అన్వేషించండి

Cotton Crop: తగ్గిన తెల్ల బంగారం సాగు విస్తీర్ణం - స్థిరంగా పత్తి ధరలు, ఆదోని మార్కెట్‌కు ప్రత్యేక స్థానం

Kurnool News: తెల్ల బంగారం పత్తి పంటకు గత కొన్నేళ్లుగా గిట్టుబాటు ధరలు లేక సాగు విస్తీర్ణం దాదాపు సగానికి పడిపోయింది. ముందుగా మార్కెట్‌కు వచ్చే పత్తి మహారాష్ట్ర, తెలంగాణ నుంచి అధికంగా ఉంటుంది. 

Cotton Crop In Andhrapradesh: ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో (Guntur District) అధికంగా పత్తి పంటను సాగు చేస్తారు. ఆ తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో అధికంగా పండిస్తారు. కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని, ఆస్పరి, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో అధికంగా పత్తిని సాగు చేస్తారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ ప్రాంతాల్లోని రైతులు పత్తిని అధికంగా సాగు చేస్తారు. ఎప్పుడూ లాభాల బాట పట్టించే పత్తి పంట గత కొన్నేళ్లుగా సరైన దిగుబడి లేకపోవడం, స్థిరమైన ధరలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రైతులు పత్తి సాగు విస్తీర్ణాన్ని పూర్తిగా తగ్గించారు. ఏపీవ్యాప్తంగా దాదాపు 4 లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తారు. అలాంటిది స్థిరమైన ధరలు దిగుబడి లేక పత్తి పంట సాగు వైపు రైతులు ముగ్గు చూపడం తగ్గింది. 

స్థిరంగా ధరలు 

ప్రస్తుతం రాష్ట్రంలో పత్తి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. క్వింటాల్ ధర రూ.8 వేలకు పైగా మార్కెట్లో కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో ఉన్న పత్తి మార్కెట్‌కు ప్రతి రోజూ వేల క్వింటాళ్ల పత్తి వచ్చి చేరుతోంది. కాగా, గత వారం రోజులుగా ధర నిలకడగా కొనసాగుతుండడంతో రైతులు కాస్త సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ముందుగా పత్తి మార్కెట్లకు చేరేది. అధిక వర్షాల కారణంగా కోత దశలో ఉన్న పత్తి పాడవడంతో అక్కడి పత్తి మార్కెట్‌కు రాకపోవడంతో ఏపీ నుంచి పత్తికి డిమాండ్ పెరిగింది. మరోవైపు దారాల రేటు పెరగకపోయినప్పటికీ పత్తి ఎగుమతులు డిమాండ్ పెరగడంతోనే పత్తి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయని మార్కెట్లోని వ్యాపారస్తులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజురోజుకు పత్తి ధరలు పెరుగుతున్నప్పటికీ సాగు విస్తీర్ణం తగ్గిందని అధికారులు అంచనా వేశారు.  

ఆదోని మార్కెట్‌కు ప్రత్యేక స్థానం

పత్తి విక్రయాల్లో దేశంలోనే పేరు పొందిన మార్కెట్‌గా కర్నూలు జిల్లాలోని ఆదోని మార్కెట్ నిలుస్తోంది. అధికంగా పత్తి ఎగుమతులు చేసే మార్కెట్లలో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం మార్కెట్‌కు గతేడాది ధర లేక నిల్వ చేసుకున్న పత్తిని తీసుకొచ్చి రైతులు విక్రయిస్తున్నారు. మరోవైపు ఇప్పుడిప్పుడే ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి మార్కెట్‌కి వస్తుంది.  ప్రతి సంవత్సరం ఆదోని మార్కెట్‌లో పత్తి క్రయ విక్రయాలు రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకూ జరుగుతాయి.

Also Read: Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget