Fact Check : మహిళా దళిత నేతను వైవీ సుబ్బారెడ్డి అవమానించినట్లుగా ఆరోపణలు - నిజం ఏమిటంటే ?
వైసీపీ దళిత మహిళా నేతను వైవీ సుబ్బారెడ్డి అవమానించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే తనను అవమానించలేదని మహిళా నేత వీడియో విడుదల చేశారు.
Fact Check : వైఎస్ఆర్‌సీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కోనేరు రంగారావు మనువరాలు డాక్టర్ సత్య ప్రియను అవమానించారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ ఫోటో కూడా వైరల్ అవుతోంది. సుబ్బారెడ్డి కాలు మీద కాలు వేసుకుని కుర్చీలో కూర్చుని ఉండగా.. సత్యప్రియ మెట్లపై కింద కూర్చుని ఉన్నారు. ఈ ఫోటోతో దళిత మహిళా నేతను వైవీ సుబ్బారెడ్డి అవమానించారని విస్తృతంగా ఆరోపణలు వినిపించాయి. సోషల్ మీడియాలో వైవీ సుబ్బారెడ్డి తీరుపై విమర్శలు గుప్పించారు.
పెత్తందార్ల ముందు, దళితులు కుర్చీలో కూడా కూర్చోకూడదా ?
— Telugu Desam Party (@JaiTDP) September 4, 2023
దళితులకు వైసీపీ నేతలు ఇచ్చే గౌరవం ఇదేనా?
వైవీ సుబ్బారెడ్డి అహంకారం చూసారా ? దివంగత కాంగ్రెస్ దళిత నేత, ఉమ్మడి ఏపీకి డిప్యూటీ సీఎంగా చేసిన కోనేరు రంగారావు మనవరాలైన డాక్టర్ కోనేరు సత్యప్రియ గారిని నేల మీద కూర్చోబెట్టి,… pic.twitter.com/dho7W0wpos
డాక్టర్ సత్యప్రియ తిరువూరు నియోజకవర్గం నుంచి సత్యప్రియ టికెట్ ఆశిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిని తాడేపల్లిలో అయన నివాసంలో సత్య ప్రియ కలిశారు. ఈ సందర్భంగా ఫోటో తీసుకున్నారు. దళితులపై చిన్నచూపంటూ సామాజిక మాధ్యమాల్లో తాజాగా ఫొటో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ లో సీనియర్ దళిత నేత, ఉమ్మడి ఏపీకి డిప్యూటీ సీఎంగా చేసిన కోనేరు రంగారావు ఉన్నారు. విమర్శలు ఎక్కువగా వస్తూండటతో సోషల్ మీడియాలో సత్యప్రియ స్పందించారు. ఓ వీడియో విడుదల చేశారు.
తమ పార్టీపై , వైవీ సుబ్బారెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సత్యప్రియ వీడియోలో విమర్శిలించారు. తన పుట్టినరోజు , రాఖీ పండుగ సందర్భంగా సుబ్బారెడ్డి దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన సమయంలో మెట్ల మీద కుర్కన్నందుకు ఆ ఫోటోని వక్రీకరిస్తున్నారని ఆమె విమర్శించారు. వైఎస్సార్ సీపీకి SC ల పట్ల చులకన భావం ఉన్నందువల్లే కనీసం కుర్చీలో కూర్చోమనలేదని ప్రచారం సాగుతుందని కానీ ఇది నిజం కాదని సత్యప్రియ స్పష్టం చేశారు.
వైఎస్సార్ సీపీ పైన అనవసరంగా బురదజల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు కోనేరు సత్య ప్రియా. సుబ్బా రెడ్డికి తమ కుటుంబానికి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల అన్నలాగా భావించి తన పుట్టిన రోజు సందర్బంగా ఆశీర్వాదం తీసుకోడానికి వెళ్లిన విషయాన్నీ ఇలా వక్రీకరించడం సబబు కాదన్నారు ఇంత నీచానికి దిగజారారంటూ ధ్వజమెత్తారు. SCల పట్ల వైఎస్సార్ సీపీ వైఖరి ఎప్పుడు గొప్పగానే ఉందని చేసిన మంచిని గుర్తు చేస్తూ ఇలాంటి దిష్ప్రచారాలను నమ్మకూడదని వీడియోలో కోరారు.