అన్వేషించండి

OPS For AP Employees: ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాత పెన్షన్ పునరుద్ధరణ, ఒక్క ఉద్యోగికి రూ. 3.39 కోట్ల మేర ప్రయోజనం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఉద్యోగులకు రెండు శుభవార్తలు అందించింది. 10,715 మందికి పాత పెన్షన్ (Old Pension Scheme) పునరుద్ధరించడానికి ఆమోదం , పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ 10,715 మందికి పాత పెన్షన్ పథకం ఆమోదించింది.
  • ఒక్కో ఉద్యోగికి 3.39 కోట్ల ప్రయోజనం, రాష్ట్రంపై భారీ భారం.
  • ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుండి 62 ఏళ్లకు పెంపు.
  • ఈ నిర్ణయాలతో ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.

AP Cabinet Decisions | అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు శుభవార్తలు అందించింది. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న 2 సమస్యలను పరిష్కరిస్తూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. 2004 సెప్టెంబరు కంటే ముందు జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలకు ఎంపికై, వివిధ కారణాల వల్ల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం (CPS) అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని (OPS) వర్తింపజేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి 2020లోనే మెమో-57 జారీ చేసినప్పటికీ, గత ప్రభుత్వం దీనిని అమలు చేయలేదని మంత్రులు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 10,715 మంది ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పాత పెన్షన్ ప్రయోజనం పొందనున్నారు.

ఒక్కో ఉద్యోగికి రూ. 3.39 కోట్ల మేర ప్రయోజనం
గతంలో 2017లోనే దేశంలో ఎక్కడా లేని విధంగా సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఉద్యోగి చనిపోతే వారి కుటుంబానికి పెన్షన్ ఇచ్చే నిర్ణయాన్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వమే తీసుకుంది. ఇప్పుడు మరోసారి ఈ 10 వేలకు పైగా ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరించడం ద్వారా ఒక్కో ఉద్యోగికి సగటున రూ. 3.39 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం లభించనుంది. దీనివల్ల 2026 నుంచి 2067 వరకు రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ. 34,850.83 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read: AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!

రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం
మరో కీలక నిర్ణయంలో భాగంగా, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, షెడ్యూల్‌ 9, 10 పరిధిలోని సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గత ప్రభుత్వం ఈ ఫైల్ రెండుసార్లు తిరస్కరించినప్పటికీ, ఉద్యోగుల రిక్వెస్ట్ మేరకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించగా, ఆయన కేబినెట్ ఆమోదం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని 2022 జనవరి నుంచి వర్తింపజేయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. దీనివల్ల ఇప్పటికే ఆయా సంస్థల్లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుని, 62 ఏళ్లు నిండేవరకు కొనసాగనున్నారు ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మందికి పైగా కార్పొరేషన్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు
ఏపీ మంత్రివర్గ సమావేశంలో పాత పెన్షన్ పునరుద్ధరణ (OPS), కార్పొరేషన్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడం ద్వారా తమకు ఎంతో ఊరట, ఆర్థిక ప్రయోజనం కలిగిందని సీఎంకు వివరించారు. సీఎం చంద్రబాబును కలిసిన వారిలో ఏపీ ఐకాస ఛైర్మన్, ప్రధాన కార్యదర్శులు ప్రసాద్, విద్యాసాగర్, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ, నాపా ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Frequently Asked Questions

ఏ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (OPS) వర్తిస్తుంది?

2004 సెప్టెంబరు కంటే ముందు జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై, CPS అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు OPS వర్తిస్తుంది. దీనివల్ల 10,715 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు ఎంతకు పెంచబడింది?

ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచబడింది. ఈ నిర్ణయం 2022 జనవరి నుంచి వర్తిస్తుంది.

పాత పెన్షన్ విధానం అమలుతో ఉద్యోగులకు ఆర్థికంగా ఎంత ప్రయోజనం కలుగుతుంది?

పాత పెన్షన్ పునరుద్ధరణ వల్ల ఒక్కో ఉద్యోగికి సగటున రూ. 3.39 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. దీనివల్ల రాష్ట్రంలోని 10,715 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.

పెంచిన పదవీ విరమణ వయసుతో ఎంత మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది?

పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపుదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మందికి పైగా కార్పొరేషన్ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. 2022 జనవరి నుండి రిటైరైన వారు తిరిగి విధుల్లోకి తీసుకోబడతారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget