By: ABP Desam | Updated at : 08 Jan 2022 04:53 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
రూ.3.6 లక్షల ధర పలికిన కోడి పుంజు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలకు గోదావరి జిల్లాలుపెట్టింది పేరు. గోదారోళ్ల మర్యాదలు, వేటకారంతో పాటు కోడి పందేలు కూడా చాలా ఫేమస్. సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతాయి. సంక్రాంతి మూడు రోజుల పాటు జరిగే కోడి పందేల కోసం ఏడాది ముందే నుంచి కోడి పుంజుల్ని పెంచుతారు. పందెం పుంజులను పెంచడమంటే మాటలు కాదంటారు గోదారోళ్లు. వాటిని సొంత బిడ్డల్లా చూసుకుంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో ఏడాది పొడవునా జీడిపప్పు, బాదం పెట్టి పెంచుతారు. అప్పుడప్పుడూ నాన్ వేజ్ కూడా పెడతారండోయ్.
Also Read: ఏపీలో ట్రయాంగిల్ పొలిటికల్ లవ్ స్టోరీ ! క్లైమాక్స్ మలుపు తిప్పుతుందా ?
లక్షలు కురిపిస్తున్న కోడిపుంజులు
అంత పెట్టుబడి పెట్టి పెంచిన పుంజుల్ని తగ్గేదే లే అన్న రేటుకు అమ్ముతుంటారు. పందెంరాయుళ్ల కంటికి ఇంపుగా కనిపించేలా పందెంలో ప్రత్యర్థి కోడి పుంజును బెదరగొట్టేలా పెంచుతున్నారు. అలా పెంచిన కోడి పుంజుల ధరలు కూడా లక్షల్లో పలుకుతాయి. పందెంలో కోట్లు కురిపిస్తాయని పందెంరాయుళ్లు లక్షలు పెట్టి కోడి పుంజుల్ని కొంటారండోయ్. ఆయ్ గోదారోళ్లంటే మరి ఎందులోనూ తగ్గేదే లే అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వి.కె.రాయపురంలో దగ్గుమిల్లి మధు పెంచుతున్న పందెం కోళ్లు లక్షల్లో ధరలు పలికాయి. 20 నెలలు వయసున్న రసంగి పందెం కోడి ధర రూ.3.60 లక్షలు పెట్టి పందెంరాయుళ్లు సొంతం చేసుకోగా, పచ్చకాకి రకం కోడి విలువ రూ.2.60 లక్షలకు అమ్ముడు పోయింది.
Also Read: పీఆర్సీ జీతాలు పెరుగుతాయా ? తగ్గుతాయా ? - పెన్షనర్లకు లాభమా ? నష్టమా ? ... ఏ టూ జడ్ ఎనాలసిస్ ఇదిగో..
సంక్రాంతి సంబరాల్లో కోడి పందేలు ఫేమస్
సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాల్లో సంబరాలు మిన్నంటుతాయి. భోగి పండుగ మొదలు ముక్కనుము వరకూ పల్లె లోగిళ్లు పండుగ సందళ్లతో మోతమోగిపోతాయి. పెద్ద పండుగగా చేసుకునే సంక్రాంతికి ఉద్యోగాల రీత్యా ఎక్కడెక్కడో ఉన్న వారంతా సొంత ఊళ్లకు వస్తారు. కుటుంబం మొత్తం ఆనందంగా గడుపుతారు. గోదావరి జిల్లాల్లో జరిగే కోళ్ల పందేలు చూసేందుకు ఇతర జిల్లాల వాసులు గోదావరి జిల్లాలకు వస్తుంటాయి. ఈ కోడి పందేలు నిర్వహణకు కూడా భారీగానే ఉంటుంది. పందేల కోసం పెద్ద పెద్ద బరులు గీసి, చూసేందుకు పెద్ద స్ర్కీన్ కూడా ఏర్పాటుచేస్తారు. వీక్షకుల వాహనాలకు పార్కింగ్, ఎంజాయ్ చేసేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు పందెం బరి చుట్టూ సిద్ధం చేస్తారు. ఇంత ఘనంగా జరిగే కోడిపందేలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరండోయ్. ఏటా పండుగ మూడు రోజులు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. అధికారికంగా మూడు రోజులే కానీ అనధికారికంగా ఓ వారం రోజులు జరుగుతాయి. ఈసారి కోడి పందేలకు పర్మీషన్ ఉంటుందో లేదో వేచిచూడాలి.
(కోడి పందేలు ఆడడం, నిర్వహించడం చట్టరీత్యానేరం)
Also Read: పవన్‌ను పదే పదే టార్గెట్ చేస్తున్న సోము వీర్రాజు ! బీజేపీ -జనసేన మధ్య దూరం పెరుగుతోందా ?
Jagananna Amma Vodi Scheme : అమ్మ ఒడి పథకం లబ్ధిదారులకు షాక్, మరో రూ.వెయ్యి కోత!
Breaking News Live Updates : చిత్తూరు జిల్లాలో ఇద్దరి దారుణ హత్య
Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ
Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
Kanika Kapoor Second Marriage: 'పుష్ప' సింగర్ రెండో పెళ్లి చేసుకుంది - ఫొటోలు చూశారా?
Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో నలుగురు నిందితులు అరెస్టు
Pooja Hegde: ‘కేన్స్’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!
Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు