TDP Gudivada Seat: గుడివాడ సీటుపై టీడీపీ ఫోకస్, వంగవీటి అస్త్రాన్ని ప్రయోగిస్తుందా?
TDP Gudivada Seat: గుడివాడ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థిపై తెలుగు దేశం క్లారిటీకి వచ్చిందనే ప్రచారం జరుగుతుంది.
TDP Gudivada Seat:
గుడివాడ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థిపై తెలుగు దేశం క్లారిటీకి వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుడివాడ స్థానంలో వంగవీటి రాధాను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీలో టాక్ వినిపిస్తోంది.
గుడివాడపై పంతం...
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావటానికి ఎంత ఎఫర్ట్స్ ను పెడుతుందో అంతే స్థాయిలో గుడివాడ సీటు విషయంలో ఫోకస్ చేస్తోంది. ఎట్టి పరిస్దితుల్లో తెలుగు దేశం పార్టీ జెండా గుడివాడలో ఎగరాలనేటార్గెట్ తో తెలుగు దేశం పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆ స్థానంలో అభ్యర్థి ఎవరు అనే విషయంపై ఇప్పటి వరకు భారీగా ప్రచారాలు జరిగాయి. గత ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు తిరిగి ఆ స్థానంలో పోటీ చేసేది తానేనని ప్రచారం చేసుకున్నప్పటికి ఆయనకు ఆ ఛాన్స్ లు లేవని పార్టీ వర్గాలే మెదటి నుండి చెబుతున్నాయి. సో ఇప్పుడు కులాల ఈక్వేషన్ ను కేంద్రంగా చేసుకొని వంగవీటి రాధాకృష్ణను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. అదే జరిగితే హోరాహోరీ పోరులో ఎవరు గెలుపు ఎలా ఉంటుందనే అంశం పైనే తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సీటు విషయంలో తెలుగు దేశం పార్టీ నాయకత్వం మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఇద్దరు మిత్రులే... కానీ క్యాస్ట్ కీలకం...!
ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం మేరకు వంగవీటి రాధాకృష్ణ గుడివాడ నుంmr పోటీలోకి దిగితే, ఈ పోటీ ఇద్దరు మిత్రులు మద్య కూడ రసవత్తరంగా మారనుంది. వంగవీటి రాధా కృష్ణ, కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, ముగ్గురు ఆప్త మిత్రులు అన్న విషయం తెలిసిందే. గుడివాడలో గెలుపు కోసం తెలుగు దేశం పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో వంగవీటి రాధా కృష్ణను బరిలోకి దింపేందుకు అన్ని అవకాశాలు ఫుల్ గా ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు గుడివాడ నియోజకవర్గంలో ఎక్కువ శాతం కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి. దీంతో క్యాస్ట్ ఈక్వేషన్ లో కూడ వంగవీటి రాధా కృష్ణ నియోజకవర్గంలో ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు కాపు సామాజిక వర్గం ఎపక్షంగా కొడాలి నానికి ఫుల్ సపోర్ట్ చేశారు. అయితే ఇటీవల కొడాలి నాని చిరంజీవి పై చేసిన కామెంట్స్ కూడ వైరల్ కావటంతో వివాదం అయ్యింది. ఆ తరువాత కొడాలి నాని దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి వచ్చింది.
వెనక్కి తగ్గిన కొడాలి...
ఇటీవల గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నాని చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారాన్ని రాజేశాయి. చిరంజీవిని పకోడి గాళ్ళు అంటూ సంభోదించారని ప్రచారం జరిగింది. అయితే తాను మాత్రం చిరంజీవిని ఉద్దేశించి చేయలేదని కొడాలి నాని చెబుతున్నారు. అంతే కాదు ఆగస్ట్ 22వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో కూడ కొడాలి నాని పాల్గొని చిరంజీవి పేరు మీద కేక్ కట్ చేసి తాను మెదటి నుండి చిరంజీవిని గౌరవిస్తానని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా కాపు ఓట్లు ఎక్కువగా ఉండటం వలనే అనే ప్రచారం కూడ ఉంది. అందుకే కొడాలి నాని వెనక్కి తగ్గి వివరణ ఇచ్చారని అంటున్నారు.