(Source: ECI/ABP News/ABP Majha)
Anantapur News: సీఎం జగన్ స్వరం మారింది, ఓటమి గ్రహించారు - సీపీఐ రామకృష్ణ
CPI Ramakrishna: మోదీ జగన్ ఇద్దరు ఇద్దరే.. పచ్చి మోసగాళ్లు.. దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని రామక్రిష్ణ వ్యాఖ్యలు చేశారు.
CPI Ramakrishna comments on CM Jagan: ఇటీవలి కాలంలో సీఎం జగన్ స్వరం మారిందని.. రాబోయే ఎన్నికల్లో ఆయన తన ఓటమి గ్రహించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ అన్నారు. ఎన్నికల్లో గట్టెక్కడం కోసమే జగన్ తన వైసీపీ అభ్యర్థులను అందుకే సీఎం జగన్ మారుస్తున్నారని అన్నారు. అనంతపురంలో రామక్రిష్ణ మీడియాతో మాట్లాడారు. మరోవైపు బీజేపీకి 370 సీట్లు వస్తాయని ప్రచారం చేస్తున్నారని అన్నారు. మోదీ జగన్ ఇద్దరు ఇద్దరే.. పచ్చి మోసగాళ్లు.. దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని రామక్రిష్ణ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని క్యాడర్ తోపాటు టీడీపీ మైనారిటీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును 53రోజులు జైల్లో పెట్టడానికి జగన్ కు బీజేపీనే సహకరించిందని ఆరోపించారు.
దేశంలోని ప్రాంతీయ పార్టీలును మోదీ విచ్చిన్నం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాయకులు విచిత్రంగా పగలు ఒక్కరు రాత్రి ఒక్కరు మోదీని కలుస్తారని విమర్శించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిని బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తూ అరెస్ట్ చేస్తారని.. ఏపీ సీఎం జగన్ లక్షలు కోట్లు దోపిడీ చేస్తే కేంద్రం పట్టించుకోదని ఆరోపించారు. ఇవన్నీ బీజేపీ దిగిజాడు రాజకీయాలు అని కొట్టిపారేశారు. సీఎం జగన్ మరోసారి గెలువడానికి వాలంటీర్ వ్యవస్థను నమ్ముకుందని విమర్శించారు.
ఏపీలో ఓటర్లు అవకతవకలు జరగడానికి ప్రదాన కారణం కలెక్టర్ ఎస్పీలు వైసీపీ నాయకులు ప్రమేయం అని అన్నారు. దొంగ ఓట్ల పైన కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్లకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. సీపీఐ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది మార్చి మొదటి వారంలో చర్చలు జరుపుతామని అన్నారు. అప్పుడే తాము తమ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. కేంద్రంలోని బీజేపీ పార్టీని ఓడించడమే తమ లక్ష్యం అని.. ఆ పార్టీతో పోరాడటానికి తాము సిద్ధం అని అన్నారు. అందుకోసం తాము ఏ పార్టీతో అయినా సీపీఐ కలుస్తుందని స్పష్టం చేశారు.