Chittoor News : రూ. ఐదు నాణెం మింగేసిన బాలుడు, తల్లిదండ్రులకు వైద్యుల నిర్లక్ష్య సలహా!

Chittoor News : ఆడుకుంటూ ఓ చిన్నారి రూ.ఐదు కాయిన్ మింగేశాడు. బాలుడిని తీసుకుని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తల్లిదండ్రులను గంటల కొద్దీ తిప్పిన వైద్యులు, సిబ్బంది చివరకు ఉచిత సలహా ఇచ్చారు.

FOLLOW US: 

Chittoor News : వైద్యులంటే భగవంతునికి మరో రూపంగా భావిస్తాం. వైద్యులను దేవుడికి ప్రతిరూపంగా భావిస్తుంటారు. అందుకే వైద్యులకు సమాజంలో ప్రత్యేక స్థానం ఇస్తుంటారు. అంతటి పవిత్రమైన వృత్తికి కొందరు చెడ్డ పేరును తీసుకొస్తున్నారు. తాజాగా నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ ఐదు రూపాయల కాయిన్ మింగేశాడు. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.  బాలుడికి చికిత్స అందించేందుకు వైద్యులు నిర్లక్ష్యం వహించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

అసలేం జరిగింది? 

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లెపల్లెకు చెందిన బాలాజీ, అరుణ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు రాకేష్ ఉన్నాడు. బాలాజీ రోజు వారి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. బుధవారం సాయంత్రం తినుబండారాలు కొనుక్కొనేందుకు రాకేష్ కు తల్లి అరుణ ఐదు రూపాయలు ఇచ్చింది. అయితే తల్లి వద్ద డబ్బులు తీసుకున్న రాకేష్ తన స్నేహితులతో ఆడుకుంటూ తన వద్ద ఉన్న ఐదు రూపాయల కాయిన్ ను నోటిలో వేసుకున్నాడు. అలానే ఐదు రూపాయల బిళ్లను మింగేశాడు. నాణెం బాలుడి గొంతులో ఇరుక్కుపోయింది. ఇది చూసిన స్థానికులు రాకేష్ తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు. బాలుడు నోటిలో నుంచి నాణెం తీసేందుకు ప్రయత్నించారు కానీ నాణెం బయటికి రాకపోయే సరికి రాకేష్ తల్లిదండ్రులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

గంటల కొద్దీ నిరీక్షణ

బాలుడిని ఎమర్జెన్సీ వార్డులో ఉన్న సిబ్బందికి చూపించి తన బాలుడు నోటిలో ఐదు రూపాయల నాణెం ఇరుక్కు పోయిందని చెప్పారు. అయితే ఆ సమయానికి వైద్యులు లేకపోయే సరికి వార్డులో ఉన్న నర్సులు బాలుడిని పరీక్షించి డాక్టర్ లేరని, కొంతసేపు వేచి ఉండమని చెప్పారు. ఎంతసేపు వేచి ఉన్నా డాక్టర్ రాక పోయేసరికి వార్డులో ఉన్న నర్సును అడిగారు. వైద్యులు వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని వేచి ఉండాలని చెప్పింది. చాలా సేపటి తర్వాత వైద్యులు రావడంతో బాలుడిని డాక్టర్ కు చూపించారు బాలుడి తండ్రి బాలజీ. అయితే బాలుడిని పరీక్షించిన వైద్యులు స్కానింగ్ తీయాలని చెప్పి ఆ చీటీని రాసి స్కానింగ్ తీసుకుని వస్తే, దాని రిపోర్ట్ ఆధారంగా నాణెం ఎక్కడ ఉందో గుర్తించి తీసేందుకు వీలు అవుతుందని చెప్పారు. వెంటనే ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్ వద్దకు బాలుడిని తీసుకెళ్లారు బాలాజీ. అక్కడ స్కానింగ్ తీసే సిబ్బంది లేకపోయే సరికి గంటల కొద్ది బాలుడిని పెట్టుకుని తల్లిదండ్రులు నిరీక్షించారు. కానీ సిబ్బంది రాకపోయే సరికి, తిరిగి ఎమర్జెన్సీ వార్డుకు  వెళ్లి విషయం చెప్పి, స్కానింగ్ సిబ్బందికి ఫోన్ చేయించారు బాలాజీ. దీంతో స్కానింగ్ సెంటర్ వద్దకు వచ్చిన సిబ్బంది బాలుడికి స్కానింగ్ చేశారు. 

ఉచిత సలహా

ఆ రిపోర్టును తీసుకుని వైద్యుల వద్దకు వెళ్లిన బాలుడి తల్లిదండ్రులకు నాణెన్ని తీసేందుకు వీలుకాదని, తిరుపతికి గానీ, వేలూరు సీఎంసీ ఆసుపత్రికి గానీ తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన బాలుడి తల్లిదండ్రులు, బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగ్గారు. ఇక చేసేది లేక బాలుడిని బంధువుల సహాయంతో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాలుడి గొంతు నుంచి చాకచక్యంగా ఐదు రూపాయల నాణెం తొలగించడంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. 

Published at : 26 May 2022 10:41 PM (IST) Tags: Chittoor News doctors negligence Boy swallows Five Rupees Chittoor Govt Hospital

సంబంధిత కథనాలు

MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు

MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు

Breaking News Live Telugu Updates: పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి మాతృవియోగం

Breaking News Live Telugu Updates: పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి మాతృవియోగం

President Elections: ప్రధానికి జగన్ ఆ కండీషన్స్ పెట్టుంటే బాగుండేది - మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

President Elections: ప్రధానికి జగన్ ఆ కండీషన్స్ పెట్టుంటే బాగుండేది - మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

Petrol-Diesel Price, 5 July: ఈ నగరాల్లో ఇవాళ ఇంధన ధరలు పైపైకి! ఇక్కడి వారికి మాత్రం గుడ్ న్యూస్

Petrol-Diesel Price, 5 July: ఈ నగరాల్లో ఇవాళ ఇంధన ధరలు పైపైకి! ఇక్కడి వారికి మాత్రం గుడ్ న్యూస్

Gold-Silver Price: రెండ్రోజుల నుంచి నిలకడగా బంగారం ధర, నేడు ఎగబాకిన వెండి, లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold-Silver Price: రెండ్రోజుల నుంచి నిలకడగా బంగారం ధర, నేడు ఎగబాకిన వెండి, లేటెస్ట్ రేట్లు ఇవీ

టాప్ స్టోరీస్

Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భార‌త‌ ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు

Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భార‌త‌ ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు

RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?

RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?

Hyderabad Traffic News: నేడు రూట్స్‌లో వెళ్తే ఇరుక్కున్నట్లే! వేరే మార్గాలు చూసుకోవాలన్న పోలీసులు

Hyderabad Traffic News: నేడు రూట్స్‌లో వెళ్తే ఇరుక్కున్నట్లే! వేరే మార్గాలు చూసుకోవాలన్న పోలీసులు

Assam Floods: ఆ వరదలు కావాలని సృష్టించినవే- తాజాగా ఇద్దరు అరెస్ట్!

Assam Floods: ఆ వరదలు కావాలని సృష్టించినవే- తాజాగా ఇద్దరు అరెస్ట్!