AP Telangana Breaking News Live Updates: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగ్ దీప్ ధన్ కర్
AP Telangana Breaking News Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE
Background
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పిలువబడుతుంది.. ఈ క్రమంలో ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి వారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను అర్చకులు నివేదిస్తారు. ముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుపుతారు అర్చకులు. దీనినే కైకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు.
దక్షిణ కోస్తా ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లోని అల్పపీడనం తాజాగా ఉత్తర కోస్తా ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అనుబంధ ఉపరితల ఆవర్తనంగా మారింది. అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల పైన విస్తరించి ఉంది. రుతుపవన ద్రోణి ఇప్పుడు బలమైన అల్పపీడన ప్రాంతం కేంద్రం గుండా వెళుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా, సౌరాష్ట్ర , కచ్, ఉదయపూర్, రైసెస్ తీర ప్రాంతాలు, జబల్ పూర్, పెంద్రా రోడ్, హీరాకుడ్, కోస్తా ఒడిశా మీదుగా అల్పపీడన కేంద్రం, తీర ప్రాంత ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో.. అక్కడి నుంచి ఆగ్రేయంగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి, సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉత్తర భారత ద్వీపకల్పమైన 19 డిగ్రీ ఉత్తర అక్షాంశం వెంట సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ, 7.6 కి.మీ మధ్య సుమారు 18 డిగ్రీల తూర్పు పశ్చిమ షియర్ జోన్ తక్కువగా గుర్తించారు.
ఒడిశా తీరంలో అల్పపీడనం బలపడటంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు కురవనున్నాయి. నేటి నుంచి మరో రెండు రోజులపాటు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలోనూ భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో నేటి నుంచి 2 రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సీమ జిల్లాలైన చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయి. వర్షాలు, వరద ప్రవాహం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
జూలై 20 వరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగ్ దీప్ ధన్ కర్
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగ్ దీప్ ధన్ కర్ పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. జగన్ దీప్ ధన్ కర్ ప్రసుత్తం పశ్చిమ బంగాల్ గవర్నర్ గా ఉన్నారు. జగ్ దీప్ ధన్ కర్ పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.
Presidential Elections: ద్రౌపది ముర్ముని గౌరవిస్తాం, కానీ యశ్వంత్ సిన్హాకే మా ఓటు: ఆప్ ప్రకటన
ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఆమ్‌ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది. మహిళా అభ్యర్థి ద్రౌపది ముర్ముని తాము గౌరవిస్తామన్నారు. కానీ, యశ్వంత్ సిన్హాకే తమ ఓటు అని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ స్పష్టం చేశారు.
డాక్టర్లు సెలవులు తీసుకోకుండా, తప్పనిసరిగా డ్యూటీలు చేయాలి: హరీష్ రావు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, వరద బాధిత ముంపు ప్రాంతాల, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, డాక్టర్లతో.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమీక్షించారు. గోదావరి పరీవాహక వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా యుద్దప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ముంపు గ్రామాల్లో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. డాక్టర్లందరూ సెలవులు తీసుకోకుండా, తప్పనిసరిగా డ్యూటీలు నిర్వహిస్తూ.. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుల్లో పరీక్షలు నిర్వహిస్తూ, మెడిసిన్లను ప్రజలకు అందుబాటులో ఉంచి సరఫరాచేయాలన్నారు.
ఈ మేరకు హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావును కొత్తగూడెం కేంద్రంగా, మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ రమేశ్ రెడ్డిని మంచిర్యాల కేంద్రంగా విధులు నిర్వహిస్తూ హెల్త్ క్యాంపులు తదితర ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనాలని, అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఉన్నారు.
Dowleswaram Barrage: గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి అంబటి
ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి అంబటి రాంబాబు
వరద పరిస్థితి అనుగుణంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. శనివారం ధవళేశ్వరం బ్యారేజీ వ్యూ పాయింట్ వద్ద నుంచి వరద పరిస్థితి పై ప్రత్యేక అధికారి హెచ్. అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కే. మాధవీలత తో సమీక్షించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం వద్ద వరద ఉదృతి, దిగువకు వరద నీరు విడుదల సమయంలో చేపడుతున్న రక్షణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ముంపు ప్రాంతాలలోని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ బృందాలతో క్షేత్ర స్థాయి లో తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు.
జిల్లా వరదల పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టిన ప్రత్యేక అధికారి హెచ్. అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రస్తుత వరద పరిస్థితి ని మంత్రికి వివరించారు. ముంపు గ్రామాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలి రావాలని కోరడం జరిగిందని, కొందరు పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధపడటం లేదని, ముంపుకు గురికాము అనే ధీమా తో ఉన్నట్లు తెలిపారు. వరద పరిస్థితి కి అనుగుణంగా అవసరమైన పక్షంలో ప్రతి ఒక్కరిని తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఇరిగేషన్ ఎస్ ఈ నరసింహరావు గోదావరి బండ్ల పరిస్థితి, వాటి పటిష్టత కోసం తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మంత్రితో పాటు పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్, రూడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Nizamabad Crime: ప్రేమించడం లేదని ప్రియురాలు గొంతు కోసిన ప్రియుడు
నిజామాబాద్ మోపాల్ లో దారుణం
ప్రేమించడం లేదని ప్రియురాలు గొంతు కోసిన ప్రియుడు
గత కోద్ధి రోజులుగా ప్రేమించాలంటూ ప్రియాంక అనే అమ్మాయి వెంట పడుతున్న సంజయ్ అనే యువకుడు
యువకుడిని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలింపు