అన్వేషించండి

CM Jagan Review : ప్రతీ పాఠశాలలో టీవీ కంపల్సరీ, నాడు-నేడు రెండో దశ పనులపై సీఎం జగన్ ఆరా!

CM Jagan Review : పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తక్కువ రావడంపై తప్పుగా భావించనక్కర్లేదని సీఎం జగన్ అన్నారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమన్నారు.

CM Jagan Review : నాడు-నేడు రెండో దశ పనులు వేగవంతం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్యా శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. నాడు–నేడు పనుల ప్రగతితో పాటు విద్యాశాఖలో చేపడుతున్న పలు కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. స్కూల్స్‌లో నాడు–నేడు కింద చేపడుతున్న పనుల ప్రగతిపై సీఎం సమీక్షించారు. నాడు–నేడు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యం లోగా పనులు పూర్తి కావాలన్నారు. రెండో దశ నాడు–నేడులో భాగంగా సుమారు 22,344 స్కూల్స్‌లో అభివృద్ధి పనులు చేస్తు్న్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నెలాఖరు నాటికి రెండో దశ కింద అన్ని స్కూల్స్‌లో పనులు మొదలు కావాలని సీఎం ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి పాఠశాలలో టీవీలు ఉండేటట్టు చూసుకోవాలన్నారు. బోధన, మౌలిక సదుపాయాల కల్పనలో  ప్రైవేటు  పాఠశాలలకు ధీటుగా పోటీపడుతున్నామన్నారు. నాడు–నేడు పేరుతో సమూల మార్పులు చేపడుతున్న తరుణంలో టీవీ కూడా ఏర్పాటు చేయాలన్నారు. నాడు నేడు చేపట్టిన స్కూళ్లలో వాచ్‌మెన్‌ నియామకంపై ఆలోచన చేస్తున్నామన్నారు. తద్వారా పాఠశాలలో విలువైన ఆస్తులకు రక్షణ కల్పించగలుగుతామన్నారు. 

పాఠశాలల నిర్వహణపై శ్రద్ధ

సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ పొందిన స్కూళ్లపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సీబీఎస్‌ఈ గుర్తింపు పొందిన స్కూళ్లలోని ఉపాధ్యాయులకు ఉత్తమ శిక్షణ అందించాలన్నారు. వీరికి మంచి శిక్షణ అందించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చన్నారు. స్కూళ్లలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు–నేడు చేపట్టిన తర్వాత వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నిర్వహణ సక్రమంగా చేయకపోతే మరలా మామూలు స్థితికి వస్తాయన్నారు. కాబట్టి స్కూళ్లు, టాయిలెట్లు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఆదేశించారు. 

పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడగలగాలి 

విద్యా కానుక పై సమీక్షించిన సీఎం జగన్.. స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి విద్యా కానుక అందించాలన్నారు. ఈ మేరకు సన్నద్దంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. విద్యా కానుక మెటిరియల్‌ ఇప్పటికే సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్‌ కాలేజీ లేదా హైస్కూల్‌ ప్లస్‌ లేదా కేజీబీవీ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఇందులో భాగంగా బాలికల కోసం 292 మండలాల్లో ఒక హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీ లేదా హైస్కూల్‌ ప్లస్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తున్నామన్నారు.  సమీక్షాసమావేశంలో రీడ్‌ ఎలాంగ్‌ యాప్‌ పనితీరుని  అధికారులు వివరించారు. ఇప్పటి వరకు సుమారు 57,828 మంది రోజూ ఆ యాప్‌ని వినియోగిస్తున్నారని తెలిపారు. ఫొనిటిక్స్‌ మీద ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు. పిల్లలు పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడగలగాలని సీఎం జగన్ అన్నారు. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో తక్కువ ఉత్తీర్ణత శాతం తక్కువ రావడంపై తప్పుగా భావించనక్కరలేదన్నారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన వారికి  నెలలోజుల్లోనే మరలా పరీక్షలు పెడుతూ వాటిని కూడా రెగ్యులర్‌గానే పరిగణిస్తామన్నారు. పదోతరగతిలో పాస్‌ అయిన వారికి కూడా ఏదైనా రెండు  సబ్జెక్టులలో బెటర్‌మెంట్‌ రాసుకోవడానికి అనుమతి ఇస్తున్నామన్న విద్యాశాఖ అధికారులు తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Ongole Politics: కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget