అన్వేషించండి

CM Jagan On Oscar: ఎక్సలెన్స్ అనే పదానికి వీరు కొత్త అర్థం చెప్పారు - ఆస్కార్‌ సాధించడంపై సీఎం జగన్

ఎక్స్‌లెన్స్ అనే పదానికి ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణి సరికొత్త నిర్వచనం చెప్పారని సీఎం జగన్ కొనియాడారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ప్రపంచ ప్రఖ్యాత పురస్కారం అయిన ఆస్కార్ గెల్చుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ అవార్డుతో తెలుగు వారి ఖ్యాతి మరింత పెరిగిందని ట్వీట్ చేశారు. ఎక్స్‌లెన్స్ అనే పదానికి ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణి సరికొత్త నిర్వచనం చెప్పారని సీఎం జగన్ కొనియాడారు. తెలుగువారినే కాక, భారతదేశం మొత్తాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు.

‘‘తెలుగు జెండా మరింత పైకి ఎగిరింది. ఈ తెలుగు పాట మనకు ఎంతో గర్వకారణం. అంతర్జాతీయంగా గుర్తింపు పొందడమే కాకుండా మన జానపద వారసత్వాన్ని చాటింది. ఎక్స్‌లెన్స్ అనే పదానికి ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణి సరికొత్త నిర్వచనం చెప్పారు. 

ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఇంకా ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తానికి ధన్యవాదాలు తెలుగు వారినే కాక, దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు’’ అని సీఎం ట్వీట్ చేశారు.

సీఎం కేసీఆర్ అభినందనలు

ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు' పాట కు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.

ఆస్కార్ అవార్డు  పొందిన నాటు నాటు  పాటలో  పొందుపరిచిన పదాలు.. తెలంగాణ సంస్కృతికి,  తెలుగు ప్రజల రుచి అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట రచయితను సీఎం ప్రత్యేకంగా కొనియాడారు. నాటి ఉమ్మడి వరంగల్  నేటి  జయశంకర్  భూపాలపల్లి  జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామ బిడ్డ చంద్రబోస్ ను సీఎం మనసారా అభినందించారు.

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి, పాట కూర్పులో భాగస్వాములైన దర్శకుడు రాజమౌళి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సినిమా నిర్మాత డివివి దానయ్య, ఇతర సాంకేతిక సిబ్బందికి సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

నిర్మాణ విలువల పరంగాను, సాంకేతికంగాను హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో చిత్రాలు రూపొందుతుండటం గొప్ప విషయమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆస్కార్ అవార్డుతో  తెలంగాణ కేంద్రంగా, హైదరాబాద్ గడ్డమీద దినదినాభివృద్ధి చెందుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కీర్తి దిగంతాలకు వ్యాపించిందని సీఎం ప్రశంసించారు. ఈ అవార్డు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లకే కాకుండా, తెలుగు, ద్రావిడ భాషలకు, యావత్ భారత దేశానికి గర్వకారణం అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Jr NTR: ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ శాఖ సిబ్బందిపై స్థానికుల దాడి, ప్రాణ భయంతో పరుగులు!
హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ శాఖ సిబ్బందిపై స్థానికుల దాడి, ప్రాణ భయంతో పరుగులు!
Sridevi Drama Company Latest Promo: శ్రీదేవి డ్రామా కంపెనీలో బోనాల సందడి - వచ్చే ఆదివారం కోసం ధూమ్ ధామ్ ధమాకా, ప్రోమో చూశారా?
శ్రీదేవి డ్రామా కంపెనీలో బోనాల సందడి - వచ్చే ఆదివారం కోసం ధూమ్ ధామ్ ధమాకా, ప్రోమో చూశారా?
Amardeep Chowdary: అమర్ దీప్... ఏమంటున్నావ్ రా, బాతు పేరుతో ప్రేమ లేఖలో ఆ బూతులేంటి?
అమర్ దీప్... ఏమంటున్నావ్ రా, బాతు పేరుతో ప్రేమ లేఖలో ఆ బూతులేంటి?
Embed widget