By: ABP Desam | Updated at : 07 Dec 2022 05:18 PM (IST)
చంద్రబాబు చేతి ఉంగరం విశేషాలు ఏమిటంటే ?
Chandrababu Ring : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఉంగరాల్లాంటివి పెట్టుకోరు. కానీ ఇటీవలి కాలంలో ఆయన చేతికి ఓ ఉంగరం కనిపిస్తోంది. కానీ అది ఉంగరం కాదని గతంలోనే ఆయన క్లారిటీ ఇచ్చారు. అది హెల్త్ ట్రాకర్ అని చెప్పారు. అయితే దాని గురించి పూర్తి వివరాలు చెప్పలేదు. కానీ ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసినప్పుడు ఆ ఉంరగం కథేమిటో.. దాని విలువెంతో.. అది చేసే పనేమిటో మీడియా ప్రతినిధులకు వివరించారు. అంత చిన్న ఉంగరం అంత పెద్ద పని చేస్తుందా.. అని అందరూ ఆశ్చర్యపోయారు.
శరీరంలో ప్రతీ మార్పును గుర్తించే రింగ్
తన చేతికి ఉన్న రింగ్ ప్రత్యేకమైన చిప్‌తో ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ఫోన్ కు ఇది కనెక్టయి ఉంటుందన్నారు. తన బాడీలోని మార్పులు ముఖ్యంగా..ఆక్సిజన్ లెవల్, బీపీ, షుగర్ వంటి అనేక సలహాలను ఫోన్ లో చూపిస్తుందన్నారు. రింగ్ కు చార్జింగ్ అవసరమని చెప్పారు. ఈ రింగ్ తో రేడియేషన్ సమస్య లేదని.. రింగ్ ద్వారా ఫోన్లో రికార్డైన తన హెల్త్ డిటైల్స్ మీడియా ప్రతినిధులకు చూపించారు. ఈ సందర్బంగా తన ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలను చంద్రబాబు వివరించారు. బ్యూటీ ఆఫ్ టెక్నాలజీని తాను ప్రమోట్ చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తాను వాడుతున్న రింగ్ ధర రూ. 30 వేలని అన్నారు. అయితే ఇండియాలో ఇంకా ఈ రింగ్ రిలీజ్ కాలేదని.. అమెరికాలో మాత్రం రిలీజ్ అయిందని వెల్లడించారు. తాను ఇతరులకు మోడల్ గా నిలవాలని కోరుకుంటానని.. అందులో భాగంగా ప్రమోట్ చేస్తున్నట్లు చెప్పారు.
అమెరికాలో ఆ రింగ్ విలువ 399 డాలర్లు !
ఫిట్‌నెట్ ట్రెండ్స్ గురించి ఆసక్తి ఉన్న ఎవరికైనా వేలికి పెట్టుకునే ఫిట్నెస్ మానిటర్స్ గురించి తెలుసు. చాలా మందికి వాచీలా చేతికి పెట్టుకుననే హెల్త్ మానిటర్స్ మెయిన్‌టెయిన్ చేస్తూంటారు. ఇప్పుడు లెటెస్ట్ టెక్నాలజీతో వేలికి పెట్టుకునే ఉంగరాల్లంటి పరికరాలు వచ్చేశాయి. ఇండియాలో ఇంకా పెద్దగా పాపులర్ కాలేదు. ఔరా స్మార్ట్ రింగ్ పేరుతో ఇది అక్కడి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఫోన్‌కు కనెక్ట్ అవడం ద్వారా.. మొత్తం తెలిసిపోతుంది. ఎంత సేపు పడుకున్నారు.. ఎంత సేపు పడుకోవాలో కూడా సజెస్ట్ చేస్తుంది. శరీరానికి అలసట లేకుండా... ఆరోగ్యంగా ఎలా ప్రమాణాల ప్రకారం నడుచుకోవాలో.. ఎంత మేర పరిమితంగా తినాలో కూడా ఈ ఔరా రింగ్ సూచిస్తుంది. అయితే రింగ్ కొంటే సరిపోదు.. మెంబర్ షిప్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నెల నెలా చందా కట్టాలి. మొదటగా ఆ ఉంగరాన్ని కొనాలంటే 399 డాలర్లు వెచ్చించాలి. అంటే మన రూపాయల్లో 30వేలపైనే ఉంటుందని అనుకోవచ్చు.
ఫిట్‌నెస్, ఆరోగ్యం విషయంలో చంద్రబాబు మిస్టర్ పర్ ఫెక్ట్
చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా ఉంటారు. తినే ఆహారంతో పాటు ప్రతి అంశంలోనూ ఖచ్చితంగా ఉంటారు. అలాగే ఫిట్‌నెస్ విషయంలోనూ జాగ్రత్తగా ఉంటారు. పార్టీ కార్యక్రమాలపై బయటకు వెళ్లినప్పుడు ఫిట్‌నెస్ ట్రాకర్లను ఉపయోగిస్తూ ఉంటారు. చంద్రబాబు వయసు కూడా 70 దాటిపోయింది. అందుకే ఆయన శరీరంలో వచ్చే మార్పులపై కుటుంబసభ్యులు కూడా ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుంటారు. ఈ రింగ్ ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్లేషించి.. చంద్రబాబుకు ఆరోగ్యపరంగా సలహాలివ్వడానికి ఓ టీం ఎప్పుడూ పని చేస్తూ ఉంటుందని తెలుస్తోంది.
Nellore Rural Incharge Adala : నెల్లూరు రూరల్కు ఇంచార్జ్ గా ఎంపీ ప్రభాకర్ రెడ్డి - ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనేనన్న సజ్జల !
Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్
Jagan focus on Muslims : మైనార్టీలపై జగన్ ఫోకస్, త్వరలో భారీ బహిరంగ సభకు ప్లాన్!
Sajjala Rama Krishna Reddy : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చంద్రబాబు స్కీం, కోటంరెడ్డి పాత్రధారి మాత్రమే - సజ్జల
Satysai District Crime News: సత్యసాయి జిల్లాలో దారుణం - ఆరో తరగతి విద్యార్థినిపై యువకుడి అత్యాచార యత్నం
Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?
Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని
PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam
Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?