By: ABP Desam | Updated at : 30 Sep 2023 01:03 PM (IST)
చంద్రబాబు మాజీ పీఎస్ సస్పెండ్ - అమెరికాకు వెళ్లి తిరిగిరాలేదన్న ప్రభుత్వం !
Chandrababu Naidu Arrest : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకుంది. అనుమతి లేకుండా అమెరికా వెళ్లారని శ్రీనివాస్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పెండ్యాల శ్రీనివాస్ ప్రస్తుతం ప్రణాళికా విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నారు. ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులను సీఎస్ జవహర్‌రెడ్డి జారీ చేశారు. సిల్క్ డెవలప్‌మెంట్ కేసులో శ్రీనివాస్‌ను కూడా నిందితుడిగా సీఐడీ చేర్చింది. చర్యలు తీసుకున్న అధికారులు శుక్రవారంలోగా రావాలని శ్రీనివాస్‌కు అధికారులు నోటీసు ఇచ్చారు. కానీ ఆయన అమెరికా నుంచి తిరిగి రాలేదు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెండ్యాల శ్రీనివాస్ కొంత కాలం పీఎస్‌గా పని చేశారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి. డిప్యూటేషన్ పై సీఎం వద్ద పని చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత మళ్లీ ఆయన మాతృశాఖకు వెళ్లి ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆయన ఇంట్లో ఓ సారి ఐటీ దాడులు జరిగాయి. ఆ దాడులకు సంబంధించి మీడియాలో అనేక ప్రచారాలు జరిగాయి. అయితే రెండు లక్షల నగదు మాత్రమే ఆయన ఇంట్లో ఉందని.. అది నిబంధనలకు అనుగుణంగానే ఉన్నందున ఆ మొత్తం కూడా తిరిగి ఇచ్చి వెళ్లినట్లుగా ఐటీ అధికారులు రసీదులు ఇచ్చారు.
స్కిల్ డెలవప్‌మెంట్ ప్రాజెక్టు విషయంలో పెండ్యాల శ్రీనివాస్ ను కూడా నిందితునిగా చేర్చింది సీఐడీ. అయితే ఇటీవల ఆయన అమెరికాకు వెళ్లారు. గత రెండేళ్లుగా ఆయన ప్రభుత్వంలోనే పని చేస్తున్నారు. కానీ వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినప్పుడు ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కేసు గురించి బయటకు వచ్చింది కాబట్టే పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు పారిపోయాడని సీఐడీ అంటోంది. అయితే రెండేళ్లు ప్రభుత్వంలోనే పని చేస్తున్నాడని అనారోగ్యం కారణంగా అధికారికంగా సెలవు తీసుకుని అమెరికా వెళ్లాడని .. ప్రభుత్వంలో అధికారికగా ఉన్న రెండేళ్ల పాటు ఎందుకు ఆయనను ప్రశ్నించలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
సీమెన్స్ , డిజైన్ టెక్ తో కలిసి ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన స్కిల్ డెలవప్‌మెంట్ సెంటర్ల విషయంలో నిధుల దుర్వినియోగం జరిగిదని.. డబ్బులు దారి మళ్లించారని.. చంద్రబాబు కుటుంబానికి లబ్ది కలిగిదంని ఆరోపిస్తూ.. సీఐడీ అధికారులు కేసులు పెట్టారు. డబ్బులు ఎలా దారి మళ్లాయో పెండ్యాల శ్రీనివాస్‌కు తెలుసని.. ఆయనను విచారించాలనుకుంటే విదేశాలకు పారిపోయారని సీఐడీ చెబుతోంది.
Anantapur Police Supended: ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ
APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా
CM Jagan Phone To KTR : కేటీఆర్‌కు ఏపీ సీఎం జగన్ ఫోన్ - ఎందుకంటే ?
Andhra News: ఆ ఓటర్లకు షాక్ - డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు
CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
/body>