Coronavirus Cases Today: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. రెండు జిల్లాల్లో కనిపించని కొవిడ్19 ప్రభావం
ఏపీలో గత రెండు నెలలుగా వెయ్యి, లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యే పాజిటివ్ కేసులు .. తాజాగా వెయ్యి దిగువకు వచ్చాయి.
ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. ఏపీలో గత రెండు నెలలుగా వెయ్యి, లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యే పాజిటివ్ కేసులు .. తాజాగా వెయ్యి దిగువకు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 771 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో మరో 8 మందిని కరోనా మహమ్మారి బలిగొంది.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,45,335 పాజిటివ్ కేసులకు గాను.. 20,19,273 మంది కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకూ కరోనా బారిన పడి 14,150 మంది మరణించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు దిగొస్తున్నాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 11,912 అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం తాజా బులెటిన్ విడుదల చేసింది.
Also Read: జుట్టు పలుచబడటానికి ఊబకాయం కూడా కారణమే... తేల్చిన పరిశోధన
#COVIDUpdates: 28/09/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) September 28, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,45,335 పాజిటివ్ కేసు లకు గాను
*20,19,273 మంది డిశ్చార్జ్ కాగా
*14,150 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 11,912#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/yK65FtAlIC
ఏపీలో రికవరీ రేటు భేష్..
ఏపీలో కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉంది. పాజిటివ్ కేసులకు రెట్టింపు డిశ్ఛార్జ్ కేసులు ఉండటం ఊరట కలిగిస్తుందని రాష్ట్ర వైద్య శాఖ అధికారులు తెలిపారు. 771 మంది కరోనా బారిన పడగా, అదే సమయంలో 1,333 మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజులో ఏపీలో చిత్తూరులో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కడపలో ఒక్కరు, కృష్ణాలో ఒక్కరు చొప్పున మొత్తం 8 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. ఏపీలో ఇప్పటివరకూ 2 కోట్ల 81 లక్షల 78 వేల 305 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో గడిచిన 24 గంటల్లో 45,592 శాంపిల్స్‌కు కరోనా టెస్టులు చేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.
Also Read: వానలో తడిసిపోయారా వెంటనే ఇలా చేయండి...
చిత్తూరులో అత్యధికం.. విజయనగరంలో నో కేస్..
కేసులవారీగా చూస్తే గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 153, తూర్పు గోదావరిలో 104, నెల్లూరులో 92, గుంటూరులో 89, ప్రకాశంలో 83, కృష్ణాలో 76 మందికి కరోనా సోకింది. విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో నలుగురు కరోనా బారిన పడ్డారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి