East Godavari News: విజయదశమి రోజున సీతారాముల కళ్యాణం... ఆ ఊరిలో వింత ఆచారం... అసలు కథేంటంటే...!
దేశమంతా దసరా వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఆ గ్రామంలో మాత్రం సీతారాముల కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంప్రదాయం వెనుక ఉన్న అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం.
దేశమంతా విజయదశమి వేడుకను ఘనంగా జరుపుకుంటుంటే ఆ గ్రామంలో మాత్రం సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. మీరు విన్నది నిజమే. సరిగ్గా విజయదశమి రోజునే ఈ గ్రామంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామంలోని భీమభక్తుని పాలెంలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ గ్రామంలో దసరా వేడుకలు కూడా ఘనంగా జరుగుతాయి. సీతారాముల కళ్యాణం అంతకంటే ఘనంగా నిర్వహిస్తారు.
Also Read: చెడుపై మంచి సాధించిన విజయం.. ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంల దసరా శుభాకాంక్షలు
అసలు కథ ఏమిటంటే...
విజయదశమి రోజున శ్రీరామనవమి చేయడం వందల ఏళ్లుగా వస్తున్న ఆచారం అని చెబుతారు స్థానికులు. విజయదశమి రోజున ఉదయం రామాలయంలో పూజలు నిర్వహించి రాత్రికి కళ్యాణం చేయడం అక్కడ ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఇంతకీ ఈ ఆచారం వెనుక అసలు విషయం ఏమిటంటే. ఇక్కడి పూర్వీకులు పనుల్లేక గ్రామాన్ని విడిచి వలస వెళ్లేవారు. సాధారణంగా సీతారాముల కళ్యాణం వేడుక ఏప్రిల్ మాసంలో జరుగుతుంది. ఆ సమయంలో ఈ గ్రామవాసులంతా వేరే ప్రాంతాలకు పనులు కోసం వలస వెళ్లడంతో తమ ఆరాధ్య దైవమైన సీతారాములను పూజించుకునే అవకాశం లేకపోయేది. దీంతో వారంతా పనులు ముగించుకుని సొంత ఊళ్లకు వచ్చిన తర్వాత దసరా పండుగ సందర్భంగానే తన ఇష్టదైవమైన రాములోరి కళ్యాణాన్ని ఘనంగా జరిపించే వారు.
Also Read: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ గ్రామస్తులు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దేశమంతా విజయదశమి వేడుకలు జరుగుతుంటే ఇక్కడ మాత్రం శ్రీరామ నవమి కళ్యాణం జరగడం విశేషం కావడంతో సమీప ప్రాంతాల ప్రజలు రాత్రి జరిగే కళ్యాణ మహోత్సవానికి భక్తిశ్రద్ధలతో వీక్షిస్తారు.
Also Read: సిద్దిధాత్రిగా శ్రీశైలం భ్రమరాంబిక.. తెప్పోత్సవంతో ముగియనున్న దసరా ఉత్సవాలు
Also Read: ఓరుగల్లులో కన్నుల పండువగా దసరా ఉత్సవాలు…రంగలీలా మైదానంలో రావణ దహన వేడుకలు
Also Read: ఇయ్యాల్టి నుంచే పూలపండుగ... బతుకమ్మ ఎలా ప్రారంభమైందో, ఎన్ని కథలు ప్రచారంలో ఉన్నాయో మీకు తెలుసా..
Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి