CM Jagan : ఒక్కో ఓటర్‌ని ఐదు సార్లు కలవండి - బూత్ కమిటీలకు సీఎం జగన్ దిశానిర్దేశం
YSRCP Meeting : వైసీపీ బూత్ స్థాయి నేతలకు సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. ఒక్కో ఓటర్‌ని ఐదు సార్లు కలవాలన్నారు.
CM Jagan gave key instructions to YCP booth level leaders : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి క్యాడర్ కు సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. మీ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల లోపు కనీసం ఐదారు సార్లు కలవండి. మనం చేసిన, చేసే మంచి పనులు చెప్పండి. బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత తొందరగా యాక్టివేట్ చెయ్యాలి. సోషల్ మీడియాలో పార్టీ క్యాడర్ క్రియాశీలకంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. తమ తమ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల లోపు ఐదుసార్లు కలవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ పథకాలను, పనులను ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. మేము సిద్ధం.. బూత్ సిద్ధం వర్క్ షాప్ లో సీఎం జగన్.. వైసీపీ నేతలకు ఎన్నికల ప్రచారంపై రూట్ మ్యాప్ ఇచ్చారు. రానున్న 45 రోజులు అత్యంత కీలకం అని సీఎం జగన్ అన్నారు.
అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తి
మంగళగిరిలోని సీకె కన్వెన్షన్ హాల్‌లో పార్టీ క్యాడర్‌కు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఏయే సంక్షేమ కార్యక్రమాలు చేసింది అనేది అనేకసార్లు క్షేత్రస్థాయిలో ప్రజలకు చెప్పడం జరిగింది. మరొకసారి క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని, పూర్తి స్థాయిలో ప్రజలను ఐదారుసార్లు కలిసి.. ప్రభుత్వం చేసిన పథకాలు, మంచి గురించి చెప్పాలని వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు జగన్. ఇప్పటివరకు నేను పని చేశాను, ఇక నుంచి పూర్తిగా మీరే పని చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. వైసీపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తైంది.. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న మార్పులు తప్ప.. మిగిలిన అభ్యర్థులు అంతా సిద్దంగా ఉననట్లు జగన్ చెప్పారు.
చిన్న చిన్న మార్పులు తప్ప సమన్వయకర్తలే అభ్యర్థులు
చిన్న చిన్న మార్పులు తప్ప.. ఇంఛార్జిలే అభ్యర్థులుగా ఉంటారని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైసీపీ నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రస్తుతం ఎవరైతే ఇంఛార్జిలుగా ఉన్నారో వారే అభ్యర్థులుగా ఉంటారని జగన్ చెప్పారు. ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మార్పులు ఉంటాయి తప్ప.. మిగతా చోట్ల ఇంఛార్జులే అభ్యర్థులుగా కొనసాగుతారని జగన్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఏ వ్యూహంతో ముందుకెళ్లాలి? ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి? అన్న దాని గురించి సుదీర్ఘంగా గంటన్నర పాటు సీఎం జగన్ మాట్లాడారు.
ఐ ప్యాక్ స్పెషల్ ప్రజెంటేషన్
ఈ సమావేశంలో బూత్ కమిటీలను బలోపేతం చేయడంపై వైసీపీ శ్రేణులకు ఐప్యాక్ టీం ప్రజెంటేషన్ ఇచ్చారు. మార్చి 15లోపు బూత్ కమిటీలను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయాలని రూట్ మ్యాప్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న కమిటీలు సోషల్ మీడియాలో ఏ విధంగా యాక్టివ్ గా ఉండాలి.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలో, విపక్షాలు చేసే అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే 90 శాతం వరకు వైసీపీ బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తోంది. మిగిలిన వాటిని కూడా వారం రోజుల్లో చేయాలని చూస్తోంది