అన్వేషించండి

Grand Ashada Sare: తగ్గేదే లే…గోదారోళ్లు మామూలోళ్లు కాదు..సారె మరీ ఈ రేంజులోనా…!

ఆషాడమాసం సారె అంటే మహా అయితే స్వీట్లు, హాట్లు, బట్టలు, ఇంట్లో వాడుకునే వస్తువులు అనుకుంటాం. కానీ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఆడపిల్ల తండ్రి ఇచ్చిన కానుకలు చూసే అవాక్కవాల్సిందే.ఇంతకీ ఏమున్నాయ్ ఆ సారెలో.

 

కొత్త అల్లుడికి ఆషాడం మాసంలో కానుకలు ఇవ్వడం మన హిందూ సంప్రదాయం. ఎవరి స్తోమతని బట్టి వారు ఇచ్చుకుంటారు. కొందరు బంగారం, వెండి కానుకలిస్తే మరికొందరు ఇంట్లోకి అవసరమైన వస్తువులు బీరువా, మంచం, ఇంట్లో వాడుకునే సామాన్లు  ఇస్తారు. కానీ గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆషాఢ కావిళ్లు పేరుతో వియ్యాలవారింటికి పంపించిన సారె చూసి చర్చించుకోని వారు లేరు. ఓ రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది ఆ సారె.


Grand Ashada Sare: తగ్గేదే లే…గోదారోళ్లు మామూలోళ్లు కాదు..సారె మరీ ఈ రేంజులోనా…!

రాజమండ్రికి చెందిన వ్యాపారవేత్త బత్తుల బలరామకృష్ణ… తన కుమార్తెని యానాంకి చెందిన పవన్ కుమార్ కి ఇచ్చి పెళ్లిచేశాడు. ఆషాఢం సందర్భంగా వియ్యంకుడి ఇంటికి పంపిన సారె చూసి నోరెళ్లబెట్టారంతా. ఇంతకీ ఆ సారెలో ఏమున్నాయంటే… బిందెలలో 50 కేజీల స్వీట్స్, హాట్స్, 250 కేజీల కిరాణా వస్తువులు, 100 కేజీల డ్రై ఫ్రూట్స్,  టన్ను చొప్పున కొర్రమీను, పండుగ గప్ప, బొచ్చె చేపలు, రొయ్యలు, 250 కేజీల బొమ్మిడాయిలు,10 మేక పోతులు, 50 కోళ్లు, జత మేకల చెవులకి బంగారు రింగులు, 200 ఆవకాయ జాడీలు, 5 వాహనాలతో పంపించాడు.


Grand Ashada Sare: తగ్గేదే లే…గోదారోళ్లు మామూలోళ్లు కాదు..సారె మరీ ఈ రేంజులోనా…!

ఇంత భారీగా సారె పంపించడానికి కారణం కరోనా అన్నాడు వధువు తండ్రి. ఎందుకంటే అత్యంత వైభవంగా జరగాల్సిన పెళ్లి కరోనా కారణంగా చాలా సాదాసీదాగా జరిగిపోతున్నాయ్. కరోనాకి ముందు పెళ్లి ఎంత ఘనంగా జరిపించామన్నదే చర్చించుకునేవారు. పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు, కళ్లు మిరిమిట్లు గొలిపే లైటింగ్, భారీగా తరలివచ్చే బంధుమిత్రులు, అద్భుతమైన విందు…ఇలా ఉండేది. మీరు గొప్ప అంటే మేం గొప్ప అని….అంతకుమించి అని మాట్లాడుకునేవారు. కానీ కరోనా ఎంట్రీతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారయ్యాయి. పట్టుమని పది మంది ఓ దగ్గర చేరితే వామ్మో అంటున్నారు. గుంపులో ఎవరో ఒకరు తుమ్మినా దగ్గినా బంధుమిత్రులంతా క్వారంటైన్ కే.  ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లికి కొద్దిమంది మాత్రమే అని పరిమితులు విధించాయి ప్రభుత్వాలు. దీంతో వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు సాదాసీదాగా కానిచ్చేస్తున్నారు. అందుకే పెళ్లి ఎలాగూ ఘనంగా జరిపించలేకపోయాం…సారె అయినా కళ్లు చెదిరేలా వైభవంగా ఉండాలని ఆలోచించారు వధువు కుటుంబ సభ్యులు.


Grand Ashada Sare: తగ్గేదే లే…గోదారోళ్లు మామూలోళ్లు కాదు..సారె మరీ ఈ రేంజులోనా…!

నూతన వధువు సారె తీసుకురావడమనే ఆచారం తమ దగ్గర ఎప్పటి నుంచో ఉందన్న వరుడి కుటుంబ సభ్యులు… వియ్యంకుడు పంపిన భారీ ఆషాఢం సారె కావిడి ఇంతవరకూ ఎవరూ పంపించి ఉండరన్నారు.  ఓ రకంగా చెప్పాలంటే ఈ రేంజ్ లో ఆషాడ సారె చూసి వియ్యాలవారి కుటుంబం ఆశ్చర్యపోయింది.


Grand Ashada Sare: తగ్గేదే లే…గోదారోళ్లు మామూలోళ్లు కాదు..సారె మరీ ఈ రేంజులోనా…!

ఏదేమైనా ఈ సారె చూసిన వాళ్లంతా కొత్త ట్రెండ్ ఫాలో అవుతారేమో చూడాలి. పెళ్లిళ్లు వైభవంగా చేయలేనివారంతా ఇకపై సారె ఘనంగా పెట్టేందుకు దృష్టి సారిస్తారేమో......

టాప్ హెడ్ లైన్స్

MLC Nagababu Cabinet Rank: కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
Embed widget