Allegations On Jeevita : జీవిత ప్రమాదకరమైన లేడీ - డబ్బులు ఎగ్గొట్టి ఆరోపణలు చేస్తున్నారన్న గరుడవేగ నిర్మాతలు !
జీవితపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు గరుడవేగ సినిమా నిర్మాతలు. జీవితను ప్రమాదకరమైన లేడీగా అభివర్ణించారు.
దర్శక, నిర్మాత జీవితా రాజశేఖర్‌ను వివాదాలు వదలడం లేదు. తమ దగ్గర డబ్బులు అప్పు తీసుకుని ఎగ్గొట్టారని తిరుపతికి చెందిన కోటేశ్వరరాజు దంపతులు కొంత కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. వారు మీడియా ముందుకు వచ్చి మరోసారి తీవ్రమైన విమర్శలు చేశారు. త్వరలో జీవిత జైలుకెళ్లడం ఖాయమన్నారు. తమపై లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారని వారంటున్నారు. కోటేశ్వరరాజు దంపతులు రాజశేఖర్‌తో గరుడవేగ సినిమా నిర్మించారు. ఆ సినిమా హిట్ అయినప్పటికీ వీరి మధ్య ఆర్థికాంశాల్లో వివాదాలు ప్రారంభమయ్యాయి.
సాయం చేయమని ఆర్జించి, జీవిత, రాజశేఖర్ ఇద్దరూ నట్టేట ముంచేశారని జోస్టర్ ఫీలిం గ్రూప్స్ పౌండర్ అయిన కోటేశ్వరరాజు అంటున్నారు. జీవితరాజశేఖర్ సమస్యను తారుమారు చేయడానికి మీడియా ముందుకు వచ్చారని ఆరోపించారు. తాము అన్ని సాక్ష్యాధారాలు పెట్టుకునే మాట్లాడుతున్నామని, జీవితారాజశేఖర్ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మా దగ్గర డబ్బులు తీసుకుని అగ్రిమెంట్ చేయించుకున్నది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. గరుడ వేగ సినిమా సమయంలో ప్రొడ్యూసర్ గా మేము పని చేసి, సినిమాకు నగదును ఇన్వెస్ట్ చేశామని చెప్పారు. ఫిల్మ్ ఛాంబర్ లో కొంతమంది మీడియా జీవిత రాజశేఖర్ కు సపోర్టుగా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
జీవిత మీడియాని మ్యానుపులెట్ చేస్తోందని కోటేశ్వరరాజు అన్నారు. జోస్టర్ ఫీలిం గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న కోటేశ్వరరాజు సతీమణి హేమ కూడా జీవితపై తీవ్ర ఆరోపణలు చేశారు. మా వద్ద డబ్బులు తీసుకోవడం వాస్తవంమని, 26 కోట్లు అప్పు తీసుకుని, మమ్మల్ని ప్రజల్లో మభ్య పెడుతున్నారని ఆమె తెలిపారు. సమాజంలో బతనివ్వడం లేదని, వాళ్ళు పెట్టే భాధలు అన్ని ఇన్ని కావని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జీవత చాలా అమయాకురాలిగా మాట్లాడుతున్నారని, చాలా ప్రమాదకమైన లేడీ అని ఆమె విమర్శించారు. మేము ఇప్పుడు ఎవరో తెలియనట్టు మాట్లాడడం మంచిది కాదన్నారు. మా వద్ద డబ్బులు తీసుకుని నంచనాచిలా మాట్లాడుతుందని, జీవిత నోరు అదుపులో పెట్టుకోక పోతే ఊరుకునేది లేదని హేమ హెచ్చరించారు.
జీవిత వల్ల చాలా భాధలు అనుభవించిన తర్వాతనే కోర్టుకు వెళ్ళామని, త్వరలో జీవిత రాజశేఖర్ కి చుక్కెదురు కాబోతుందని హేమ జోస్యం చెప్పారు. కోటేశ్వరరాజు, హేమ పలుమార్లు మీడియా ముందుకు వచ్చి జీవిత, రాజశేఖర్‌పై ఆరోపణలు చేశారు. తాము అప్పు ఇచ్చినందుకు తనఖా పెట్టిన ఆస్తిని తమకు తెలియకుండా అమ్మేశారని వారు ఆరోపిస్తున్నారు. వీరి ఆరోపణల్ని జీవిత ఖండిస్తున్నారు.