By: ABP Desam | Updated at : 29 Jun 2022 10:53 AM (IST)
ఏపీలో ఉద్యోగులకు మరో షాక్
EPF Money Debited From Employees PF Accounts, says Employees Union leader surya narayana
Money Debited From Employees PF Accounts: ఏపీలో ఉద్యోగులకు మరో షాక్ తగిలింది. జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు డెబిట్ కావడం కలకలం రేపుతోంది. తమ నగదు ఎవరు తీసుకున్నారో తెలియడంలేదని.. గతంలోనూ ఇలాగే జరిగితే ఫిర్యాదు చేయగా జీపీఎఫ్ ఖాతాల్లోకి నగదు మళ్లీ అయిందని చెబుతున్నారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు మాయమైందని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ తెలిపారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆర్థిక శాఖ అధికారులు ఎవరూ లేరని, పీఎఫ్ విత్‌డ్రా సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తామని పేర్కొన్నారు.
పీఎఫ్ విత్‌డ్రా సమస్య మళ్లీ మొదటికి..
గతంలో ఏపీలో ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్ (Money Debited From PF Accounts) అయ్యాయి. ఫిర్యాదు చేయగా.. తమకు నగదు తిరిగి జమ చేశారని సూర్యనారాయణ తెలిపారు. కానీ మళ్లీ విత్ డ్రా చేసుకున్నట్లు రాత్రి నుంచి మెసేజ్ లు వచ్చాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తన ఖాతా నుంచి సైతం రూ.83 వేలు విత్ డ్రా చేశారని తెలిపారు. మొత్తం 90 వేల మంది ఉద్యోగులకు చెందిన పీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్ల వరకు నగదు డెబిట్ అయిందని అంచనా వేశారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లినా ప్రయోజనం కనిపించలేదన్నారు. ఫిర్యాదు చేసేందుకు ఆర్థిక శాఖకు వెళ్తే అధికారులు అందుబాటులో లేరని తెలిపారు. ఉద్యోగుల అనుమతి లేకుండా వారి పీఎఫ్ ఖాతాల నుంచి నగదు తీసుకోవడం నేరమని చెప్పారు.
పీఆర్సీ డీఏ బకాయిలను పీఎఫ్ ఖాతాకు జమ చేస్తానని చెప్పారు. అయితే 6 నెలలుగా ఇచ్చిన డీఏ బకాయిలు మళ్లీ వెనక్కి తీసుకుంటున్నారని.. తాజాగా 90 వేల మంది పీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్లు మాయం చేశారని తెలిపారు. ప్రభుత్వానికి తెలిసే జరిగాయా లేక అధికారుల తప్పిదమా తెలియదని.. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఆర్థికశాఖ అధికారులు ఎవరూ లేరని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ వెల్లడించారు.
Also Read: YSRCP MP Raghurama: నన్ను అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు, ప్రధాని మోదీని నేరుగా సాయం కోరతా : ఎంపీ రఘురామ
Also Read: YSRCP Nominated Posts: వైఎస్సార్‌సీపీలో పదవుల పండుగ - పార్టీ అనుబంధ సంఘాలకు అధ్యక్షులు వీరే
హాస్టళ్ల విద్యార్థలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
Gorantla Madhav Issue : వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవో కాదో చెప్పలేం - ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్‌కు పంపుతామన్న అనంతపురం ఎస్పీ !
Breaking News Live Telugu Updates: గోరంట్ల మాధవ్ వ్యవహారంలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్‌ది కాదు: పోలీసులు
Varavararao Bail : వరవరరావుకు ఎట్టకేలకు ఊరట - శాశ్వత మెడికల్ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు !
Krishna District: భార్యను అక్కడ కొరికిన భర్త, పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు
SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు
Asia Cup, India's Predicted 11: పాక్ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్ అంచనా నిజమవుతుందా?
OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!
Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!