Mahanadu Chandrababu Speech: వైనాట్లు,గొడ్డలి పోట్లు మన రాజకీయం కాదు - కలసి కట్టుగా ఉంటే వైసీపీ అడ్రెస్ ఉండదు - మహానాడులో చంద్రబాబు ప్రసంగం
Chandrababu Speech: కార్యకర్తలంతా సమైక్యంగా ఉంటే వైసీపీ అడ్రస్ ఉండదని చంద్రబాబు అన్నారు. కడప మహానాడు బహిరంగసభలో టీడీపీ క్యాడర్ కు జోష్ ఇచ్చేలా ప్రసంగించారు.

Mahanadu Chandrababu : టీడీపీ కార్యకర్తలంతా ఐక్యంగా ఉంటే వైసీపీ అడ్రస్ ఉండదని చంద్రబాబు అన్నారు. కడపలో జరిగిన మహానాడు ముగింపు బహిరంగసభలో చంద్రబాబు ప్రసగించారు. కడప తెలుగు దేశం పార్టీ అడ్డా అని నిరూపించారు.. జనసముద్రంతో కడప మునిగిపోయిందని సంతృప్తి వ్యక్తం చేశారు. కడపలో మహానాడు పెడతారని అందరూ అనుకున్నారా.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు.. దేవుని కడపలో మహానాడు పెట్టి చూపించామన్నారు. కడప గడపలో మహానాడు సూపర్ హిట్ అయ్యింది.. అహంకారంతో విర్రవీగేవారికి ఎన్నికల్లో ప్రజలు అద్భుత తీర్పు చెప్పారు.. ఉమ్మడి కడపలో పదికి 7 స్థానాల్లో గెలిచాం.. వచ్చే ఎన్నికల్లో పదికి పది స్థానాలు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు.
ఆపరేషన్ సిందూర్ పేరుతో పెహల్గామ్ ముష్కరులను ప్రధాని మోడీ అంతం చేశారని చంద్రబాబు అన్నారు. దేశానికి టెర్రరిస్టుల వల్ల చాలా నష్టం జరుగుతోంది.. మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా ఆర్థిక ఉగ్రవాదుల వల్ల చాలా నష్టం జరిగిందన్నారు. ల్యాండ్, శాండ్, మైన్ అన్నీ దోచేసుకున్నారు.. ఎక్కడ చూసిన జే బ్రాండ్ తో నాసిరకం మద్యం వ్యాపారం చేశారు.. డ్రగ్స్, గంజాయితో యువత నిర్వీర్యమైపోయింది.. ఎవరైనా సరే గంజాయి, డ్రగ్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం.. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్.. అదే మీకు చివరి రోజు అని హెచ్చరించారు.
ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకే తెలుగుదేశం పార్టీ పుట్టిందని టీడిపి అధినేత చంద్రబాబు తెలిపారు. రాయలసీమ గర్జన రాష్ట్రమంతా మార్మోగాలన్నారు. మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని కడప ప్రజలు చాటారన్నారు. ఇప్పటికే 10 అసెంబ్లీ స్థానాల్లో 7 గెలిచి సత్తా చాటిన మనం 2029 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. పరిపాలన ఎలా చేయకూడదో వైఎస్సార్సీపీ పాలన ఓ కేస్ స్టడీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైనాట్లు, గొడ్డలి పోట్లు మన రాజకీయం కాదని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయటమే మన విధానమన్నారు. క్లైమోర్మైన్స్కే భయపడని నేను, సమస్యలకు భయపడతానా అని తెలిపారు. నా కష్టం నా కోసం కాదని, నన్ను నమ్ముకున్న జనం కోసమని చంద్రబాబు స్పష్టం చేశారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు మార్చేందుకు ఇటుక ఇటుక పేర్చుతూ ముందుకెళ్తున్నామని వెల్లడించారు. కలసి కట్టుగా ఉంటే వైసీపీ అడ్రస్ ఉండదన్నారు.
వచ్చే మహానాడు నాటికి ప్రజల భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ప్రకటించారు. పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్లు మూసేసిన జగన్ మనస్థత్వం ఏమిటో అందరూ ఆర్థం చేసుకోవాలన్నారు. పేదల పొట్టకొట్టేవాడు రాష్ట్రానికి అవసరం లేదన్నారు. అహంకారంతో విర్రవీగే వాడికి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని తెలిపారు. తెలుగుదేశం బీసీల పార్టీ, పార్టీకి వెన్నెముక వారే అని వెల్లడించారు. సంపద సృష్టించటం తెలిసిన పార్టీ తెలుగుదేశంఅని స్పష్టం చేశారు. సూర్యఘర్ రాయితీని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల భూములన్నీ కొట్టేయాలని చూశారని ..దాన్ని తాము రాగానే రద్దు చేశామన్నారు.





















