అన్వేషించండి

Milan-2022: కళ్లు చెదిరే విన్యాసాలు, విశాఖ చరిత్రలో గర్వించదగిన రోజు : సీఎం జగన్

Milan-2022: ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ మిలన్‌–2022 వేడుకలను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ విన్యాసాల్లో 39 దేశాలు పాల్గొన్నాయి. మిలన్ కు ఆతిథ్యం ఇవ్వడం విశాఖ చరిత్రలోని నిలిచిపోతుందని సీఎం అన్నారు.

Milan-2022: ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ మిలన్‌–2022  కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌. జగన్ దంపతులు పాల్గొన్నారు. నేవల్‌ డాక్‌యార్డులోని ఐఎన్‌ఎస్‌ విశాఖను సీఎం జాతికి అంకితం ఇచ్చారు. ఆర్కే బీచ్‌లోని ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ మిలన్‌ –2022 వేడుకలను ప్రారంభించిన సీఎం మాట్లాడుతూ  మిలన్–2022కు వేదికగా నిలిచిన విశాఖ చరిత్రలో ఇవాళ గర్వించదగిన రోజు. ఈ సాయంత్రం జరుగుతున్న ఉత్సవంలో 39 దేశాలు భాగస్వామ్యులయ్యాయి. భారతీయ నౌకాదళంలో తూర్పుతీర నౌకాదళ కేంద్రం ది సిటీ ఆఫ్‌ డెస్టినీ విశాఖపట్నం పాత్ర చిరస్మరణీయమైనది. విశాఖపట్నం పేరు మీద రూపొందించిన ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధనౌక భారతీయ యుద్ధనౌకల్లో కచ్చితంగా గర్వకారణంగా నిలుస్తుంది. ఇది భిన్నమైన సామర్ధ్యం కలిగిన యుద్ధనౌక. ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామి దేశీయంగా జలాంతర్గామిలను రూపొందించడంలో మన శక్తి సామర్ధ్యాలను నిరూపించింది. 

Milan-2022: కళ్లు చెదిరే విన్యాసాలు, విశాఖ చరిత్రలో గర్వించదగిన రోజు : సీఎం జగన్

ఐఎన్ఎస్ విశాఖపై డాల్ఫిన్ నోస్ 

భారత నౌకాదళం ఆధ్వర్యంలో 39 దేశాలతో కలిపి మిలన్‌ పేరుతో జరిగే నౌకాదళ విన్యాసాలకు విశాఖ సాగర తీరం విడిది అయిందని సీఎం జగన్ అన్నారు. ఇది ఒక అరుదైన యుద్ధనౌకా విన్యాసాల పండుగ అని వ్యాఖ్యానించారు. ఈ పండుగకు దాదాపుగా 39 దేశాలను ఆహ్వానించారన్నారు. భారత నౌకాదళానికి, ప్రత్యేకించి ఈస్ట్రర్న్‌ నేవల్‌ కమాండ్‌కు అనేక దేశాల నుంచి వచ్చి, ఈ విన్యాసాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం అనే యుద్ధనౌకను కొద్ది కాలం క్రితమే నౌకాదళంలోకి తీసుకొచ్చారన్న సీఎం, ఈ నౌక పైభాగం మీద కూడా ప్రత్యేకించి విశాఖపట్నంలోని డాల్ఫిన్‌ లైట్‌హౌస్‌ను, ఇక్కడ సహజంగా, ప్రకృతి ప్రసాదంగా ఏర్పడిన డాల్ఫిన్‌నోస్‌ను, రాష్ట్ర మృగం కృష్ణజింకను ఐఎన్‌ఎస్‌ విశాఖ మీద చిత్రీకరించాలని గుర్తుచేశారు. అలాగే కొత్తగా నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామి విశాఖ తీరంలోకి రావడంతో ఈ ప్రాంత రక్షణలో మరో అధ్యాయం ప్రారంభమైందన్నారు. ఇలాంటి నౌకలతో జరిగే విన్యాసాలు విశాఖ ప్రజలతో ఎంతో ఉత్సాహంతో పాటు దేశ రక్షణ కోసం నిరంతరం పాటుపడుతున్న సైన్యం మీద మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. ఈ విన్యాసాల ద్వారా సైనిక శక్తి మీద మరింత నమ్మకాన్ని పెంచగలుగుతామని సంపూర్ణంగా భావిస్తున్నామన్నారు.  

Milan-2022: కళ్లు చెదిరే విన్యాసాలు, విశాఖ చరిత్రలో గర్వించదగిన రోజు : సీఎం జగన్

మిలన్ విన్యాసాలకు తొలిసారి వేదిక 

39 దేశాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు, భారత నావికాదళం నుంచి పాల్గొన్న ఇతర ప్రతినిధులు, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్స్, ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ , ఫైర్‌ సర్వీసెస్‌ , సీ కాడెట్‌ కాప్స్, నేవీ కాడెట్‌ కాప్స్, స్కూల్స్, మిత్ర దేశాలు, బ్యాండ్‌ ట్రూప్స్, కల్చరల్‌ ట్రూప్స్‌ కలిపి అధ్భుతంగా నిర్వహించిన పెరేడ్, విన్యాసాలు ఈ కార్యక్రమాన్ని మంచి జ్ఞాపకంగా మిగిల్చాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.  రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్‌ నేవీ కలిసి సంయుక్తంగా ఈ తరహా కార్యక్రమానికి విశాఖపట్నం కేంద్రంగా నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని సీఎం వైయస్‌.జగన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో నావికాదళ ఉన్నతాధికారులతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

Milan-2022: కళ్లు చెదిరే విన్యాసాలు, విశాఖ చరిత్రలో గర్వించదగిన రోజు : సీఎం జగన్

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget