Chittoor News: రాత్రికి రాత్రి పెళ్లి పందిరి నుంచి వధువు పరారీ
చిత్తూరులో ఓ పెళ్లి పందిరి నుంచి రాత్రికి రాత్రే పెళ్లి కూతురు పరారైంది. పెళ్లి కొడుకు కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
సాధారణంగా సినిమాల్లో జరిగే పెళ్లిల్లలో తాళి కట్టే సమయానికి ఎవరో ఒకరు వచ్చి.. ఆపండి అంటారు. లేదా పెళ్లి పందిరి నుంచి పెళ్లి కూతురు తప్పించుకుని వెళ్లిపోతుంది. అయితే ఇలానే కొద్ది గంటల్లో పెళ్లి జరుగుతుందనగా సినీ ఫక్కీలో పెళ్లి పందిరి నుంచి పెళ్లికూతురు పరారైంది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ ఘటన జరిగింది.
Also Read: Odisha News: చావైనా నీతోనే... భార్య చితిలో దూకిన భర్త... ఒడిశాలో పతీసహగమనం
ఏం జరిగింది..?
అనంతపురం జిల్లా ఎన్‌పీకుంట మండలం బలిజపల్లెకు చెందిన యువకుడు (26)కి, తంబళ్ళపల్లె మండలం కొటాల పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు.
Also Read:Ahmedabad: కండోమ్ మర్చిపోయి.. ఆ పదార్థంతో లైంగిక చర్య, వెంటనే చనిపోయాడు!
ఇరు కుటుంబాలు మదనపల్లెకు వచ్చి అమ్మచెరువు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో బుధవారం ఉదయం వివాహానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఇంతవరకు అంతా బాగనే ఉంది. అయితే కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి వధూవరులకు నలుగు పెట్టారు. అనంతరం పెళ్లికుమార్తె రాత్రికి రాత్రే ఎవరికీ తెలియకుండా పరారైంది. తమకు ఒక్క మాట కూడా చెప్పలేదని తల్లిదండ్రులు వాపోయారు. పెళ్లి ఇష్టం లేదని కూడా తమకు చెప్పలేదన్నారు. వధువు కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తున్నారు.
తమకు అవమానం జరిగిందని పెళ్లి కొడుకు, బంధువులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో పెళ్లికూతురు మైనర్ అని తేలింది. ఒకటో పట్టణ ఎస్సై లోకేష్ దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Covid 19 India Cases: కరోనా కేసుల్లో భారీ పెరుగుదల.. కొత్తగా 46,164 కేసులు