News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

CM Jagan: నాకెంతో గర్వకారణం - మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై స్పందించిన సీఎం జగన్

ఇప్పటికే తాము ఆ బిల్లుపై మద్దతు ప్రకటించడంపై తనకు ఎంతగానో గర్వకారణంగా ఉందంటూ సీఎం జగన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

FOLLOW US: 
Share:

కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టడంపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పందించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు వైఎస్ఆర్‌ సీపీ సంపూర్థంగా మద్దతు తెలుపుతుందని అన్నారు. ఇప్పటికే తాము ఆ బిల్లుపై మద్దతు ప్రకటించడంపై తనకు ఎంతగానో గర్వకారణంగా ఉందంటూ సీఎం జగన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మహిళలకు సాధాకారత చాలా ముఖ్యం అని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించామని సీఎం జగన్ అన్నారు.  

‘‘మహిళలకు సాధికారత కల్పించడం చాలా ముఖ్యం. ఆంధ్రప్రదేశ్‌లో గత 4 సంవత్సరాలలో ప్రవేశపెట్టిన పథకాలు, వివిధ కార్యక్రమాల ద్వారా మాత్రమే కాకుండా, సమాన ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడం ద్వారా కూడా దీనిని సాధించాం. కలిసికట్టుగా.. ప్రకాశవంతమైన, మరింత సమానమైన భవిష్యత్తును సృష్టిద్దాం’’ అని పోస్ట్ చేశారు.

నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు
నూతన పార్లమెంటు భవనం నేడు (సెప్టెంబర్ 19న) అట్టహాసంగా ప్రారంభమైంది. ఇందులో తొలి బిల్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఈరోజు ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ప్రధాని మోదీ నారీ శక్తి చట్టం అని నామకరణం చేశారు. అదే సమయంలో లోక్ సభలో కాంగ్రెస్, ప్రతిపక్ష నేతలు గందరగోళం సృష్టించారు. బుధవారం నుంచి దీనిపై చర్చను ప్రారంభించనున్నారు. 

సోమవారం జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఎంపీలకు అగ్ని పరీక్ష అని పేర్కొన్నట్లు ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ, రాష్ట్ర శాసన సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలి. అయితే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలు పూర్తయినత తర్వాత 2027 నాటికి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. 

కొత్త పార్లమెంటులో తన మొదటి ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ మహిళా సాధికారతపై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌ ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించే భాగ్యం తనకు వచ్చినందుకు దేవుడికి మోదీ కృతజ్ఞత తెలిపారు. "మహిళలు చరిత్ర సృష్టించాల్సిన సమయం ఇది. మహిళా రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రోజు మన ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతోంది. లోక్ సభ, విధానసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును చాలాసార్లు ప్రవేశపెట్టారని, కానీ దేవుడు నన్ను అనేక పవిత్ర పనులకు ఎంపిక చేశాడు" అని అన్నారు. 

అయితే తాజాగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల బిల్లు కాదని అధికారులు చెప్తున్నారు. ఈ అంశంపై కొత్తగా బిల్లును తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ బిల్లు రెండు సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పటిది కాదు. తొలుత 1996లో హెడీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాలలోనూ ఈ బిల్లను ప్రవేశపెట్టినప్పటికీ ఎప్పుడూ ఆమోదం లభించలేదు. చివరగా 2010లో రాజ్యసభలో ఆమోదం పొందింది. అయినప్పటికీ లోక్‌సభలో పెండింగ్‌లో ఉండిపోయింది. 2014లో  అప్పటి లోక్‌సభ రద్దు కావడంతో బిల్లు అక్కడే ఆగిపోయింది.

Published at : 19 Sep 2023 07:30 PM (IST) Tags: YSRCP CM Jagan Parliament news women reservation bill

ఇవి కూడా చూడండి

Roja: బాలకృష్ణవి చిల్లర చేష్టలు! తోకముడిచి పారిపోయారు - చంద్రబాబు క్షమాపణలు కోరాల్సిందే: రోజా డిమాండ్

Roja: బాలకృష్ణవి చిల్లర చేష్టలు! తోకముడిచి పారిపోయారు - చంద్రబాబు క్షమాపణలు కోరాల్సిందే: రోజా డిమాండ్

TTD News: గరుడ సేవ వేళ భక్తులతో తిరుమల కిటకిట - ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ ఛైర్మన్

TTD News: గరుడ సేవ వేళ భక్తులతో తిరుమల కిటకిట - ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ ఛైర్మన్

JC Prabhakar Reddy : కొంత మంది వల్ల న్యాయవ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి - జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు !

JC Prabhakar Reddy : కొంత మంది  వల్ల న్యాయవ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి - జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు !

APBJP : ఏపీలో మద్యం స్కాంపై సీబీఐ విచారణ - కేంద్రాన్ని కోరుతామన్న పురందేశ్వరి !

APBJP : ఏపీలో మద్యం స్కాంపై సీబీఐ విచారణ -  కేంద్రాన్ని కోరుతామన్న పురందేశ్వరి !

YS Bhaskar Reddy : చంచల్ గూడ జైలు నుంచి వైఎస్ భాస్కర్ రెడ్డి విడుదల - ఎస్కార్ట్ బెయిల్ ఇచ్చిన కోర్టు !

YS Bhaskar Reddy :  చంచల్ గూడ జైలు నుంచి వైఎస్ భాస్కర్ రెడ్డి విడుదల - ఎస్కార్ట్ బెయిల్ ఇచ్చిన కోర్టు !

టాప్ స్టోరీస్

Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు