అన్వేషించండి

Driver Subrahmanyam Case : తమ కొడుకు హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలి - సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు

Rajahmundry News : డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ .. అనంతబాబు తమ కొడుకును దారుణంగా చంపారని ఆరోపించారు. కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.

Driver Subrahmanyam Murder Case: తమ కొడుకు హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సత్యనారాయణ, నూకరత్నం డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేయడం, ఆపై కొంతకాలానికి బెయిల్ మీద రావడం తెలిసిందే.  డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. అనంతబాబు తమ కొడుకును దారుణంగా చంపారని డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ ఆరోపించారు. ఒంటి నిండా గాయాలున్నా పోలీసులు కేసు నీరు గార్చాలని చూశారని.. కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. 

నిందితుడికి శిక్ష పడాలి
తమ కొడుకును చంపిన అనంతబాబుకు శిక్షపడాలని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. శిక్షపడే వరకు పోరాడుతామన్నారు. కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. కాకినాడ పోలీసులు అనంతబాబుకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. కేసును వదిలేయాలని గతంలో అనంత బాబు అనుచరులు మమ్మల్ని బెదిరించారని చెప్పారు. ఈ కేసు విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తామన్నారు.  తమ కొడుకు కేసు విషయంలో న్యాయవాది సుబ్బారావు చాలా సహాయం చేశారని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు తెలిపారు. 
 
సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిర్లక్ష్యం
దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసును తిరిగి విచారించాలని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు కోరారు. విధుల నిర్వహణలో అలసత్వానికి పాల్పడిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.  సుబ్రహ్మణ్యం ఒంటినిండా గాయాలు ఉన్నా అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపించారు. సంఘటన జరిగిన సమయంలో అనంతబాబు గన్ మ్యాన్ ఎక్కడికి వెళ్లాడు.. సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇంకా చాలామంది ఉన్నారని సుబ్బారావు అనుమానం వ్యక్తం చేశారు. కానీ అనంతబాబు ఒక్కరి మీదే కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి అన్ని గాయాలు చేయడం అసంభవం అన్నారు.  వైసీపీ అడుగు జాడల్లో నడిచిన పోలీసు అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.  

ఆ కుటుంబ బాధ్యత ప్రభుత్వానిదే
అనంతబాబు సహజ వనరులను దోచుకున్నారని సుబ్బారావు ఆరోపించారు. ఆ వైసీపీ నేత చేసిన అక్రమాలకు అధికారులంతా సహకరించారన్నారు. చట్ట ప్రకారం బాధితుడికి అందాల్సిన ఆర్థిక సహాయం కూడా ఇంకా అందలేదన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీద ఆధారపడి బ్రతికే వారికి పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకోవలసిన బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వం పై ఉందన్నారు. అనంతబాబు హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా చేయలేదన్నారు. అనంత బాబు పై రౌడీషీట్ ఉన్నా గతంలో ఎటువంటి కేసులు లేవని పోలీసులు కేసు నమోదు చేశారు.  పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మించిన అక్రమాలు, నేరాలు  అనంతబాబు చేశారని సుబ్బారావు తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం! 
అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం! 
Amaravati Seed Access Road inauguration:
"గ్రాఫిక్స్ అన్న వాళ్లే తలదించుకునేలా అమరావతి" సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో చంద్రబాబు కామెంట్స్!
Amaravati Seed Access Road: అమరావతి నిర్మాణంలో మరో మైలురాయి! సీడ్ యాక్సెస్‌ ఇ-3 రహదారి, స్టీల్ బ్రిడ్జ్‌ ప్రారంభం!
అమరావతి నిర్మాణంలో మరో మైలురాయి! సీడ్ యాక్సెస్‌ ఇ-3 రహదారి, స్టీల్ బ్రిడ్జ్‌ ప్రారంభం!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget