News
News
X

Kodali Nani : చిన్న పిల్లల్ని రెచ్చగొట్టి రోడ్లపైకి పంపారు, పవన్ కల్యాణ్ పై కొడాలి నాని హాట్ కామెంట్స్

Kodali Nani On Pawan Kalyan : అమలాపురంలో చిన్న పిల్లలను రెచ్చగొట్టి రోడ్లపైకి పంపారని పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన ఆరోపణలు చేశారు. ఫైరింగ్ చేస్తే పరిస్థితి అదుపులోకి వచ్చేదని , కానీ పోలీసులు సంయమనం పాటించారన్నారు.

FOLLOW US: 
Share:

Kodali Nani On Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీమంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమలాపురంలో పిల్లలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. పిల్లలను రెచ్చగొట్టి శాంతిభద్రతలను కాపాడలేదని ఆరోపణలు చేస్తున్నారన్నారు. అమలాపురంలో ఫైరింగ్ చేసుంటే పరిస్థితి అదుపులోకి వచ్చేదని, పిల్లల ప్రాణాలు పోతాయని ఫైరింగ్ చేయలేదన్నారు. ఫైరింగ్ చేసి ప్రాణాలు పోతే శవాల వద్ద రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు రెడీగా ఉన్నాయన్నారు. పవన్ కల్యాణ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లు చదువుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగంపై ఎలాంటి అవగాహన లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందని కొడాని నాని ఘాటుగా వ్యాఖ్యానించారు.

  • పవన్ కల్యాణ్ కు అది కూడా తెలియదు

కృష్ణా జిల్లా గుడివాడలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ను వ్యతిరేకించే వాళ్లను దేశం నుంచి బహిష్కరించాలన్నారు. అలాంటి వాళ్లను జైల్ లో పెట్టాలన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ప్రాధాన్యమన్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు ఇళ్లు ప్రభుత్వానికి ముఖ్యంకాదన్నారు. కొత్త జిల్లాలపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇవ్వడం రాజ్యాంగంలోని ఓ విధానమన్నారు. అది కూడా తెలియకుండా పవన్‌ కల్యాణ్ మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ ప్రకారం గడువు ఇచ్చిందన్నారు. 

  • శవరాజకీయాలు చేసేవాళ్లు 

" "మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు నిరసనకారులు తగలబెట్టినా ఒక్కరిని కూడా పోలీసులు గాయపరచలేదు. అందుకు కారణం డా.బి.ఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం. సీఎం జగన్ ముమ్మడివరం మీటింగ్ వెళ్లినప్పుడు అక్కడి ప్రజాప్రతినిధులు కోస్తా జిల్లా అంబేడ్కర్ పేరు పెట్టమని కోరారు. అందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించి అంబేడ్కర్ పేరు పెడుతూ జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చినప్పుడు అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలపాలని ప్రభుత్వం తెలిపింది. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదివే పవన్ కల్యాణ్ నెలరోజులు టైమ్ ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు. కనీసం రాజ్యాంగంలోని ప్రొసిజర్ కూడా తెలియకుండా రాజకీయాలు చేసేందుకు వచ్చారు. పిల్లలను రెచ్చగొట్టి రోడ్లు ఎక్కించి లా అండ్ ఆర్డర్ కాపాడలేకపోయారు. అంటే లా అండ్ ఆర్డర్ పాటించాలంటే పిల్లలపై కాల్పులు జరపాలి. అభం శుభం తెలియని కాల్పులు జరిపితే శవరాజకీయాలు చేసేవారు. ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు కాల్పులు జరపలేదు. పోలీసులు సంయమనం పాటించారు." "
-- కొడాలి నాని, మాజీ మంత్రి  

Published at : 26 May 2022 08:27 PM (IST) Tags: pawan kalyan Kodali nani Amalapuram incident Gudivada news

సంబంధిత కథనాలు

AP SI Hall Tickets: ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?

AP SI Hall Tickets: ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?

DMHO Recruitment: కృష్ణా జిల్లా, డీఎంహెచ్‌వోలో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!

DMHO Recruitment: కృష్ణా జిల్లా, డీఎంహెచ్‌వోలో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!

Pinnelli on Kotamreddy: కార్పొరేటర్ స్థాయి కూడా లేని కోటంరెడ్డిని జగన్ 2 సార్లు గెలిపించారు: పిన్నెల్లి ఘాటు వ్యాఖ్యలు

Pinnelli on Kotamreddy: కార్పొరేటర్ స్థాయి కూడా లేని కోటంరెడ్డిని జగన్ 2 సార్లు గెలిపించారు: పిన్నెల్లి ఘాటు వ్యాఖ్యలు

Breaking News Live Telugu Updates: ఎస్సారెస్పీ కెనాల్ లో పడిపోయిన కారు... యువకుడు మృతి

Breaking News Live Telugu Updates: ఎస్సారెస్పీ కెనాల్ లో పడిపోయిన కారు... యువకుడు మృతి

Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్

Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్

టాప్ స్టోరీస్

Jr NTR: అప్‌డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!

Jr NTR: అప్‌డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!

Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్

Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్

Vijay Devarakonda: బ్లాక్‌బస్టర్ ‘గీత గోవిందం’ కాంబో రిపీట్ - కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ, పరశురామ్!

Vijay Devarakonda: బ్లాక్‌బస్టర్ ‘గీత గోవిందం’ కాంబో రిపీట్ - కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ, పరశురామ్!

Laxmi Parvati Comments: టీడీపీ ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఉపయోగం లేదు: లక్ష్మీపార్వతి

Laxmi Parvati Comments: టీడీపీ ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఉపయోగం లేదు: లక్ష్మీపార్వతి