CPI Narayana: పవన్ 3 పెళ్లిళ్ల కంటే బాబాయి హత్య ప్రమాదకరం కాదా?: జగన్ కు నారాయణ కౌంటర్
CPI Narayana Counter to AP CM Jagan: ఏపీ సీఎం జగన్ పదే పదే పవన్ 3 పెళ్లిళ్లు తప్పు అని అంటున్నారు. కానీ బాబాయిని హత్య చేయడం పెద్ద తప్పు కాదా అని సీపీఐ నారాయణ ప్రశ్నించారు.
CPI Narayana Counter to AP CM YS Jagan:
ఏపీ సీఎం జగన్ ను బాబాయ్ హత్యపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుంటారు. అదే విధంగా సీఎం జగన్ సైతం పవన్ న్ టార్గెట్ చేస్తూ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అమ్మాయిలను లోబరుచుకుని మోసం చేయడం పవన్ కు అలవాటేనంటూ ఇటీవల సభలలో జగన్ అంటున్నారు. పవన్ పై మూడు పెళ్లిళ్ల కామెంట్లు చేస్తున్న ఏపీ సీఎం జగన్ కు సీపీఐ నేత నారాయణ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఈ మధ్య సీఎం జగన్ ఎక్కడికి వెళ్లినా పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారు, కానీ వాటి కంటే బాబాయ్ హత్య అత్యంత ప్రమాదకరం అంటూ ఏపీ సీఎంకు చురకలంటించారు.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. జగన్ పదే పదే పవన్ 3 పెళ్లిళ్లు తప్పు అని అంటున్నారు. కానీ బాబాయిని హత్య చేయడం తప్పు కాదా అని ప్రశ్నించారు. పెళ్లిళ్లే తప్పు అని చెబుతున్నారు, మరి బాబాయ్ హత్య తప్పు కాదని చెబుతారా అని దుయ్యబట్టారు. జనసేనాని ఆయనకు కలిసిరాక విడాకులు తీసుకుని వేరే వివాహం చేసుకున్నారని, కానీ ఇలాంటి వ్యక్తిగత విషయాలు సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. జగన్ ప్రకారం.. పెళ్లిళ్లు చేసుకోవడమే ప్రమాదం అయితే, సొంత బాబాయ్ ని హత్య చేయడం ఇంకా దారణమైన విషయమన్నారు. రాజకీయంగా పస లేకనే జగన్ ఇతర నేతల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని సెటైర్లు వేశారు. పాలిటిక్స్ పరంగా అయితే తాను చేసిన మంచి గురించి, అభివృద్ధి పనుల గురించి మాట్లాడాలి కానీ వ్యక్తిగతంగా మాట్లాడటం సరైన పద్దని కాదని సీఎం జగన్ కు హితవు పలికారు.
ఏపీలో జగన్ వర్సెస్ పవన్..
వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థను టార్గెట్ చేశారు. వాలంటీర్లు ప్రభుత్వ పథకాల వివరాలు చెప్పాలి, అవసరమైన వారికి సాయం చేయాలి కానీ, రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలు ఎందుకు సేకరిస్తున్నారని పవన్ ప్రశ్నించారు. వాలంటీర్లు ఒంటరి మహిళలు, యువతుల వివరాలు సేకరిస్తున్నారని, కానీ ఆ డేటా ఎక్కడికి పంపుతున్నారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో దాదాపు వేల అమ్మాయిలు కనిపించకుండా పోయారని, వాలంటీర్లకు మానవ అక్రమరవాణాతో సంబంధం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ వ్యాఖ్యలతో వైసీపీ నేతలు, మంత్రులతో పాటు సీం జగన్ సైతం రంగంలోకి దిగారు.
జగన్ లాంటి వ్యక్తులు పాలిస్తుంటే, రాష్ట్రాన్ని ఇలా చూడలేకపోతున్నానని, అందుకే జగన్ గారు అనడం మానేసి ఏకవచనంతో సంబోధిస్తానంటూ వైసీపీ నేతల ఆగ్రహానికి గురయ్యారు. ఇక అది మొదలుకుని ఏపీ సీఎం జగన్ సైతం గత కొన్ని కార్యక్రమాలలో పవన్ లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేశారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని, అమ్మాయిలను లోబరుచుకుని వారి మోసం చేయడం అతడికి అలవాటేనంటూ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యక్తిగత విమర్శలు, కామెంట్లపై జనసేన నేతలు, టీడీపీ, బీజేపీ సైతం మండిపడుతోంది. తాజాగా సీపీఐ నేత నారాయణ సీఎం జగన్ ను టార్గెట్ చేశారు. ఎవరినైనా రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దని హితవు పలికారు. జగన్ రాజకీయాల్లో పస లేకపోవడంతోనే పవన్ 3 పెళ్లిళ్లను పదే పదే ప్రస్తావిస్తున్నారని.. దాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారని.. అలాగైతే బాబాయ్ హత్య ఇంకెంత పెద్ద తప్పిదం అని నారయణ వ్యాఖ్యానించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial