Andhra News Ganta Srinivas : అడ్డదారిలో విశాఖకు ఎందుకు ? సీఎం జగన్‌కు గంటా సూటి ప్రశ్న
Andhra News Ganta Srinivas : విశాఖ రాజధానిపై ప్రజాభిప్రాయసేకరణ జరపాలని గంటా శ్రీనివాసరావు సీఎం జగన్ ను కోరారు. కోర్టులను పట్టించుకోకుండా కార్యాలయాలను ఎందుకు తరలిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
Andhra News Ganta Srinivas : విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశంపై తెలుగుదేశం పార్టీ నేత గంటా శ్రీనివసరావు సీఎం జగన్ పై మండిపడ్డారు. కోర్టులను పట్టించుకోకుండా ఎందుకు హడావుడిగా తరలిస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరక్ సోషల్ మీడియా స్పందించారు. అయ్యా జగన్ గారు విశాఖ ఎందుకొస్తున్నారు .. . దేనికోసం వస్తున్నారు. ఇలా అడ్డదారిలో రావాల్సిన అవసరం ఏమొచ్చిందో సమాధానం చెప్పండి....? ప్రశాంత నగరంగా పేరున్న విశాఖ మీ రాజధాని ప్రకటనతో అరాచకాలకు అడ్డాగా మారింది. పులివెందుల పంచాయితీలు నడుస్తున్నాయి. ఎప్పుడు మీ స్వార్థం, మీ రాజకీయ లబ్ధి తప్పా.. మా విశాఖ ప్రజల మనోవేదన మీకు పట్టడంలేదని విమర్శలు గుప్పించారు.
ఈ మూడు నెలల ముచ్చట కోసం వేల కోట్ల ప్రజా ధనాన్ని తగలేస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ రాజధానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టండి నూటికి 99% మంది ప్రజలు రాజధాని వద్దనే చెబుతారు. ఎన్నికలకు మూడు నెలల ముందు విశాఖ వచ్చి ఏమి సాదిద్దాం అనుకుంటున్నారు. రాజధాని అమరావతేనని, అక్కడి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్ని తరలించవద్దని హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పినా జగన్ మోహన్ రెడ్డి వక్రబుద్ధితో అడ్డదారిన ఈ తరలింపు ఎవరికోసం. ఆ ఆదేశాలు అమల్లో ఉండగానే దొడ్డిదారిన జీవో ఇవ్వడం కోర్టుధిక్కారం కాదా....? మీ పాలనకు ఇక 3 నెలలు ఎక్స్పైరీ డేట్ మాత్రమే మిగిలి ఉందని గుర్తుంచుకోవాలని సలహా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ నుంచే పరిపాలన చేస్తామని చెబుతున్నప్రభుత్వం అధికారుల క్యాంప్ కార్యాలయాలను గుర్తిస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కారు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రిషికొండ మిలినియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంపు కార్యాలయాలను హై లెవెల్ కమిటీ గుర్తించింది. మిలీనియం టవర్స్‌లోని ఏ, బీ టవర్స్‌ను కేటాయించారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలీనియం టవర్స్‌ను కేటాయించారు.
ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లినప్పుడు ఉపయోగించేందుకు మిలినియం టవర్స్‌లో ఏ, బీ టవర్స్‌ను కేటాయించారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల సమయంలో వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కమిటీ నివేదిక మేరకు సీఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలని వెల్లడించారు. మొత్తం 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు గుర్తించారు. మిలినియం టవర్స్‌లో లక్ష 75 వేల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని గుర్తించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సమీక్షల కోసం అని చెబుతున్నా.. సమీక్షల కోసం ఇంత పెద్ద ఎత్తు కార్యాలయాలు ఎందుకని అనధికారికంగా రాజధానిని తరలించడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply