే, నాలుగేళ్ల తర్వాత జగన్ కు బీసీలు గుర్తొచ్చారా? - చంద్రబాబు

Chandrababu : సీఎం జగన్ నాలుగేళ్ల తర్వాత బీసీలు గుర్తొచ్చారా అని చంద్రబాబు ప్రశ్నించారు. బీసీ సభకు నేతలను బెదిరించి తరలించారన్నారు.

Chandrababu : ఏపీకి వైసీపీ పాలన వద్దు సైకిల్ పాలన ముద్దని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. నారాకోడూరు బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపడం ఖాయమన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్‌కు నాలుగేళ్ల తర్వాత బీసీలు గుర్తుకు వచ్చారని అని చంద్రబాబు ప్రశ్నించారు. బీసీ సభకు రాకపోతే సంక్షేమ పథకాలు కట్‌ చేస్తామని బెదిరించారని ఆరోపించారు. సీఎం పదవి తనకు కొత్త కాదని, మీ పిల్లల భవిష్యత్తు కోసం తాను తాపత్రయపడుతున్నట్టు చెప్పారు. ధూళిపాళ్ల నరేంద్రను నేరుగా ఎదుర్కోలేక సంగం డెయిరీపై కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సంగం డెయిరీని కాదని గుజరాతీ కంపెనీ అమూల్‌ను ప్రోత్సహించడంలో వైసీపీ ప్రభుత్వం అంతర్యమేంటని చంద్రబాబు ప్రశ్నించారు.

సంగం వద్దు, అమూల్ ముద్దు 

 సీఎం జగన్‌కి సంగం వద్దు, అమూల్‌ ముద్దు అని చంద్రబాబు అన్నారు. నాలుగేళ్ల తర్వాత సీఎం జగన్ కు బీసీలు గుర్తుకొచ్చార అంటూ మండిపడ్డారు. జయహో బీసీ సభకు నేతలను బలవంతంగా తరలించారని ఆరోపించారు. వైసీపీ సభకు రాకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు తొలగిస్తామని బెదిరించారన్నారు. టీడీపీ సభలకు జనం స్వచ్ఛందంగా తరలివస్తున్నారన్నారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.  టీడీపీ అధినేత చంద్రబాబుకు గుంటూరు జిల్లా పర్యటనలో ఘన స్వాగతం పలికారు శ్రేణులు. పెదకాకాని వద్ద పొన్నూరు నియోజకవర్గంలో పర్యటనకు వచ్చిన చంద్రబాబు.. జాతీయ రహదారి మీదుగా బుడంపాడు చేరుకున్నారు. బుడంపాడు వద్ద చంద్రబాబును టీడీపీ శ్రేణులు గజమాలతో ఘనంగా స్వాగతించారు. బుడంపాడు నుంచి బైక్‌ ర్యాలీతో చంద్రబాబు పర్యటన మొదలైంది. నారా కోడూరు సభకు టీడీపీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా భారీగా వచ్చారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు గుంటూరు, బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.   

బాపట్ల జిల్లాలో రెండ్రోజుల పర్యటన 

టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు. శుక్రవారం బాపట్ల, శనివారం చీరాలలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గోనున్నారు. ఈ సభల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. బాపట్ల జిల్లాగా ఆవిర్భవించాక మొదటిసారి చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.15 గంటలకు బాపట్ల మండలం చుండూరుపల్లి వద్ద టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలకనున్నాయి. అనంతరం ర్యాలీగా బయలుదేరి బాపట్లలోని అంబేడ్కర్‌ కూడలి వద్ద ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడనున్నారు. శుక్రవారం రాత్రి ఇంజినీరింగ్‌ కళాశాలలో బస చేసి శనివారం ఉదయం ఎస్సీ నేతలు, కళాశాల విద్యార్థులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. శనివారం చీరాలకు ర్యాలీగా వెళ్లి అక్కడ జరిగే బహిరంగసభలో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పర్చూరు, చిలకలూరిపేటల మీదుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన
చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
New Ration Cards: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Allu Aravind: 'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Chilkur Balaji Temple Rangarajan | రామరాజ్యం స్థాపించటానికి వచ్చాం అంటూ దాడి | ABP DesamVishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP DesamAllu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన
చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
New Ration Cards: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Allu Aravind: 'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
Brahma Anandam Trailer: ప్రభాస్ వదిలిన ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్... తండ్రీకొడుకులు, తాతామనవళ్లులా ఏడిపించేశారు కదయ్యా!
ప్రభాస్ వదిలిన ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్... తండ్రీకొడుకులు, తాతామనవళ్లులా ఏడిపించేశారు కదయ్యా!
Chilkuru Balaji Rangarajan Attack case: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌పై దాడి, ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌పై దాడి, ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
PM Modi In Paris: ఫ్రాన్స్‌లో ఏఐ సమ్మిట్‌, పారిస్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం Viral Video
ఫ్రాన్స్‌లో ఏఐ సమ్మిట్‌, పారిస్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం Viral Video
SBI Clerks Halltickets: ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Embed widget