అన్వేషించండి

Andhra Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో ఈడీ సైలెంట్ ఆపరేషన్ - డిస్టిలరీల యజమానులకు నోటీసులు - కీలక మలుపు ఖాయమా?

ED Investigation: ఆంధ్రా లిక్కర్ కేసులో ఈడీ కూడా దూకుడుగా విచారణ జరుపుతోంది. డిస్టిలరీల యజమానులకు నోటీసులు జారీ చేస్తోంది. సీఐడీ సిట్ చార్జిషీటు ఆధారంగా దర్యాప్తు చేయనున్నట్లుగా తెలుస్తోంది.

ED investigation in Andhra liquor Scam Case:  ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. సీఐడీ సిట్ అధికారులు ఇప్పటికే ప్రాథమిక చార్జిషీటు దాఖలు చేశారు. ఈ స్కామ్ మొత్తానికి సూత్రధారిగా జగన్‌ను గుర్తించారని అరెస్టు చేయవచ్చన్న ప్రచారం కూడా ఊపందుకుంటోంది. ఇలాంటి సమయంలో  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకిదిగింది.  
 
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగుతుండగానే, కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసులు పెట్టింది.  అక్రమ నగదు చెలామణి కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ స్కామ్ మొత్తం నగదు లావాదేవీలు నిండి ఉన్నాయని సిట్ గుర్తించింది. సీఐడీ నమోదుచేసిన కేసు ఆధారంగానేమే నెలలోనే ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది.

మద్యం సరఫరాదారుల నుంచి కమీషన్ల రూపంలో భారీగా ముడుపులు వసూలు చేసి, ఆ డబ్బును హవాలా మార్గాల్లో తరలించారని సిట్ తన ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. ఈడీ విచారణకు సిఫారసు చేస్తున్నట్లుగా అసెంబ్లీలోనే చంద్రబాబు ప్రకటించారు. సిట్ అధారాలను బేస్ చేసుకుని ఈడీ కూడా నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది.  వైసీపీ హయాంలో భారీగా మద్యం ఆర్డర్లు పొంది, కమిషన్లు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్న డిస్టిలరీల యజమానులకు నోటీసులు జారీ చేస్తోంది.  శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. రానున్న రోజుల్లో మరికొంత మంది మద్యం వ్యాపారులు, అప్పటి ప్రభుత్వ పెద్దలతో సంబంధాలున్న వ్యక్తులను ఈడీ విచారించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. 

ఈ కేసులో ఇప్పటికే  ఎంపీ పి.వి. మిథున్ రెడ్డితో సహా 12 మందిని సిట్ అరెస్టు చేసింది. నిందితులు మద్యం సిండికేట్‌గా ఏర్పడి, ఆర్డర్లు ఇచ్చే విధానాన్ని అనుకూలంగా మార్చుకుని, భారీగా కమీషన్లు దండుకున్నారని సిట్ తన చార్జిషీట్‌లో పేర్కొంది. ఈ అక్రమ ధనాన్ని ఎన్నికల ఖర్చులకు, ఇతర పెట్టుబడులకు మళ్లించినట్లు చెబుతోంది. సిట్ దర్యాప్తుతో పాటు ఇప్పుడు ఈడీ విచారణ కూడా మొదలుకావడంతో, ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది తేలనుందని భావిస్తున్నారు.  

లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించుకున్న దొంగ డబ్బు లో హెచ్చు భాగం హవాలా విదేశాలకు తరలిపోయిందని సిట్ సేకరించిన వివరాలు  ఈడీకి అందించింది. నిందితులు విదేశాల్లో కూడా లాజిస్టిక్స్ పేరుతో కంపెనీలు పెట్టి బ్లాక్ ను వైట్ చేశారని .. ఇండియాకు తరలించారని గుర్తించారు. అలాగే  2024 ఎన్నికల్లో దాదాపు 300 కోట్లు వైసిపి అభ్యర్థులకు ఇచ్చారన్న సమాచారం కూడా సిట్ ఈడీకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.  నోట్ల కట్టల డెన్ లను గుర్తించారు. అక్కడ తీసిన వీడియోలు సాక్ష్యాలను కూడా ఈడీకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అరెస్టులు ప్రారంభిస్తే.. లిక్కర్ కేసులో కొత్త  సంచలనాలు నమోదయ్యే అవకాశాలు ఉంటాయి.  రాజకీయంగానూ కలకలం రేపే  అవకాశాలు ఉంటాయి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Embed widget