Palnadu Power Crisis : పల్నాడు జిల్లా సర్కార్ ఆఫీసులకు "పవర్" షాక్ - బిల్లులు కట్టట్లేదని కరెంట్ నిలిపివేత !
విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో గురజాల సబ్ డివిజన్‌లో ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ కరెంట్ సరఫరా నిలిపివేశారు. దీంతో అంగన్ వాడీ కేంద్రాలు సహా అన్నీ అంధకారంలో మునిగిపోయాయి.
Palnadu Power Crisis : పల్నాడు జిల్లాలోని గురజాల సబ్ డివిజన్‌లోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపై విద్యుత్ శాఖ అధికారులు ఒక్క సారిగా దాడులు చేశారు. కనబడినవి కనబడినట్లుగా ఫ్యూజులు పీకేశారు. పనుల్లో ఉన్న ఉద్యోగులంతా ఒక్క సారిగా కరెంట్ పోే సరికి ఉలిక్కి పడ్డారు. విషయం తెలుసుకుని తమ ఫ్యూజులే ఎగిరిపోయినట్లుగా ఫీలయ్యారు. ఎందుకంటే విద్యుత్ పీకేసింది బిల్లులు చెల్లించలేదని. ప్రభుత్వ కార్యాలయాలకు.. నేరుగా ప్రభుత్వానికి చెందిన విద్యుత్ సిబ్బందే ఫ్యూజులు పీకేయడంతో ఇదేంటని అడగలేని పరిస్థితి.
ప్రభుత్వ కార్యాలయాలు అయిన సరే కరెంట్ బిల్లులు చెల్లించాల్సిందే. అది రూలు. కార్యాలయాల వారీగా వచ్చే విద్యుత్ బిల్లులను ఆయా కార్యాలయాల నిర్వహణ కోసం ఇచ్చే మొత్తంలో చెల్లించాలి . ప్రభుత్వం ఇవ్వకపోతే ఏమీ చేయలేరు. పల్నాడు జిల్లా గురజాల సబ్ డివిజన్‌లో ఆఫీసులకు కొన్నాళ్లుగా నిర్వహణ నిధులు రావడంలేదు. దాంతో బిల్లులు చెల్లించడం లేదు. ఆ బకాయిలు అలా పెండింగ్‌లో పడిపోతున్నాయి. విద్యుత్ అధికారులకు పెండింగ్ బిల్లుల టెన్షన్ పెరిగిపోయింది. దాంతో వారు కూడా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. మనం మనం ప్రభుత్వం అని కొద్ది రోజులు నెట్టుకొచ్చారు కానీ.. . ఇక బకాయిలు తీర్చకపోతే వదిలే చాన్స్ లేదని చివరికి ఫ్యూజులు పీకేయాలని నిర్ణయించుకున్నారు.
గురజాలనియోజకవర్గంలో అన్ని ఎమ్మార్వో ఎంపీడీవో కార్యాలయాలు .. అంగడవాడి కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు , మెడల్ స్కూల్స్ లు , హెల్త్ సెంటర్లు, మంచినీచి నిర్వహణ కేంద్రాలు, ఆర్ అండ్ బీ బంగ్లాలు ఇలా దేన్నీ వదిలి పెట్టలేదు. అన్నింటికీ కరెంట్ పీకేశారు. మామూలుగా అయితే లక్షల్లో బిల్లులు ఉంటే ఓపిక పట్టేవాళ్లమని కానీ పరిస్థితి మరీ చేయిదాటిపోయిందని..అన్ని ఆఫీసులకు కలిసి రూ. యాభై కోట్లకుపైగా బకాయి ఉందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
బిల్లుల వసూలుకు పై నుంచి వస్తున్న ఒత్తిళ్లతో అధికారులు చివరికి మనం.. మనం ప్రభుత్వం అనే సెంటిమెంట్‌ను కూడా దవిలేశారు.విద్యుత్ శాఖ వారు ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలు కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు ఆరు బయట తమ విద్యను కొనసాగిస్తున్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎమ్మార్వో కార్యాలయాలను ముందు ప్రజలు పడిగాపులు కావలసిన పరిస్థితి దీనిపై విద్యుత్ శాఖ వారిని వివరణ అడగగా పైనుంచి ఆదేశాల మనకే విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగిందని అధికారులు ప్రకటించారు.