అన్వేషించండి

Ganta Srinivasa Rao: 'సీఎం జగన్ కు భయం పట్టుకుంది' - తన రాజీనామా ఆమోదంపై గంటా శ్రీనివాసరావు స్పందన

Andhra News: తన రాజీనామాను స్పీకర్ ఆమోదించడంపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించడం ఏంటని ప్రశ్నించారు.

Ganta Srinivasa Rao Responds on His Resignation: దాదాపు మూడేళ్ల తర్వాత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Sriniavasa Rao) రాజీనామాను స్పీకర్ మంగళవారం ఆమోదించడం చర్చనీయాంశమైంది. అప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా చేయగా.. ఇప్పటివరకూ పెండింగ్ లో ఉంచిన స్పీకర్ ఇప్పుడు ఆమోద ముద్ర వేశారు. దీనిపై గంటా శ్రీనివాసరావు స్పందించారు. మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదిస్తారా.? అని ప్రశ్నించారు. తాను అప్పుడు స్పీకర్ ను వ్యక్తిగతంగా కలిసి రాజీనామా ఆమోదించాలని చెప్పినా పెండింగ్ పెట్టారని.. ఇప్పుడు 3 నెలల్లో ఎన్నికలు ఉండగా ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా ఆమోదించే ముందు తన అభిప్రాయం తీసుకోవాలనే కనీస సంప్రదాయాన్ని కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ఘటనతో జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతోందని మండిపడ్డారు.

సీట్ల భయం కనిపిస్తోంది

సీఎం జగన్ (CM Jagan) లో రాజ్యసభ సీట్ల భయం కనిపిస్తోందని గంటా ఎద్దేవా చేశారు. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ కు వ్యతిరేకంగా ఓటేస్తారనే ఆయనకు అనుమానంగా ఉందేమో అంటూ ధ్వజమెత్తారు. 'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నా. రాజకీయ లబ్ధి కోసమే సీఎం జగన్ తన రాజీనామాను ఆమోదింపచేసి స్టీల్ ప్లాంట్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. జగన్ రెడ్డికి ఆత్మ గౌరవం ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడే ధైర్యం సీఎంకు ఉందా.?. అరాచక వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయాలని నిర్ణయించుకున్నా. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా తనకున్న అవకాశాలపై న్యాయ సలహా తీసుకుంటా.' అని గంటా స్పష్టం చేశారు.

ఆ టైంలో రాజీనామా

2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2021, ఫిబ్రవరి 12న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాంకు (Tammineni Seetharam) లేఖ రాశారు. తన రాజీనామాను ఆమోదించాలని అప్పట్లో స్వయంగా వెళ్లి స్పీకర్ ను కలిశారు. అప్పటి నుంచి గంటా రాజీనామా అంశం పెండింగ్ లో ఉండగా.. తాజాగా ఆయన రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

అదే కారణమా.?

మార్చిలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మూడు రాజ్యసభ స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేల బలాల ప్రకారం ఈ మూడు స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడతాయి. కానీ ప్రస్తుతం సీఎం జగన్ అభ్యర్థుల కసరత్తు చేస్తున్నారు. ఈ కారణంగా  బదిలీ అయిన ఎమ్మెల్యేలు.. టిక్కెట్లు నిరాకరించిన ఎమ్మెల్యేలు టీడీపీ వైపునకు వెళ్తే ఓ రాజ్యసభ స్థానం దక్కించుకోవడం కష్టమవుతుందన్న అంచనాలో ఆ  పార్టీ వ్యూహకర్తలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే టీడీపీ బలాన్ని వీలైనంతగా తగ్గించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. గంటా రాజీనామాను ఆమోదించే ముందు ఆయన్ను ఒక్క సారి కూడా సంప్రదించలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఇప్పుడు రాజీనామా ఆమోదించినా ఆమోదించకపోయినా పెద్దగా తేడా లేదు. ఎందుకంటే  నెల రోజులలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. కేవలం రాజ్యసభ ఎన్నికల దృష్టితోనే ఈ పని చేశారని టీడీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. 

Also Read: Actor Prudhvi Raj: 'నేను చంద్రబాబు, పవన్ వదిలిన బాణం' - ఎన్నికల్లో పోటీపై నటుడు పృథ్వీరాజ్ క్లారిటీ

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Embed widget