Vidadala Rajini : కొలకలూరులో ప్రబలిన డయేరియా, బాధితులను పరామర్శించిన మంత్రి విడదల రజిని
Vidadala Rajini : గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో డయేరియా ప్రబలింది. ఒక బాలిక మృతి చెందగా, మరికొంత మంది చికిత్స పొందుతున్నారు. బాధితులను మంత్రి విడదల రజిని ఇవాళ పరామర్శించారు.
Vidadala Rajini : గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పర్యటించారు. పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను మంత్రి పరామర్శించారు. రెండు రోజులుగా కొలకలూరు గ్రామంలో డయేరియాతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి విడదల రజిని అన్నారు. సమస్య తెలిసిన వెంటనే అధికారులను అలెర్ట్ చేశామన్నారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ ఎప్పటికప్పుడు గ్రామంలో పర్యటిస్తూ పరిస్థితి సమీక్షిస్తున్నారని తెలిపారు. పరిస్థితులపై ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపామని తెలిపారు. ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా గ్రామంలో మెడికల్ టీమ్, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు.
బాలిక కుటుంబానికి సాయం చేస్తాం
బాధితులకు గుంటూరు, తెనాలి, కొలకలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాం. గ్రామంలో ఇంటించికి వెళ్లి వైద్య సిబ్బంది సర్వే చేశారు. గ్రామస్తుల అవసరాలను స్థానిక ఎమ్మెల్యే దగ్గర ఉండి చూసుకున్నారు. ల్యాబ్ టెస్ట్ కి పంపిన వాటర్ శాంపిక్స్ ఇంకా రావాల్సిఉంది. గ్రామంలో అనారోగ్య సమస్యలు అదుపులోకి వచ్చాయి. ఇక్కడి పరిస్థితి జిల్లాలో ఉన్న అధికారులు కూడా చూస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకే అన్ని ఏర్పాట్లు చేశాం. పాప చనిపోవటం బాధాకరం వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాను. పాప కుటుంబాన్ని పరామర్శించాలని భావించాను కానీ వారు గ్రామంలో లేరని తెలిసింది. బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరపున సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తాం. - మంత్రి విడదల రజిని
కొలకలూరులో డయేరియా
గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో డయేరియా ప్రబలింది. గ్రామంలోని గరువు కాలనీలో 14 ఏళ్ల బాలిక బుధవారం సాయంత్రం వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైంది. స్థానిక ఆర్ఎంపీ బాలికకు అందించారు. అయితే చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి బాలిక మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. బాలిక మృతి చెందడంతో తల్లిదండ్రుల తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అదే విధంగా గ్రామంలో మరికొంతమంది వాంతులు విరోచనాలతో బాధపడుతూ పీహెచ్సీలో జాయిన్ అయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో తెనాలి తరలించారు. దీంతో పంచాయతీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. డయేరియా ప్రబలిన గరువు కాలనీలో తాగునీటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. తెనాలి ఆసుపత్రిలో డయేరియా లక్షణాలతో ముగ్గురు చేరారు. డయేరియాతో 25 మంది ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.
Also Read : AP BJP On KCR : కేసీఆర్ తీరు తెలుగుజాతికి అవమానం - ప్రధానికి స్వాగతం చెప్పకపోవడంపై ఏపీ బీజేపీ ఫైర్ !