Chandrababu Visits Daggubati : దగ్గుబాటికి స్టెంట్ - పరామర్శించిన చంద్రబాబు !
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావును చంద్రబాబు పరామర్శించారు. ఉదయం వాకింగ్ చేస్తూండగా ఆయనకు ఛాతిలో ఇబ్బందిగా ఉండటంతో ఆస్పత్రిలో చేరారు.
Chandrababu Visits Daggubati : బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుండె సంబంధిత అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దగ్గుబాటిని .. టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన వద్దకు చంద్రబాబు వెళ్లారు. దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఆస్పత్రిలో ఉన్నారు. దగ్గుబాటిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
జూలై 4న ఏపీకి ప్రధాని - స్కూళ్ల రీఓపెనింగ్ ఐదో తేదీకి మార్చిన ప్రభుత్వం !
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉదయం వాకింగ్ చేస్తూండగా ఛాతిలో నొప్పిగా అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా టెస్టులు నిర్వహించిన వైద్యులు స్టెంట్‌లు వేయాలని నిర్ణయించారు. వెంటనే రెండు స్టెంట్‌లు వేశారు. సాయంత్రానికి పరిస్థితి కుదట పడినట్లుగా తెలుస్తోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని పర్చూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వాస్తవానికి ఆ స్థానం నుంచి కుమారుడ్ని పోటీ చేయించాలనుకున్నారు. కానీ అమెరికన్ సిటిజన్ కావడం.. సిటిజన్ షిప్‌ను రద్దు చేసుకోవడంలో సమస్యలు ఏర్పడటంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావే పోటీ చేశారు.
ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో 14 మంది, ముగిసిన ప్రచార పర్వం
పరాజయం తర్వాత కొన్నాళ్లు వైఎస్ఆర్‌సీపీలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ తర్వాత క్రమంగా దూరమయ్యారు. వైఎస్ఆర్‌సీపీ రాజీనామా చేసినట్లుగానే ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన కుమారుడు కూడా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. దీంతో పర్చూరుకు వైఎస్ఆర్‌సీపీ తరపున ఇతర నేతను ఇంచార్జిగా నియమించారు. దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం బీజేపీ సీనియర్ నేతగా కీలక పదవిలో కొనసాగుతున్నారు.
ఆమంచికి సీబీఐ నోటీసులు - బుధవారం రావాలని ఆదేశం ! ఏ కేసులో అంటే ?
గతంలో తెలుగుదేసం పార్టీలో ఏర్పడిన అంతర్గ పరిస్థితుల కారణంగా దగ్గుబాటి, నారా కుటుంబాల మధ్య సఖ్యత లేదు. ఇటీవల ఓ కుటుంబ వివాహ వేడుకలో రెండు కుటుంబాలు పాల్గొన్నాయి. ఆ వేడుకలో అందరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అప్పట్నుంచి మళ్లీ సంబంధాలు మెరుగుపడినట్లుగా భావిస్తున్నారు. ఇప్పుడు కూడా దగ్గుబాటి, చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడుకోవడంతో కుటుంబ పరంగా అంతా కలిసిపోయినట్లుగానే టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
పోటీ లేని ఆత్మకూరులోనూ సర్వశక్తులు ఒడ్డుతున్న వైఎస్ఆర్‌సీపీ ! మెజార్టీ కోసమేనా ?