CM Jagan: అధికారం అంటే అజమాయిషీ కాదంటూ సీఎం జగన్ కామెంట్లు!
CM JAGAN: అధికారం అంటే అజమాయిషీ కాదని.. అధికారం అంటే ప్రజల మీద ప్రేమ, మమకారం వారందరి సంక్షేమనం అని మఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.
CM JAGAN: అధికారం అంటే అమాయక ప్రజలపై అజమాయిషీ చూపించడం కాదని.. అధికారం అంటే ప్రజల మీద ప్రేమ, మమకారం, ప్రజలందరి సంక్షేమం అని సీఎం జగన్ తెలిపారు. అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారికి లబ్ధి చేకూరేలా.. కొత్త లబ్ధిదారుల ఖాతాలోకి సంక్షేమ నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అందరికీ సమక్షంలో భాగంగా... తాజాగా మరో 3 లక్షల పది వేల మంది కుటుంబాలకు మేలు కలిగేలా ప్రభుత్వం వ్యవహరించింది. కొత్త లబ్ధిదారుల కోసం 3.17 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
కొత్తగా 2 లక్షల 99 వేల 85 మందికి పింఛన్..
ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. మరో 3 లక్షలకు పైగా కుటుంబాలకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఆగకూడదని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసిన 3 లక్షల 39 వేల 96 మందికి సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈబీసీ నేస్తం కింద మరో 6 వేల 965 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. వైఎస్సార్ పింఛన్ కానుకకు కొత్తగా 2 లక్షల 99 వేల 85 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు.
7 వేల 51 బియ్యం కార్డుల పంపిణీ..
అదే విధంగా కొత్తగా 7 వేల 51 బియ్యం కార్డులు, 3 వేల 55 ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేసినట్లు సీఎం జగన్ వెల్లడించారు. న్యాయంగా అవినీతికి తావు లేకుండా కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా... పారదర్శకంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సంకల్పం అని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత సంక్షేమ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉందని సంబంధిత మంత్రులకు, అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.
నియోజక వర్గానికి 20 లక్షల చొప్పున పంపిణీ..
అలాగే నిధుల లేమి వల్ల రోడ్లు, డ్రైనేజీలు, సహా పలు సమస్యలు పరిష్కరించలేక పోతున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా డబ్బులు ఇస్తానని సీఎం జగన్ ప్రకటించారు. ప్రతి ఎమ్మెల్యేకు 2 కోట్ల చొప్పున అభివృద్ధి నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సచివాలయానికి 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. వీటితో సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు చెప్పారు.
గత మూడేళ్లలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టాలని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు మన మీద ఆధారపడి ఉన్నాయని, వారికి న్యాయం జరగాలంటే... మనం తిరిగి అధికారంలోకి తిరిగి రావాలి అన్నారు. మునుపటి కన్నా మెరుగైన ఫలితాలు రావాలంటే కచ్చితంగా కష్టపడాలని.. ప్రతీ సంక్షేమ పథకాన్నిప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.